27, జూన్ 2023, మంగళవారం

కాటీ

 కాటీ


మీరు sprite, maaza, coco cola, miranda, sugar cane juice, లాంటివి తాగుంటారు కదా! "కాటీ" తాగారా ఎప్పుడైనా ? 

లేదు కదా! 


అవును మరి ఎప్పుడైనా మా ఇంటికి వస్తేనా? వచ్చుంటే "కాటీ" తాగుండేవారు. మరి కాటీ పెట్టడం ఎలాగబ్బా 🤔🤔🤔!


నేర్చుకోండీ.......

మరి అసలు రంగంలోకి దిగుదాం......


అప్పుడు నా వయస్సు 14. మా ఇంటికి మా పెద్దమ్మగారు వచ్చారు. ఇక మా అమ్మగారూ వాళ్ళక్కా కలసి ముచ్చట్లు.... పరనిందా పరగోష్టి ఆత్మస్తుతి కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.


చెప్పక చెప్పక నాకే టీ పెట్టమని పురమాయించారు. మనం కాఫీ టీ తాగం. కనీసం తేడా తెలీదు. అమ్మ చెప్పిన పని చెయ్యకపోతే "ప ప్ప ప్పా" అని భయంతో నీళ్ళు కాగ పెట్టి, మరుగుతుండగా పక్క పక్కనే ఒకేలా వున్న స్టీల్ డబ్బా ల్లోంచి కాఫీ పొడి వేసేసాను, వెంటనే వాసన గమనించి బాబోయ్ అమ్మ చంపేస్తుందని వెంఠనే అందులోనే టీ పొడి కూడా వేసేసాను. ఇక తక్కిన ప్రోసెస్ అంతా చేసేసి కాటీ వాళ్ళిద్దరికీ ఇచ్చేసి గర్వంగా నుంచున్నా! 


తరవాత ఏమయ్యుంటుందో ఆర్యులందరూ ఊహించగలరు!


ఇప్పుడు చెప్పండి, మా ఇంటికి ఇంకా వద్దామనుక్కుంటున్నారా?  చెప్పండీ?............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి