22, మే 2015, శుక్రవారం

నా అంతరంగం.. నా బంగారు తల్లి.......

            
      అవునండి!  నా  బంగారు  తల్లి   నా అంతరంగం.  

              చక్కగా M.Sc Computers  చదువుకుంది.  అర్ధరాత్రి  అపరాత్రి  అని  చూడకుండా  వీణ చెప్తావా  చెప్పవా  అని  పోట్లాడి  మరీ  వీణ  చెప్పించుకునేది. పెళ్లి  అయ్యాక  కాలేజీకి  వాళ్ళ  ఆయన్ని  తీసుకుని  వెడితే  ప్రిన్సిపాల్ గారు  ఈ  బీరువాలో  సగం  ప్రైజులు  మీ  ఆవిడ  తెచ్చి  పెట్టింది,   తద్వారా మా  కాలేజీకి  ఎన్ని  సెలవలు ఇప్పించిందో  అ
              మాకు  ఎంతో న్నారుట.  
ఘనత  చదువుకునేటప్పుడూ  తెచ్చింది,  పెళ్లి  అయ్యాక  న్యూజెర్సీ  వెళితే  తన వీణ  స్టూడెంట్  వాళ్ళ  అమ్మగారు  ఇంత  మంచి  కూతుర్ని  కన్నందుకు  గర్వపడండి అని  చెప్పేరు. ఇంత  కంటే  గొప్ప ఆనందం  ఏముంటుంది.  కన్నవారి  వంశ  ఘనత  అమెరికాలో  కూడా  తను  వాయిస్తూ, తన  కూతుళ్ళు  ఇద్దరి  చేతా వాయిమ్పిస్తూ,  ఇంతే  కాక  బోలెడంతమంది    స్టూడెంట్స్కు  వీణ  నేర్పి వాళ్ళ  చేత  ప్రదర్శనలిప్పిస్తూ, తను సాఫ్ట్ వేర్  ఇంజనీర్గా  జాబ్  చేస్తూ  నిర్వహిస్తోంది.  ఒక్క  మాటలో  చెప్పాలంటే  రూపంతో  సహా  నా  ప్రతిబింబం.

             మా  పెంపకం  మీద  మాకు  ఎనలేని త్రుప్తిని  కలగ  జేస్తోంది.  (సోత్కర్షగా  భావించకండి,  నా  అంతరంగాన్ని  ఆవిష్కరిస్తున్నాను)  మంచి   సంస్కారి,  సమర్ధుడు  అయిన  భర్త,   ఇద్దరు చక్కటి  పిల్లలతో సహా  అమెరికాలో  నివశిస్తోంది.

              ఇక  తన  చిన్నతనమంతా  నేను  సంగీతం,  సంసారంలో  మునిగి  తేలుతున్నాను. డిప్లొమా,  రేడియో  ఆడిషన్కు  తయారయ్యి  విజయాలు పొందడం. ఇది  రెండు  చిన్న  మాటల్లగా  ఉన్నాయి  కానీ  వాటికి  చెయ్యాల్సిన  కృషి  అనంతం.  ఈ  రోజుకీ  చేస్తూనే  ఉన్నాను,  ఊపిరి  ఉన్నంత  వరకూ  చెయ్యాలి.

                   వీణ  నేర్చుకోడం-వాయిన్చుకోడం-వాయించడం,   మా  వారు   వాయిన్చుకుంటూ  ఉండగా వినడం,  తాళం  వెయ్యడం- వెనకాలే  వాయించడం (అన్నట్లు  నోటికి  తాళం  వేసుకోడం),   మా పిల్లలకి  నేర్పించడం-  వాయింపించడం-ప్రదర్శనలిప్పించడం,  ఇక  లెఖ్ఖ లేనంత  మంది  శిష్యులను  తయారు  చెయ్యడం,  ఇంటి  వ్యవహారాలూ  బంధువుల  రాక  పోకలూ  అన్నీ  సవ్యంగా  నిర్వర్తిస్తూ,  కుటుంబ  గౌరవాన్ని ఇనుమడింపచెయ్యడం  పిల్లల  పెళ్ళిళ్ళు, మనవలూ ఇలా  సాగి  పోతోంది  కాలం.......... ఏముందీ  విశేషం  ఇలా  అందరూ  చేస్తారు,   గొప్పలు  కొట్టుకుంటోంది  అనుక్కోకండి, నా అంతరంగ  ఆవిష్కరణ  కాబట్టి  నా  విషయం  నేను  చెప్పుకుంటున్నాను, ఇందులో  గొప్పలకు  తావు  లేదు,  నిష్కర్ష  అయిన  నిజాలివి,  మీరు  కూడా  రాయండి  మేము ఎంతో  ఆనందంగా  చదువుకుంటాము.

           సంగీతం  నా  వృత్తి.....రచన   నా  ప్రవృత్తి.  ఇన్ని  రోజులూ  సంగీతం  అంటూ  ఎంత  సంగీతాన్ని ప్రొవి  చేసుకున్నాను  అని   మీకు  వచ్చే  సందేహాన్ని  నివృత్తి  చెయ్యడం  కోసం,  నేను  వాయించిన  ఒక  రికార్డింగ్  పెడుతున్నాను....వినండి........           

       దేముడా  దేముడా  దేముడా!  ప్లీజ్  ప్లీజ్ ప్లీజ్!   ఇది  చదివిన  అందరూ  నా వీణ  కూడా విని  ఒక లైకో,  కామెంట్  ఇక్కడ  రాసే  ఓపికని,  సహనాన్ని  ప్రసాదించు  దేవుడా...ప్లీజ్.............
         
         https://youtu.be/F4A0pu9hTk4
ఈ లింక్  మీద  క్లిక్  చెయ్యండి............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి