28, జూన్ 2023, బుధవారం

వసంత

 మే 15.. మండుటెండ ..మూడుముళ్లూ...ఏడడగులు...


చక్కని సంసారం... చల్లనిమనసు..కుదురైన పిల్లలు.. ముద్దొలొలికే మనవలు...


విశాలహృదయం .. గృహమంతా సంగీతమయం...


ఇన్నీ ఒక యెత్తు...ఎదిగినకొద్దీ ఒదిగివుండే మనస్తత్వం..


పరులగుణగణాలను పెద్దమనసుతో ప్రశంసించి వూరుకోరు...ప్రోత్సహించి... వెన్నుతట్టి వెన్నంటే వుండే వెన్న


 మా 


జయలక్ష్మక్కయ్యగారు.


వీరి గురించి యింత ప్రస్తావించే అర్హతనాకు లేదు..అయినా వారి పెళ్లిరోజని బాగా గుర్తుండి పోబట్టి...


వ్రాయకుండా వుండలేకపోయాను.


మాస్టారుగారికీ... జయక్కకూ  మనః పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.


శిష్యప్రశిష్యులతో... దిగ్విజయంగా మీరు మరింత ఆనందోత్సాహాలతో .. జైత్రయాత్ర కొనసాగించాలని 


హృదయపూర్వకంగా అభిలషిస్తూ .....


మీ వసంత .

27, జూన్ 2023, మంగళవారం

కాటీ

 కాటీ


మీరు sprite, maaza, coco cola, miranda, sugar cane juice, లాంటివి తాగుంటారు కదా! "కాటీ" తాగారా ఎప్పుడైనా ? 

లేదు కదా! 


అవును మరి ఎప్పుడైనా మా ఇంటికి వస్తేనా? వచ్చుంటే "కాటీ" తాగుండేవారు. మరి కాటీ పెట్టడం ఎలాగబ్బా 🤔🤔🤔!


నేర్చుకోండీ.......

మరి అసలు రంగంలోకి దిగుదాం......


అప్పుడు నా వయస్సు 14. మా ఇంటికి మా పెద్దమ్మగారు వచ్చారు. ఇక మా అమ్మగారూ వాళ్ళక్కా కలసి ముచ్చట్లు.... పరనిందా పరగోష్టి ఆత్మస్తుతి కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.


చెప్పక చెప్పక నాకే టీ పెట్టమని పురమాయించారు. మనం కాఫీ టీ తాగం. కనీసం తేడా తెలీదు. అమ్మ చెప్పిన పని చెయ్యకపోతే "ప ప్ప ప్పా" అని భయంతో నీళ్ళు కాగ పెట్టి, మరుగుతుండగా పక్క పక్కనే ఒకేలా వున్న స్టీల్ డబ్బా ల్లోంచి కాఫీ పొడి వేసేసాను, వెంటనే వాసన గమనించి బాబోయ్ అమ్మ చంపేస్తుందని వెంఠనే అందులోనే టీ పొడి కూడా వేసేసాను. ఇక తక్కిన ప్రోసెస్ అంతా చేసేసి కాటీ వాళ్ళిద్దరికీ ఇచ్చేసి గర్వంగా నుంచున్నా! 


తరవాత ఏమయ్యుంటుందో ఆర్యులందరూ ఊహించగలరు!


ఇప్పుడు చెప్పండి, మా ఇంటికి ఇంకా వద్దామనుక్కుంటున్నారా?  చెప్పండీ?............