2, జులై 2018, సోమవారం

ఆహా యూరప్ 7
June 15 th

పొద్దున్నే లేచి అన్ని పనులూ ముగించుకుని బస్సు ఎక్కాం 9 కల్లా.
ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తారో అని కుతూహలంగా వున్నా, అడుగుతే నిన్న ఎందుకు విన లేదని చివాట్లు పడతాయేమోనని, భయంతో అందరం గప్చిప్ గా కూర్చోలేదు, పిచ్చి అల్లరి చేసేస్తున్నాం.

ఇంతలో mike లోంచి “ ఏమిటా అల్లరి కొంచెం సేపుకూడా కుదురుగా కూర్చో లేరా? ఆయ్ హన్నా” అని భూషణ్ గదమాయించాడని మీ మనస్సు గంతులేస్తోందని bet!అవునా కాదా?

కానీ మా భూషణ్ బుధ్ధి భూషణంగా కల వాడు, మాతో పాటూ నువ్వూ హిందీ పాటలు పాడవయ్యా అంటే, ఇక్కడ ఇంత పేద్ద scholars, గురువు గార్లూ వుంటే నాకు పాడాలంటే భయం అన్నాడండోయ్!

సరే అసలు విషయానికి వద్దాం! Bhushan ఏమన్నాడంటే.........
Today we drive through the famous Black Forest region of Germany. We stop at the Drubba - the heart of the Black Forest to witness a demonstration of how traditional Cuckoo clocks are made. Drive to Switzerland, famous for soaring Alpine peaks and sparkling turquoise lakes. We stop at Schaffhausen to admire the thundering beauty of the Rhine falls.

అన్నట్లు 2 గంటల కొకసారి restrooms కోసం ఆపి కాపీలు తాగండి అని మనని ప్రోత్సహించడం కూడాను.

Black Forest వెళ్ళే దారి పొడుగునా ఎంత అందమైన scenic beauty నో.

Cockoo clock దగ్గరకి సరిగ్గా 10 టూ 1 కి వెళ్ళాం. మేము తక్కుతూ తారుతూ నడుచుకుంటూ వెళ్ళే సరికి అక్కడ కుక్కూ వాచ్ లోంచి ఇద్దరు జంట (బొమ్మలు) వచ్చి dance చేసుకుంటూ వెళ్ళి పోయారు. భలే సరదాగా అనిపించింది.

తరవాత పైకి వెళ్ళి వాచ్ తాలూకు demo విని వాచస్ చూసుకుని, కొన్న వాళ్ళు కొనుక్కుని కిందకి వచ్చి Bombay restaurant లో Indian food తిని బయట బోలెడన్ని photosతీసుకుని bus ఎక్కాం.

చెప్పడం మరిచాను Germany అంతా cycles ఎక్కవగా వాడుతున్నారు. Road కి ప్రక్కన వాళ్ళ కోసం ఎరుపు రంగుతో separate cycle track, జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. ఇక Switzerland enter అయ్యాం.

కొంచెం నిద్రా మెళుకువలతో రైన్ ఫాల్స్ దగ్గరకి వెళ్ళాం. అది ఒక మినీ నయాగరా. అందం అందం అందం. అణువణువునా ఆనందాన్ని పంచే అద్భుత సౌందర్యం. మేము బోట్ ఎక్కి ఆ falls కి అతి దగ్గరగా వెళ్ళి ఆనందంతో కేరింతలు కొట్టాం. బయటకి వచ్చి అక్కడ మంఛి మసాలా చాయ్ తాగాం.

బయలు దేరాం, గంట ప్రయాణం అయ్యాక రోడ్ మీద ట్రాఫిక్ లో గంట వుండిపోయి, నెమ్మదిగా డిన్నర్కి అనుకున్న దానికన్నా ఆలస్యంగా వెళ్ళాం.

దాంతో driver కు permission వున్న 9 గంటలూ దాటిపోతుందని, అతన్ని సామానుతో సహా హోటల్కి పంపించి, వేరే private bus తెప్పించి, మమ్మల్ని హోటల్ కి భోజనమయ్యాక దింపేరు. ఇలా సమయానుకూలముగా,ప్రయాణీకులు ఇబ్బందిపడకుండా ఏర్పాటు చేయడం SOTC వారి ఘనతే మరి, పొగిడి తీర వలసిందే!


మేము ప్రైవేట్ బస్లో Swissever hotel Switzerland కి రాత్రి 10.30 కి చేరుకుని, సామాను ఈడ్చుకుంటూ రూమ్ కి చేరుకున్నాం. పాపం మా bus driver Kris అంత సేపూ అక్కడ మాకోసం ఎదురు చూస్తూ వున్నాడు.

వాళ్ళు ఇచ్చిన passward రూమ్ లో ముందు ఎవరు operate చేస్తే వారికే granted అనుకుంటా, మా వారు ముందు connect అయ్యారు, దాంతో నేను connect అవ్వలేక పోయాను.

ఇంక నేను చిటపటలూ,మాడు మొహం వేసుకుని reception కి వెళ్లి అడిగేద్దామని బయలు దేరు తుంటే, తలుపు తీసేసరికి, ఇంకో రెండు మూడు రూమ్స్ వాళ్ళు బయట same feel తో కిందకి దిగిపోతున్నారు.

అర్ధం అయ్యిందిగా whatsapp, fb లులేకపోతే మనం పడే బాధ వర్ణనాతీతం. ఇంక తప్పని పరిస్థితిలో rest కి rest ఇచ్చి దిగులుగా, మా వారిపై అసూయగా పడుకున్నా.............

సశేషం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి