11, జులై 2018, బుధవారం

టూర్ ముగింపు

టూర్  ముగింపు ....
june  21.......

టూర్ ముగింపుకు వచ్చ్చేసాం. 10 రోజులయ్యాక మొదటి సారి కొంచెం నెమ్మదిగా లేచి, సామాను పూచిక పుల్ల కూడా వదల కుండా సర్దేసుకుని కిందకి 8. 30  కి బ్రేక్ ఫాస్ట్ కి వచ్చేసాం .  తీరా వాళ్ళ  బ్రేక్ఫాస్ట్  9 కి అయిపోతుందిట, సో గబా గబా తినేసాం. వాళ్ళు మేము చూస్తుండగానే ఒక్కోటి సర్దేసుకుంటున్నారు. బానే ఉంది, నయం అర గంట ముందు వచ్చెం కాబట్టి ఈ మాత్రమైనా దక్కింది అనుకుని, గబా గబా తినేసాం.

తరవాత ఫొటోస్ తీసుకుని, మంచి ఆధ్యాత్మ రామాయణ కీర్తన మా వారు నేర్పిస్తుండగా మేమందరమూ నేర్చుకుని, reception దగ్గరకు వచ్చ్చేసరికి ఉల్లాస్ రెడీ. చిన్న పిల్లవాడు, చక్కగా ఉన్నాడు. హుషారుగా మీరు  సామాను తీసుకెళ్లాలి కాబట్టి పెద్ద బస్సు వచ్చ్చేస్తోంది, రెడీ గా ఉండండి అని చెప్పేడు.

అందరం రూమ్ కి వెళ్లి సామాను తీసుకుని రెడీ గా ఉన్నాం, ఇంతలో బస్సు వచ్చింది. సామన్లు అందులో ఎక్కించి ఎయిర్పోర్ట్ కి బయలుదేరాం. 20 నిమిషాల్లో రోమ్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాము. మమ్మల్ని క్యూలో నిల్చోబెట్టి మాకు జాగ్రత్త లు చెప్పి, నేను కింద వేరే టూర్ మెంబెర్స్ ని తీసుకెళ్లాలి, కాబట్టి  కిందే ఉంటానని, అవసరమైతే ఫోన్  చెయ్యమని చెప్పి , కిందకి వెళ్ళేడు.

మాకు నిన్న రాత్రి ఎన్ని సందేహాలొ!  ఉల్లాస్  ఎవరు? టైం కి వస్తాడా? బస్సు ఎప్పటిలా పెద్దది వస్తుందా?(సామాన్లు పట్టాలి కదా డిక్కీ  లో) మేము టైం కి ఎయిర్ పోర్ట్ కి వెళ్లగలమా? నాగవల్లి పెళ్లి వారం కదా SOTC వాళ్లకి మా మీద కేర్ ఉంటుందా? అన్నిటికీ సమాధానం దొరికి పోయింది. మొదటి రోజు ఆహ్వానం ఎలాగో  చివరి రోజు వీడ్కోలు కూడా అంత బాగానూ. జయహో SOTC  జయహో! JEETHE RAHO!

ఈ ట్రిప్ వల్ల  మాకు తెలిసిన విషయాలు....  మేము చక్కగా ఎంత దూరమైనా నడవగలము అనీ, నిచ్చెనలెక్కి ఏమైనా తీయగలమని.


నిజానికి కాళ్ళ నొప్పులు నడుస్తుంటే కొద్దిగా అనిపించిన మాట వాస్తవం కానీ, రాత్రి రూమ్ కి వెళ్ళేసరికే లేవు, పక్క రోజు నిద్ర లేచేసరికి అస్సలు లేవు. 

Rome లో చెక్ ఇన్  అయ్యి చక్కగా లోపల చైనీస్ రెస్టారంట్ లో fried  రైస్ తిన్నాము.   మేము ఎక్కడా  ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వలేదు.  మంచి స్టే, మంచి ఫుడ్, తోడుగా ఒకరు మన గ్రూప్ కోసం allot అయి, మనని  నిరంతరం వెంట ఉండి  చూసుకోడం. SOTC THE GREAT TRAVELS.

దుబాయ్ లో దిగి, ఇండియా  వెళ్లే ఫ్లైట్   గేట్ దగ్గరకి వెళ్ళడానికి  ఎంత నడవాలో , చుక్కలు కనిపించాయి.  నిజం చుక్కలే. అర గంట సేపు ఈజీ గా నడిచేము. ఎక్కడా TRASFERRING  వెహికల్స్ కనబడ లేదు.  ఎట్టకేలకు అక్కడకి చేరుకొని నెమ్మదిగా ఫ్లైట్ లోకి పిలుపు వచ్చ్చాక ఎక్కి 22 ఉదయం 8.30  కల్లా  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి, ఎప్పటికీ రాని Suitcase ల కోసం ఎదురు చూసి, ఎదురు చూసి, మొత్త్తనికి అందరమూ బయటకి వఛ్చి cab ఎక్కి ఇంటికి వచ్చ్చేసాము.

రోమ్ లో ఎయిర్ పోర్ట్ నుండి మా డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం  గారు మమ్మల్నిద్దరినీ చంటి పిల్లల్లా  వెంట పుచ్ఛు కుని  తీసుకెళ్ళేరు.  కంటి రెప్పలా చూసుకున్నారు.

మా గ్రూప్ లో మేము 14 మంది కాక నలుగురే తమిళియన్లు ఉంది, మా కోసమే  ట్రిప్ ఏర్పాటు చేసినట్లుంది, తెలుగు ,మాట, తెలుగు పాట ,ఒకే నేపధ్యం, సంగీత సాహిత్యాలు , మంచి స్నేహితులుండడం వల్ల, ట్రిప్ మేము అద్భుతం గా enjoy చేసేము.  ముఖ్యం గా మా డాక్టర్ గారు, విజయదుర్గా గారూ, మా వారూ పాత పాటలు దంచి కొట్టారు. మిగతా వారూ ఇతోధికం గా పాల్గొన్నారు.

                                               మరి ఇక ఈ ట్రిప్ కి సంబంధించి  సెలవా?
                                                                శలవు
                                                                 నమస్తే 

ఆహా యూరప్ 12

ఆహా యూరప్ 12
June 20 th

ఆరోజు ఉదయం మాకు breakfast దగ్గర పరేష్ కనపడి, “ఈ రోజు మనం 8.30 కే బయలుదేరాలి, ఎందు వలన అంటే 10.15 కి మనం వేటికన్ గేట్ లో ప్రవేశించడానికి Appointment దొరికింది, తొందరగా వెళ్ళాలి, appointment లేకపోతే general క్యూ చాలాఎక్కువగా వుంటుందని” చెప్పేరు. ఈ రోజు మేము చూడవలసిన ప్రదేశాలు Vatican Museum, the Sistine Chapel and St. Peter’s Basilica,gigantic colosseum, Trevi fountain.

హిందువులందరూ తిరుపతి ఒక్కసారైనా దర్శించుకోవాలని ఎలా అనుక్కుంటారో, క్రైస్తవులందరూ జీవితంలో వేటికన్ దర్శించుకోడం ఒక కలలా భావిస్తారు.

యూరోపు నాగరికత అంతా గ్రీక్, రోమన్ చరిత్రలతో ముడిపడి ఉన్నది. క్రైస్తవమతం విస్తరణ రోమన్ చక్రవర్తుల మూలంగా జరిగింది. ప్రాచీన కట్టడాలు, శిల్పాలు, చిత్రాలకు ఆ ప్రాంతం ఒక నిధి.

Vatican city రోమ్ నగరంలోని భాగమైనా, దానిని ఒక state గా ప్రకటించారు. వాటికన్ ప్రపంచంలో అతి చిన్న స్టేట్, చుట్టూ రోమ్, ఇటలీ వుంటాయి. వాటికన్ Roman Catholic church కు head quarters. Pope ఇక్కడే నివసిస్తారు. అద్భుతమైన శిల్ప సంపద, paintings నిక్షిప్తమై వున్నవి ఇక్కడ. మానవులందరూ ఒకసారి కులమతాలకు అతీతంగా దర్శించ వలసిన పరమ పవిత్ర స్థలం ఇది.

కొన్ని భావాలు ప్రకటించడానికి ఒక్కోసారి మనం భాషను వెతుక్కోవల్సి వస్తుంది. భాషాతీత భావం, వర్ణనాతీత దృశ్యం. కొన్ని photo లు పోస్ట్ చేస్తాను. వాటికన్ చూడ్డానికి 3 గంటల సమయం సరిపోలేదు.ఇది అంతా ఒక గైడ్ ఆధ్వర్యంలో జరిగింది, అతను మాకు ఆ రోజంతా మాతోనే వున్నాడు. చాలా చక్కగా చెప్పేడు.

పరేష్ పని మమ్మల్నందరినీ తోల్కపోడమే, పెద్దగా నచ్చలేదు, చాలా soft గా వున్నాడు. అయినా ఆ ఒక్కరోజేగా ఫర్వాలేదు సర్దుకోవచ్చు. ఇబ్బంది లేదు. అన్నట్లు క్రిస్ లేడు కదా, సామాన్లు మొయ్యడం కూడా లేదని,చిన్న బస్సు ఏర్పాటు చేసారు SOTC వాళ్ళు.

అక్కడ నుండీ లంచ్ చేసుకుని కొలోజియమ్ దగ్గర బస్ దిగి బయటనుండీ చూసాం. లోపలికి వెళితే చాలా సమయం పడుతుందని, appointment తీసుకోవాలని చెప్పేరు, దాంతో బయట నుండి చూసుకొని వచ్చేసాం.

కొలోజియమ్ అంటే బాగా సంపన్నులైన రోమన్స్ చనిపోయిన వారికి గౌరవార్ధం అక్కడ colosseum fights చేయించేవారట. జంతువులతో గుంపుగా పోట్లాడించి, కృూరమైనవేటతో వినోదించేవారట. ఒక సాధువు ప్రబోధం వల్ల ఈ కిరాతక చర్య 404 A.D తో నిలిపి వేసారు.

అలాగే Gladiatorial games, రోమన్ దేవతలను సంతుష్టలను చేయడానికి జరిపేవారు, తద్వరా ఆ దేవతలు రోమ్ ని అన్ని విధాలా కాపాడుతారని ప్రజల నమ్మకం.

Collosseum నేటికి కూడా మన తాజమహల్ సరసన seven wonders లో ఒకటిగా పరిగణించ బడుతోంది.sistine chappel లో వున్న paintings sculpture ఎప్పటికీ ఎల్లప్పటికీ. క్లాసిక్స్గా పరిగణించబడతాయి.సీలింగుకు Michelangelo paint చేయడానికి చూపిన ఏకాగ్రత వల్ల అతనికి కంటి చూపు మందగించింది. అతని ఆత్మ కధను “ The Agony and Ecstasy” by Irving Stone made into a grand movie.. అలాగే Roman emperor నీరో చక్రవర్తి రోమ్ కాలిపోతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడని నానుడి. Nero was a symbol callous insensitivity. ఈ రోజుకు కూడా అటువంటి వారిని  నీరోతో పోలుస్తారు,

అక్కడ నుండి Trevi Water fountain కి వెళ్ళాము. దీనితో యూరప్ ట్రిప్ దర్శనా స్ధలాలు పరిసమాప్తి. ఇది 85 అడుగుల ఎత్తు, 65 అడుగుల వెడల్పు వుంటుంది. దానికి ముందు పెద్ద జలాశయం వుంది. దీనిలో మనస్సులో ఏమైనా అనుక్కుని coins వేస్తే, కోరిక సిధ్ధిస్తుందని ప్రజల నమ్మకం.

బోలెడంత దూరం నడిచి వెళ్ళినందుకు, ఆ జలాశయం ముందు కూర్చుందామని మా అరుణా, పద్మా లాక్కుని వెళ్ళేరు. ఎంతలా నీళ్ళతో ఆడుకున్నామో. అలసట అంతా “It’s gone”, “గాయబ్”, “మటుమాయ మైంది”. నెమ్మదిగా బయలు దేరి నడుచుకుంటూ coffee తాగి , బస్ కోసం ఒక పేధ్ధ టనెల్ దాటుకుని వెళ్ళి అక్కడ వున్న మా బస్ ఎక్కి బయలు దేరాం.

 ఈ రోజు మేము early dinner. Restaurant కి వెళ్ళే సరికి dinner ready అవ్వడానికి ఇంకా time ఉంది అనే సరికి రోమ్ నగరం చుట్టూ మమ్మల్ని చక్కర్లు కొట్టించారు.

రోమ్ పురాతన నగరం. కట్టడాలన్నీ చాలా శిధిలా వస్థలో నున్నాయి. వాటికి పునరుజ్జీవనానిచ్చి  (రూపు మారకుండా) వుంచిన వారి శ్రధ్ధకు నమోవాక్కాలు. మనమైతేనా వాటిని dismantling చేసి అద్భుతమైన కట్టడాలు నూతన విధానంలో నిర్మించి మురిసి ముక్కలవ్వమూ?

ఇరుకు సందులు, వందల ఏళ్ళ నాటి పురాతన కట్టడాలు. ఏదో మన కాలచక్రం వెను తిరిగిందా అని భ్రాంతి కలుగుతుంది. రోమ్ నగర దర్శనం ఒక అద్భుత అవకాశం.

నిజానికి ఈ రోజు నడచినది చాలా ఎక్కువ, కానీ ఆ అద్భుత చారిత్రాత్మక దర్శనీయ స్థలాలు అన్నిటినీ మరిపించాయి

ఇక డిన్నర్ కావించుకుని హోటల్కి 8.30 కల్లా చేరుకుని. కొంచెం సేపు rest తీసుకుని, రేపు మాతృదేశానికి ప్రయాణం అని తలచుకుంటూ నిద్ర లోకి జారుకున్నాం..

సశేషం

9, జులై 2018, సోమవారం

ఆహా యూరప్ 11

ఆహా యూరప్  11      అయ్యగారి జయలక్ష్మి
June  19

మళ్ళీ పొద్దున్నే దిన చర్యలన్నీ మామూలే.  9 కల్లా  బయలుదేరేము.  3 గంటలు ప్రయాణించి,  రోమ్ లోని "Leaning Tower of Pisa" చూడటానికి  చేరేము.

భూషణ్ మాకు నెమ్మదిగా చెప్పేడు, "రాత్రి నేను బయలుదేరి ఇండియా వెళ్లి పోతాను, మీకు రేపటికి పరేష్ అనే టూర్ మేనేజర్  వస్తారు, అతను మీకు వేటికన్ సిటీ చూపిస్తాడు. మా అంకుల్ చనిపోయారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వెళ్ళ వలసి వస్తోంది , మీకు ఏమీ ఇబ్బంది లేదు రాత్రి హోటల్ లో మీ డిన్నర్ అయ్యా దాకా ఉంది వెళ్తాను, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దగ్గర పరేష్ వస్తారని, పరేష్ వాటికన్ చూపించి వెళ్లి పోతాడని, ఉల్లాస వఛ్చి మమ్మల్ని రోమ్ ఎయిర్పోర్ట్ కి దింపుతాడని "  చెప్పేడు.   మాకు అది కొంచెం సేపు మింగుడు పడ  లేదు. ఏం  చేస్తాం తప్పదు కదా.

మేమందరమూ ఒక్కకళ్ళూ  5 యూరోలు వేసుకుని, మేము భూషణ్ కు,  మాకు అతను చేసిన సర్వీస్ కి సంతోషం ప్రకటిస్తూ ఇచ్ఛేము, ఒద్దని  మొహమాట పడినా, బలవంతం చేసి ఇచ్ఛేసాము. 

మా బస్సు చాలా దూరం లో పార్కింగ్ ప్లేస్ లో ఆపేరు. అక్కడ నుండి వేరే బస్సు లో అతి దగ్గరా తీసుకుని వెళ్లి దింపేరు.  అక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ పీసా టవర్ ముందు నుండి లంచ్ కి సందు  లోపలి వెళ్ళేము. దారంతా ఎండా, గొడుగు నల్ల కళ్లజోళ్ళూ, మామూలే, కాకపోతే  నిన్నలా  ఎండ అంత బాధించలేదు, కొంచెం గాలి కూడా వస్తోంది కాబట్టి, పెద్దగా ఇబ్బంది లేదు.

ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి ని చూడ్డానికి ఏడూ కొండలు ఎక్కి , చివరగా మోకాళ్ళ పర్వతం ఎక్కినట్లు, చివరి ఇటలీ, రోమ్ 3 రోజులూ  మటుకూ ఎండ ఒక పరీక్షే.

ఇక భోజనం అయ్యాక  పీసా టవర్ చూడ్డానికి వెళ్ళేము,  వెళ్లడ   మంటే దాని ముందు నుండే రావాలి తప్పదు.
పీసా టవర్ గూర్చి చిన్న వివరణ....

ఇది చర్చ్ భవనాల సముదాయం లో బెల్ టవర్ / గంట స్థంభం గా 1173  లో ప్రారంభించ బడిందిట. దీని వాస్తు శిల్పి ఎవరో ఖఛ్చితం గా తెలియదు కానీ BONONNO PISANO మొదలగు కొందరని  చెప్తారు. ఈ కట్టడం మొదలెట్టినప్పుడు నిలువుగానే మొదలయ్యింది. 5 సంవత్సరాల పాటూ తిన్నగానే నిలుచున్నది. 3 వ అంతస్థు మొదలవగానే కొంచెంగా వంగి పోడం  తో నిర్మాణం ఆపేసారు. ఎక్కువ గట్టిదనం లేని మట్టి పై కట్టడం, దానితో పాటూ పునాదులు బలహీనమవడం కారణాలు గా భావించి సుమారు వంద సంవత్సరాలు నిర్మాణం ఆపేసారు.
తరువాత కూడా నిర్మాణం నట్టూతూ, నట్టుతూనే సాగింది. కాకపోతే ఆ వంగడం ఒక పర్యాటక ఆకర్షణ గా నిలవడం తో కొంతకాలం తర్వాత ఆ కట్టడాన్ని వంగే ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

దీని ఎత్త్తు 183 అడుగులు, వెడల్పు 8. అడుగులు.

1372 లో నిర్మాణం పూర్తి అయినప్పుడు ఇది 5. డిగ్రీల కోణంలో వంగి ఉండేది. 1990-2001  మధ్యలో జరిగిన పునరుధ్ధరణ   చర్యలతో ఇప్పుడు ఇది 3. డిగ్రీల కోణంలో వంగి ఉంది.

ఒకా  నొక టైం లో ఇది ప్రపంచపు "Seven Wonders" ఒకటి, ఇప్పటి కొత్త్త్త లిస్ట్ లో  ఉండక పోవచ్చు .

దాని ఫోటోలు పోస్ట్ చేస్తాను చూడండి.

అది చూసుకుని  బయటకి వచ్చ్చేస్తుంటే  "సావనీర్స్ " కొనుక్కుందుకు షాప్ కి వెళ్తే అక్కడ తెలుగు మాట్లాడుతున్నాడు ఒక  షాప్ అతను. ఆశ్చర్యం వేసింది.

ఇంకొంచెం ముందుకు వచ్చ్చేస్తుంటే దారంతా నల్ల వాళ్ళు,  కోటీలో లాగా దండలూ, బాగ్స్ వగైరాలు  అమ్ముతామని మనని  వేధిస్తారని, వాళ్ళల్లో కొందరు తస్కరులుండవచ్చ్చని , వారిని పరికించవద్దు, పలకరించవద్దని భూషణ్ ఇచ్చిన  సూచన మేరకు మేము అటు చూడకుండా వచ్ఛే సాము. 

మళ్ళీ మా CONNECTIVE బస్సు ఎక్కి, మా అసలు బస్సు వద్దకు వచ్చ్చేసాము.

బస్సు ఎక్కి రోమ్ లో Ardeantina Park హోటల్ కి వచ్ఛేసి సామాను దింపేసుకున్నాము. అక్కడే పక్క రోజు బస కూడా. ఈ హోటల్ తో మా యూరప్  ట్రిప్ సంపూర్ణ మవ్వబోతోంది.

బస్సు దింపి క్రిస్ బస్సు తీసుకుని వెళ్లి పోయాడు పూర్తిగా! ఎందుకంటే ఆ రోజు తో అతనికి డ్రైవింగ్ పర్మిట్ ఉన్న 12 రోజులూ (ఇంకో ట్రూప్ తో 3 రోజులూ+ మాకు 9 రోజులూ పూర్తయ్యిందని)  డిన్నర్ అయ్యాక భూషణ్ అన్నీ అప్ప చెప్పి వెళ్లి పోయాడు.

తెలిసిన వాళ్ళందరూ మనని వదిలేసి వెళ్లి పోతున్నారు, ఇంకోరు వఛ్చి మనని జాగ్రత్తగా వాటికన్ సిటీ చూపిస్తారా? తరువాతి రోజు ఇంకోళ్ళొస్తారట ఎయిర్ పోర్ట్ కి దింపుతారా? అన్నీ సందిగ్ధాలు! 

అయినా రెస్ట్ మటుకూ మాన లేక పోయాము. నిజం చెప్పాలంటే అందులోనే కదా మనం సేద దీరేది.


                                                               సశేషం

         















7, జులై 2018, శనివారం

ఆహా యూరప్ 10

ఆహా యూరప్ 10
  జయలక్ష్మి అయ్యగారి
June 18

యధావిధిగా  బాగ్స్ సర్దుకుని 9 కల్లా బయలుదేరి, స్విట్జర్లాండ్ బోర్డర్ వదిలి, ఇటలీ లోకి 3 నిమిషాల్లో ఎంటర్ అయిపోయాము, ఎందువలనా అంటే నిన్న చెప్పేను  కదా, మేము బోర్డర్ లో ఉన్నామని.

అక్కడ నుండి 4 గంటలు ప్రయాణం చేసి, మధ్యలో ఆడుకుంటూ, పాడుకుంటూ, మధ్యలో మా నోళ్ళకి పని చెబుతూ (పొరబడకండి, తిట్టుకోలేదు, స్నాక్స్ తింటూ , మధ్యలో రెండు సార్లు  పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతూ (ఎందుకో మీకు తెలుసు కదా) చివరగా లంచ్ రెస్టారంట్ లో ముగించుకుని "వెనిస్  నగరం"   చేరుకున్నాము.

వెనిస్ నగరం 100 చిన్ని చిన్ని ఐలాండ్స్ మీద కట్టి , కెనాల్స్ తో విడ దీయ బడి, బ్రిడ్జెస్ తో కలప బడి ఉంది. మా గ్రూప్ కి  విడిగా చిన్న బోట్ బుక్ చేసేరు, అందులో ప్రయాణం. మన బోట్ వెళ్తుంటే నీటి అలలు మనని తాకుతాయేమోనన్నంత  విశృంఖలం గా  ఎగిరి ఎగిరి మన బోట్ లోకి వచ్చ్చేద్దామన్నంత  ప్రయత్నం చేస్తుండగా,  నీటి తుప్పర మొహం మీద చిందులేస్తుంటే ,  ఎంత గొప్ప ఆనందపు అనుభవమో చెప్పలేను, ఎవరికీ వారు తెలుసుకోవలసిందే.  ఈ బోట్ లోకి ఎక్కుతుంటే మా భూషణ్ చాలా సహాయం చేసేడు.

బోట్ దిగేక,  చల్ల దనం మటు  మాయం. పైగా విపరీతమైన ఎండ. పైన గొడుగు వేసుకుని, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, కాళ్ళీడ్చుకుంటూ ఎన్ని బ్రిడ్జిలు  దాటామో,ఎంత దూరం నడిచేమో!  "అయ్యో పాపం అంత దూరం ఎండలో నడిచేవా  జయలక్ష్మి" అని నా మీద నాకే జాలి వేసింది. బ్రిడ్జిలు లేఖ పెట్టుకుంటూ వెళ్ళేము, ఎందుకంటే మమ్మల్ని భూషణ్ అక్కడ వదిలేసి 5 గంటలకి  రండి, మన బోట్  వస్తుంది, లేక పోతే మీరు ఇక్కడే ఉండాలని, లేదా మీ ఏర్పాటు తో మీరు రావాలని బెదిరించాడు.  వచ్ఛేప్పుడు తప్పి పోకూడదు కదా. మళ్ళీ బ్రిడ్జిలు  లేఖ్ఖ  పెట్టుకుంటూ వచ్ఛేసాము 4.30  కల్లా.

అక్కడ నుండి మేము నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి The St,Marks square కి వెళ్లి అక్కడ  The Historic Ducal Palace,The Romantic Bridge of Sighs,Splendid St,Mark's Basilica. చూసుకుంటూ నడుచుకుంటూ, నడుచుకుంటూ, మళ్ళీ నడుచుకుంటూ, మురానో గ్లాస్ ఫ్యాక్టరీ  కి వెళ్ళేము. అక్కడ హాయిగా చల్లగా ఉంది లోపల.

గ్లాస్ తో  అద్భుత కళాఖండాలు తయారు చేసి ఉన్నాయి.  అక్కడ కొనుక్కొవచ్చుఁ కూడా. అక్కడ  మనకి  ఆ కళాఖండాలు ఎలా తయారు చేస్తారో డెమో ఇస్తామన్నారు. దొరికిందే తడవుగా అందరమూ చూసే పేరు తో, కొంచెం సేపు కూల బడ్డాం. నిజం గా అద్భుతం గా ఉంది డెమో. క్షణాల్లో చక్కటి కళాకృతి తాయారు చేసేసారు. (ఇంకొంచెం సేపు చెయ్యచ్చుఁగా, ఇంకొంచెం సేపు చూసే పేరుతో కూర్చోవచ్చని అనిపించింది నాకు. ) సరే అవ్వగానే బయటకు వస్తే, బయట చిన్న చిన్న ప్రైవేట్ బోట్లు  తీసుకుని హాయిగా ఎవరికి  వారు  వెళ్తున్నారు. ఆ బోట్స్ ఎంత అందం గా ఉన్నాయో.

 కానీ నాకు గ్లాస్ ఫ్యాక్టరీకి  వెళ్లేదార్లంతా హైదరాబాద్ చార్మినార్ దగ్గర పాత బస్తీ లాగా ఇరుకు సందుల్లోంచి, ఇరుక్కుని వెళ్లినట్లు గా ఉంది. చార్మినార్ దగ్గర కూడా glass products తయారు చేసే factories,  కళాఖండాలు తయారవుతాయి. మన దేశం కూడా అన్ని విధాలా ఎవ్వరితో  ఏమాత్రం తీసి పోదు.

 కాక పోతే మేము చల్లగా కొంచెం సేపు కూర్చునే ఛాన్స్ దొరికింది అనేది  మటుకూ నిజం. ఎక్కడ బయట షాప్స్ దగ్గర ఖాళీ కుర్చీల్లో కూర్చుందామంటే, మీరు ఏమైనా కొంటే  కూర్చొండంటున్నారు.  కూర్చోడం  కోసం ఏమి కొనం?  పైగా ఇటలీ, రోమ్ లో తస్కరులు చాలా  ఎక్కువ అని ముందే అందరూ హెచ్చరించారు, అంతే కాక భూషణ్ కూడా చెప్పేడు.  కాబట్టి Passports, Euros విషయంలో జాగ్రత్త గా ఉండాలి అందరూ.

మళ్ళీ నడుచుకుంటూ, నడుచుకుంటూ, నడుచుకుంటూ, (ఎదురెండ తప్పించుకుంటూ) బ్రిడ్జి లు లెఖ్ఖ  పెట్టుకుంటూ వెనక్కి వఛ్చి మా Boat Pick up Point కి ఎదురుగా కాఫీ షాప్ లో కాఫీ తాగి, అరగంట అక్కడ కూర్చుని మా బోట్ రాగానే, అందులో కూర్చుని మళ్ళీ కేరింతలు కొడుతూ కొందరూ   , కేరింతలు కొట్టడానికి ఓపిక లేక కొందరూ, ఒడ్డుకు వఛ్చి హాయిగా మా బస్సు ఎక్కి హోటల్ కి వచ్చ్చేసాము. (ఇది నా అనుభవము, మా గ్రూప్ లో ఉన్న 50 ల వాళ్ళు ఈ ఇబ్బంది పడలేదని నా భావన, కానీ ఎండ ఎవరినైనా బాధిస్తుంది కదా, నాలా 60 దాటినా వాళ్లనే కాదుగా, ఏమో మరి వాళ్ళు చెప్పాలి వాళ్ళ అనుభవం)  ఆ రోజు హోటల్ పేరు "Best Western Palace"

ఈ రోజు డిన్నర్ ఇక్కడే. పాస్తా, ఇటాలియన్ పిజ్జా, baked and sliced brinjals , aloo, చిలకడ దుంప. లాంటివి ఇచ్ఛేరు. ఇదొక అనుభవం.  తిన్న వాళ్ళు తిన్నారు, తినలేని వారు  జాగ్రత్తగా కానిచ్ఛేసారు.

కి వెళ్లి AC వేసుకుని రెస్టే  రెస్ట్. సొమ్మసిల్లి  పడుకున్నాం. మా అమ్మ "డాక్టర్ పద్మ" ఉంది కదా, గురువుగారూ Madam AC ఉన్నా సరే అక్కడ ఉన్న  చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకుని పడుక్కోండి, మంచి నిద్ర వస్తుంది అని చెప్పింది. మా పద్మ చల్లగా ఉండాలి.
                                                            సశేషం


3, జులై 2018, మంగళవారం

ఆహా యూరప్ 9
june 17 th

ఈ రోజు ఉదయం మళ్ళీ యధావిధిగా అన్ని సామాను సర్దుకుని, బస్సు లో ఎక్కించి, 9 కల్లా బయలుదేరి పోయాం.


 "ఎక్కడికి?" అన్నాము భూషణ్  తో...  "అబ్బబ్బా మీకు ఎన్ని సార్లు చెప్పాలి, ఎక్కడికీ అని అడక్కూదని అని భూషణ్ గయ్ మన్నాడు'. మేమందరమూ గంటు మొహాలు పెట్టుకున్నామని, మళ్ళీ తనే అన్నాడు ఉండండి చెబుతా., అని చెప్పేడు.
తరవాత మేము ఒక గంట ప్రయాణించి.. LUCERN  LION MONUMENT ( అక్కడ ఒక సింహం బాణం తగిలి ఏడుస్తూ పడుకున్నట్లు, ఒక పెద్ద రాతి లో చెక్కి  ఉంది ) ఎంత బాగుందో, ఆ శిల్పి ఎంత బాగా తన భావాన్ని వ్యక్త పరిచాడో , స్పష్టంగా కనిపిస్తోంది చూద్దురు గాని ఫోటో లో. .

అక్కడ నుండి Broc వెళ్లి అక్కడ The Famous Maison Cailler  Swiss Chocolate Factory, outlet shop కి వెళ్లి అక్కడ పిచ్చ్చిగా  చాక్లెట్లు కొనుక్కున్నారందరూ. మేము చక్కగా వాటిని చూసుకుని, ఫొటోస్ తీయించుకున్నాము.
బస్సు స్టార్ట్ అయ్యింది, కొంచెం దూరం వెళ్ళేక మా ట్రూప్ లో తమిళియన్ ఒకావిడ చాకొలేట్ షాప్ బయట బాగ్ మర్చిపోయామని,  ఖంగారు పడిపోతుంటే, మళ్ళీ భూషణ్ బస్సు వెనక్కి తిప్పించి, అక్కడ లోపల కి వెళ్లి కనుక్కుంటే, ఎవరో దొరికిందని ఇచ్ఛేరని చెప్పి ,  వాళ్ళు దానిని తిరిగి ఇచ్ఛేసారు. అదీ నిజాయతీ అంటే.

అక్కడ నుండి Inter laken  తీసుకెళ్ళేరు. అది మంచి ఫోటో స్పాట్, అద్భుతమయిన ఫొటోస్ తీయించుకున్నాము. ఇవన్నీ ఒక దాని కొకటి  అరగంట దూరం లో ఉన్నాయి. మొత్త్తం అన్నీ కలిపి 12 గంటల లోగా  చూసుకుని, రోప్ వే దగ్గరకి వెళ్ళేము. అక్కడ  టికెట్ కొనుక్కుని రోప్ వే స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళేము. టికెట్స్ ఎక్కడైనా సరే భూషణ్ దే  బాధ్యత, అతను కొని మనకిచ్చ్చి, మళ్ళీ మనతో పాటూ వఛ్చి, మనకి చూడమని టైం ఇఛ్చి, కింద వైట్ చేస్తుంటాడు. అదన్నమాట విషయం.

సరే ఎక్కడకి వెళ్లాం rope way  మీద? ఊహించండి చూద్దాం... అవునవును వెళ్లిన వారందరూ చెప్పగలరు, వెళ్ళ బోయే వారు, వెళ్ళ లేని వారికీ   ఎలా చెప్పక పోతే?  సరే ఏం  చేస్తాం నేనే చెబుతాను....

ఈ రోజు మేము Mount Titlis, The heighest Peak in Central Switzerland about 10,000 feet height లో  ఉన్న మౌంటెన్ కి వెళ్ళేము Cable Cars లో. రెండు కేబుల్ కార్స్ లో వెళ్ళేము.

 వర్ణనకి అతీతమైన అనుభవం. ఎటు చూసిన దేవతలు నడయాడిన స్థలమే. కింద నుండి కేబుల్ కార్ నెమ్మదిగా అలా వెళుతుంటే కిందకి చూస్తుంటే అస్సలు ఎవ్వరితో మాట్లాడాలని లేదు, మళ్ళీ పిచ్చ్చి గా కేరంతలు కొట్టాలని, పిచ్చ్చిగా పాటలు పాడాలని ఎదో తెలియని వెర్రి ఆనందం.  అన్నట్లు ఆ cable car ఎక్కేప్పుడు నెమ్మదిగా అది నడుస్తుండగా ఎక్కాలి. సరదాగా ఉంది.

అక్కడ నుండి 15 నిమిషాల్లో పైకి వెళ్లి పోయాము. మళ్ళీ అక్కడ లంచ్. ఇండియన్ లంచ్. (ఎప్పుడు చూసినా లంచ్, డిన్నర్ అని రాస్తున్నట్లు గానే ఉంది నాకు, మరి మీకో) అది అవ్వగానే 100 మంది పెట్టె rotating cable car లో 5 నిమిషాలు ప్రయాణించి, దిగాము.  అన్ని వైపులా తిరుగుతూ ఆ కేబుల్ కార్ చుట్టూ  ఉన్న అన్ని వైపులా మంచు తెరలని చూపించింది.

బయటకి వచ్ఛాక , పైకి లిఫ్ట్ ఉంది.  అది ఎక్కి పైకి వెళితే , ఓపెన్ లో  పేద్ధ deck చెక్కలతో ఉంది, దాని మీద బెంచెస్ , అక్కడ కూర్చో వచ్చు.  లేదంటే నడుచుకుంటూ adventurous గా మంచులోకి వెళ్లి పోవచ్చు.

మేము అందరమూ కొంత దూరం మంచు లోకి  వెళ్లి  వెనక్కి  వచ్చాం.  ఆ రోజు కి మేమందరమూ 10,000 height కీ, ఆ మంచుకి adjust అయ్యాము. మాలో ముగ్గురు  (మా డాక్టర్ గార్లిద్దరూ, అరుణ)  ఇంకొంచెం లోపలికి వెళ్లి ఐస్ ఫ్లయెర్, క్లిఫ్ walk (ఐస్ కొండకీ, ఐస్  కొండకీ మధ్యలో రోప్ బ్రిడ్జి  మీద నడవడం లక్ష్మణ్ ఝూలా లాగా ) కి వెళ్లి వచ్చారు.  ఇక వర్ణించ లేను, ఫొటోస్ పెడతాను.

ఎటు చూసినా మంచు. తెల్లని వర్ణం లో ఆకాశం నేల ఏకమై ఉంది.  "మంచు పల్లకీ" మంచు తో ఆడుకున్నాం. మంచు మీద నుంచ్చున్నాం, మంచు చేత్తొ  పట్టుకున్నాం, మంచు పీల్చాము, మంచు చూసాము. అక్కడ "మంచే" సర్వస్వము." ఇంకొంచెం దూరం వెళ్లి వచ్చిన వాళ్ళ ముగ్గురిలో ఎవరైనా వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పాల్సిందే. వీలైతే కామెంట్స్ లో రాయండి ప్లీజ్.

ఇక ఒకే కేబుల్ కార్ లో  మార కుండా  కిందకి వచ్చేసాం.  బస్సు ఎక్కి మా అనుభూతులు పంచుకుంటూ డైరెక్ట్ గా హోటల్ "Movenpick" వచ్చాం.

 సామాను సర్దేసుకుని, డిన్నర్ కోసం 10 నిమిషాలు నడచి ఒక పంజాబీ రెస్టారంట్ కి వెళ్ళేము.. అది  SWISS BOARDERS  లో ఉంది.  ఆది వారం  అవ్వడం తో నిర్మానుష్యం గా ఉంది. రోడ్ మీద పాలు పోసి ఎత్తుకోవచ్చు, దిండు వేసుకుని నిద్ర పోవచ్చు.  రోడ్ మీద పెద్ద టివి పెట్టి, 200 మంది మా హోటల్ పక్కన ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్నారు. పంజాబీ రెస్టారంట్ వాళ్ళు ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించారు. ఆశ్చర్యం కరం గా ఆ హోటల్ glass display లో మన వీణ ఒకటి display చేసి ఉంది, మాలో ఎవరైనా ఫోటో తీసేరో లేదో కానీ, మేము పొరబాటున తియ్య లేదు.

Restaurant  దాటగానే ఒక రోడ్,  అది దాటితే ఇటలీ లోకి ఎంటర్ అయినట్లే.  So Switzerland and Italy Boarder  లో  road  మీద వేసిన కుర్చీల్లో కూర్చుని Boarder  చూసుకుంటూ  డిన్నర్ చేసేమని చాల అద్భుతమైన ఫీల్ తో రూమ్ కి వెళ్లి ఏమి  చేసుంటా  మంటారు?

కలల అలలో తేలుతూ హాయిగా నిద్ర పోయాం!
ఇంత పెద్ద ఎపిసోడ్ తీరిగ్గా చదువు కుంటారని, మీకు కొంత విశ్రాంతి ఇస్తున్నా, నేను మళ్ళీ ఆదివారం కనిపిస్తాను.
ఇంత రాసినా తృప్తి తీరడం లేదు ప్చ్ ప్చ్ ప్చ్..
సరే ఉంటా....సశేషం








2, జులై 2018, సోమవారం

ఆహ యూరప్ 8
జూన్ 16

పొద్దున్న 7 కల్లా  కిందకి దిగి, అక్కడి గులాబీ వనం లో అద్భుతమైన ఫొటోస్ అందరమూ తీసుకొని, బ్రేక్ఫాస్ట్ చేసుకుని, ప్రయాణం మొదలు 9 కల్లా మొదలయ్యింది. ఈ రోజు సామాను బస్సు ఎక్కించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు "యాంగ్ ఫ్రొ"  చూసుకుని రాత్రి కి అక్కడే బస.

ఎంత హాయిగా ఉందో ! చిన్న  గొడుగులు, మంచినీళ్ల  సీసాలు, చిన్న స్నాక్స్,  చిన్న షోల్డర్ బాగ్  వేసుకుని, చేతులూపుకుంటూ రికామీగా వెళ్ళేము.

ఆ రోజు  2. 30 గంటలు ప్రయాణం చేసి , top అఫ్ ది mountain  11,000 అడుగుల ఎత్త్తుకు,  ట్రైన్ లు రెండు మారి వెళ్ళాలి, మళ్ళీ అలాగే తిరిగి mountain కు రెండో వేపు చూసుకుంటూ  రావాలి అని భూషణ్ చెప్పీడు.

ఆ రోజు మేము Jungfraujoch   (యాంగ్ ఫ్రొ  అంటారుట  ) A  MAJESTIC BACKDROP OF ICE. top of the mountain, 11,000 feet height కి వెళ్ళేము.

12  కల్లా  ట్రైన్ పైకి వెళ్ళేది వస్తుంది , తొందరగా నడవండి అని 11.30  కల్లా స్టేషన్ కి తీసుకెళ్లి పోయాడు. అక్కడ టికెట్స్ కొని ఇఛ్చి, తిరిగి వచ్ఛేదాకా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి చేతికి ఇచ్ఛేడు.  వేరే ట్రావెల్స్ లో ఇది 155 యూరో లు ఉంది, దీనిలో మటుకూ  ఆప్షనల్ కాదు, included.

దారి అంతా  నేను వర్ణించను, చూపిస్తాను చూడండి

cogwheel train లో Lauterbrunnen  station నుండీ 15 minutes ఒక రైల్, తరవాత ట్రాక్ మారి  35 మినిట్స్ ఒక ట్రైన్ , ఎక్కి  (రైల్ కూ రైల్ కూ మధ్యలో దిగి ఫొటోస్ తీసుకుని) చివరకి పైకి చేరుకున్నాము. అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండి  giddiness కానీ గాలి ఆడక ఇబ్బంది గా కానీ ఉండవచ్చూ, చాక్లెట్ ఒకటి ఇఛ్చి నోట్లో వేసుకోండి, ఎక్కువగా మంచి నీళ్లు తాగమని జాగ్రత్త చెప్పేడు. భూషణ్.

సరే అక్కడకి వెళ్ళేక top of  the mountain మీద bombay restaurant లో అద్భుతమైన  భోజనం చేసుకున్నాం. ఎటు చూసినా  రైల్ ఎక్కిన దగ్గర నుండి దిగే దాకా, వెండి  కొండలే . శివ పార్వతుల నృత్యం చూశామంటే నమ్మండి.
ఈ అనుభూతిని వర్ణించలేను. చూపించగలను.

కొన్ని భావాలకు భాష రాదు, లేదు. చిత్రాలే చూపించగలను.

కానీ మేము ఒక 7 గురం  రెస్టారంట్ నుండి  బయటకు వఛ్చి ఆఛ్చాదన ఉన్న చోటే ఉండి  పోయాం, కారణం కళ్ళు తిరిగి పోతున్నాయి, చెప్పలేని Discomfort.  మళ్ళీ తిరుగు రైల్ వచ్ఛేదాకా, బయటకి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్ఛే దాకా, ఎదురు చూసి వాళ్ళ తో తిరిగి రైల్ ఎక్కి పోయాము..

బయటకు వెళుతూ  మా డాక్టర్ గారు రమ్మని చాలా ప్రోత్సహించారు, కానీ వెళ్ళ లేక పోయాము.

వాళ్ళు చాలా చాలా చాలా ఆనందించారు. ఆనందపు అంచులు  చూశామని, చిన్న పిల్లలై ఆడుకున్నామని ఊరించారు.ఇప్పుడు మీలానే మేము కూడా  వారు  పొందిన  ఆనందాన్ని ఫొటోస్ రూపం లో చూసాము.

అన్నట్లు పైకి వెళ్లిన మేము గట్టిగా చలిని ఓర్చుకునే కోట్, స్కార్ఫ్, చేతులకి గ్లోవ్స్, కాళ్ళకి మంచి షూస్ వేసుకున్నాము. బయటకి మంచు లోకి వెళ్లిన వాళ్ళకే కాదు, అక్కడి దాకా వెళ్లిన మాకు కూడా, చాలా అవసరం అక్కడ చలి తట్టు కోడానికి ఆ బందోబస్తు అంతా.

ఇక మళ్ళీ 530 కి కిందకి దిగి , 2.30 గంటలూ ప్రయాణించి డిన్నర్  కి వెళ్లి, అక్కడ నుండి   శయనాగారం కి  చేరుకొని, కళ్ళు మూసుకుని ఆ సుందర దృశ్య మాలికని నెమరు వేసుకుంటూ నిద్ర లోకి జారుకున్నాము.
                                                             సశేషం





ఆహా యూరప్ 7
June 15 th

పొద్దున్నే లేచి అన్ని పనులూ ముగించుకుని బస్సు ఎక్కాం 9 కల్లా.
ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తారో అని కుతూహలంగా వున్నా, అడుగుతే నిన్న ఎందుకు విన లేదని చివాట్లు పడతాయేమోనని, భయంతో అందరం గప్చిప్ గా కూర్చోలేదు, పిచ్చి అల్లరి చేసేస్తున్నాం.

ఇంతలో mike లోంచి “ ఏమిటా అల్లరి కొంచెం సేపుకూడా కుదురుగా కూర్చో లేరా? ఆయ్ హన్నా” అని భూషణ్ గదమాయించాడని మీ మనస్సు గంతులేస్తోందని bet!అవునా కాదా?

కానీ మా భూషణ్ బుధ్ధి భూషణంగా కల వాడు, మాతో పాటూ నువ్వూ హిందీ పాటలు పాడవయ్యా అంటే, ఇక్కడ ఇంత పేద్ద scholars, గురువు గార్లూ వుంటే నాకు పాడాలంటే భయం అన్నాడండోయ్!

సరే అసలు విషయానికి వద్దాం! Bhushan ఏమన్నాడంటే.........
Today we drive through the famous Black Forest region of Germany. We stop at the Drubba - the heart of the Black Forest to witness a demonstration of how traditional Cuckoo clocks are made. Drive to Switzerland, famous for soaring Alpine peaks and sparkling turquoise lakes. We stop at Schaffhausen to admire the thundering beauty of the Rhine falls.

అన్నట్లు 2 గంటల కొకసారి restrooms కోసం ఆపి కాపీలు తాగండి అని మనని ప్రోత్సహించడం కూడాను.

Black Forest వెళ్ళే దారి పొడుగునా ఎంత అందమైన scenic beauty నో.

Cockoo clock దగ్గరకి సరిగ్గా 10 టూ 1 కి వెళ్ళాం. మేము తక్కుతూ తారుతూ నడుచుకుంటూ వెళ్ళే సరికి అక్కడ కుక్కూ వాచ్ లోంచి ఇద్దరు జంట (బొమ్మలు) వచ్చి dance చేసుకుంటూ వెళ్ళి పోయారు. భలే సరదాగా అనిపించింది.

తరవాత పైకి వెళ్ళి వాచ్ తాలూకు demo విని వాచస్ చూసుకుని, కొన్న వాళ్ళు కొనుక్కుని కిందకి వచ్చి Bombay restaurant లో Indian food తిని బయట బోలెడన్ని photosతీసుకుని bus ఎక్కాం.

చెప్పడం మరిచాను Germany అంతా cycles ఎక్కవగా వాడుతున్నారు. Road కి ప్రక్కన వాళ్ళ కోసం ఎరుపు రంగుతో separate cycle track, జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. ఇక Switzerland enter అయ్యాం.

కొంచెం నిద్రా మెళుకువలతో రైన్ ఫాల్స్ దగ్గరకి వెళ్ళాం. అది ఒక మినీ నయాగరా. అందం అందం అందం. అణువణువునా ఆనందాన్ని పంచే అద్భుత సౌందర్యం. మేము బోట్ ఎక్కి ఆ falls కి అతి దగ్గరగా వెళ్ళి ఆనందంతో కేరింతలు కొట్టాం. బయటకి వచ్చి అక్కడ మంఛి మసాలా చాయ్ తాగాం.

బయలు దేరాం, గంట ప్రయాణం అయ్యాక రోడ్ మీద ట్రాఫిక్ లో గంట వుండిపోయి, నెమ్మదిగా డిన్నర్కి అనుకున్న దానికన్నా ఆలస్యంగా వెళ్ళాం.

దాంతో driver కు permission వున్న 9 గంటలూ దాటిపోతుందని, అతన్ని సామానుతో సహా హోటల్కి పంపించి, వేరే private bus తెప్పించి, మమ్మల్ని హోటల్ కి భోజనమయ్యాక దింపేరు. ఇలా సమయానుకూలముగా,ప్రయాణీకులు ఇబ్బందిపడకుండా ఏర్పాటు చేయడం SOTC వారి ఘనతే మరి, పొగిడి తీర వలసిందే!


మేము ప్రైవేట్ బస్లో Swissever hotel Switzerland కి రాత్రి 10.30 కి చేరుకుని, సామాను ఈడ్చుకుంటూ రూమ్ కి చేరుకున్నాం. పాపం మా bus driver Kris అంత సేపూ అక్కడ మాకోసం ఎదురు చూస్తూ వున్నాడు.

వాళ్ళు ఇచ్చిన passward రూమ్ లో ముందు ఎవరు operate చేస్తే వారికే granted అనుకుంటా, మా వారు ముందు connect అయ్యారు, దాంతో నేను connect అవ్వలేక పోయాను.

ఇంక నేను చిటపటలూ,మాడు మొహం వేసుకుని reception కి వెళ్లి అడిగేద్దామని బయలు దేరు తుంటే, తలుపు తీసేసరికి, ఇంకో రెండు మూడు రూమ్స్ వాళ్ళు బయట same feel తో కిందకి దిగిపోతున్నారు.

అర్ధం అయ్యిందిగా whatsapp, fb లులేకపోతే మనం పడే బాధ వర్ణనాతీతం. ఇంక తప్పని పరిస్థితిలో rest కి rest ఇచ్చి దిగులుగా, మా వారిపై అసూయగా పడుకున్నా.............

సశేషం