..
‘అతి సాహస వీరుడు ......అల్లి బిల్లి చందమామా ‘ కాపురం మూడు పువ్వులూ ఆరు కాయలుగా సినిమాలూ, షికార్లు,, పెయింట్ మజ్జిగ పులుసులూ, గచ్చకాయ కంద బూర్లూ........(అనుభవం ఎక్కువైనా కొద్దీ మరి కొత్త వంటలు ట్రై చేయద్దూ. లేకపోతే ఎంత అవమానం) ఇత్యాదులతో నడుస్తోంది కాలం.
ఇంతలో సంక్రాంతి
పండక్కి ఆడ పిల్లలూ,
అల్లుళ్ళూ , వస్తున్నారని, మమ్మల్ని కూడా
రమ్మని మా అత్తగారి
నుండి పిలుపు. విజయవాడ
వెళ్ళే ట్రైన్ రాత్రి పూట..
రాత్రి అయ్యింది....అన్నం
తిని...ఒక గంట ముందుగా బయలుదేరే ప్రయత్నం మొదలెట్టేము. మెయిన్ డోర్ తలుపు లోపల్నించి లాక్ చేసి బ్యాక్ డోర్ తలుపు
లోంచి బయటకి వచ్చి
బయటనుండి గొళ్ళెం వేసి తాళంవేసేము.. అన్నట్లు తాళం
మటుకూ నేనే వేసేనండోయ్! మా
ఆయన ఎక్కడ సరిగ్గా
వేయరో అని. మా పోర్షన్
మూలకుంది కాబట్టి వెనక్కి
వచ్చి చివరి దాక
వస్తేనే మా ఇంటి వెనక
తలుపు కనపడేది ఎవరికైనా.......
సరే బెజవాడ
వెళ్లి, పండగ హడావిడి....తలంట్లు,
కొత్త బట్టలు, పులిహార బొబ్బట్లు, సాయంత్రం
“భార్య బిడ్డలు” అనుక్కుంట A.N.R,
Jayalalitha, Krishna KUmari సినిమా
దుర్గ కళామందిర్లో (ఎలాగోలా
టికెట్ సంపాయించుకుని), ఫ్యామిలీ మొత్తం చూసొచ్చాం.
హమ్మయ్య పండగ ఎంత
బాగా జరిగిందో అని అందరం మురిసి
పోయాం. మర్నాడు కనుము. కనుమునాడు
మినుము అంటూ మా పెద్దత్తయ్య
చేసినవన్నీ తిని, అన్నట్లు
ఇక్కడ కూడా సహాయకురాలిగా నా
విద్యుక్త్ ధర్మం నిర్వహించి. అత్తవారి
మన్ననలు పొంది, అంతులేని
త్రుప్తితో తిరిగి హైదరాబాద్
వచ్చాం.
సికింద్రాబాద్ స్టేషన్
నుండి ఆటో
ఎక్కాం...........ఇంటికి
వచ్చాం. మా ఆయన
ఆటో డబ్బులిస్తున్నారు, నేను ఈ
లోగా లొడా బిడా వెనక తలుపు
దగ్గరకి వచ్చి అవాక్కయ్యాను,
పరుగెత్తుకుంటూ బయటకి వెళ్లి
ఆయస పడుతూ “బావా బావా! మనింట్లో
దొంగల పడ్డారు” అని అరిచేను. ఆటో
వాడితో సహా ఇంటి
ముందు ముగ్గు వేస్తున్న
మగువలు కొందరూ,, అరుగు మీద
కూర్చుని ప్రకృతి సౌందర్య
ఆరాధన చేస్తున్న మగవారు కొంత
మంది వచ్చేరు పరుగెత్తుకుంటూ....... భయ పడిపోయాను? మా ఇంట్లో ఉన్న
“చిన్న అన్నం గిన్నె, రైస్
కుక్కర్, మిల్క్ కుక్కర్, ఇత్తడి పప్పు
గిన్నె, మా ఒత్తుల
స్టవ్ , మా రెండు స్టీల్
గిన్నెలు, మా మూకుడు, మా మంచం పరుపులూ” ఎత్తుకు పోతే? మాకు
ఎలా? అప్పుడు అవే
ఎక్కువ కదా మరి............
అందుకే అరిచా గట్టిగా “బావా బావా మనింట్లో
దొంగలు పడ్డారని”
సరే ఇక అసలు విషయం
ఏమిటో మీరే గ్రహించండి... మీ కోసం ఈ
ఫోటోలు..............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి