19, మే 2015, మంగళవారం

గారెలు

గారెలు........
 రోజులు గడుస్తున్నాయి.....పెద్ద  గృహిణిని   అయిపోయానని  నాకు  నేను  భావించి,  నన్ను  నేను  గొప్ప  ఇల్లాలుగా  మా  ఆయన  వద్ద  నిరూపించుకుందుకు,   ఎలాగూ  నానుడి  ఉంది  కదా  తింటే  గారెలు  తినాలని  వింటే  భారతం  వినాలనిఅనీ,  గారెల  పప్పు  నానపోసాను.    కొంచెం సేపయ్యాక  ప్రాసెస్  మొదలెట్టేను. రుబ్బుదామంటే  చెయ్యి  తిరగట్లేదు,  ఈజీగా  ఉంటుందని  నీళ్ళు  పోసుకుంటూ.... దాన్ని  దోశల  పిండిలా  పల్చగా  రుబ్బేసాను.  

      ఎలా  గారెలు  ఆకారం   తీసుకు  రాడం,,    ఇంట్లో  ఉన్న  (బహుసా)  బియ్యప్పిండి  బోలెడంత  వేసేను,  గారెల  పిండి  రెడీ.  సరే! ఇది  ఒక  ఎత్తు  అవుతే,  వేయించడం.........  వేడి  సెగలొస్తున్న   నూనె   లోకి  ఎత్తు నుంచి  మధ్యలోకి  గారెల  పిండి  వెయ్యడం.  (అన్నట్లు  ముందు దాన్ని  ప్లేట్  మీద గారెలాగా  చేసి, రంధ్రం  పెట్టేక,  ప్లేట్  మీంచి  చేతిలోకి  తియ్యడం  రాట్లేదు,  అతి కష్టం మీద చేతిలోకి  తీసుకుని  నూనేలో  వేస్తే  వేడి  వేడి  నూనె చిందులు  చేతి  మీద పడ్డాయి. ఆక్షణం లోనే  తీవ్ర  నిర్ణయం  చేసుకున్నా,  ఇంకెప్పుడూ  గారెలు  చెయ్యనని)

       సరే  ఘుమ  ఘుమలాడే  గారెలు  రెడీ.  మరి  ఎంతో  గొప్పగా  మా  ఆయనకి  పెట్టేను............... నోట్లో  పెట్టుకుని  దిక్కులు  చూస్తున్నారు,  ఇంతలో  తలుపు  మీద  దడ దడ దడా  బాడుతున్నరెవరో.  తలుపు  తీసి  చూద్దును కదా,  మా  తమ్ములున్గారులిద్దరూ............సంతోషం  ,   మా  ఆయన  వాళ్ళిద్దర్నీ  (12,13 వయస్సు వాళ్ళిద్దరూ) మీ అక్క  గారెలు  చేసింది  తినమనిచ్చారు.

        వాళ్లండీ అయ్యో  మన  అక్క  కదా, రాయి  లాంటి  గారెలు  చేసింది,  మనం  కాపాడాలి,  కష్ట పడిందీ  అని  ఒక్క పిసరు  కనికరం, లేకుండా.....ఛీ ఇవి  గారెలా.....అనుక్కుంటూ  గోడ  కేసి  కొట్టడం,  తిరిగ  పట్టుకోడం,  మళ్ళీ గోడకి  బంతిలా   కొట్టి  ఆడుకోడం. ( కానీ అది  బంతిలా లేదుగా,  రాయిలా ఉందిగా. వాళ్ళ  చేతికే  దెబ్బలు  తగిలాయి,  లేక  పోతే  నన్ను  సేవ్  చెయ్యరా, మంచి  పని  అయ్యింది  అని  సణుక్కున్నాను)

             ఇక  చివరిగా ఒక  కొస మెరుపు......మా పెద్ద తమ్ముడు  చేత మా అమ్మగారు  నల్లగుంట  నుండి  లోకల్ ట్రైన్ లో సీతఫల్మండీకి   మాకు పది  జంతికలు  పంపి,  ఆ విషయాన్నీ  చీటీ రాసి,  వాడి  చేత పంపేరు,  నేను  దాని  మీద  ముట్టి నది అని సంతకం పెట్టాలిట.  ఎందుకంటే  వాడు  దారిలో  వాటిని  ఆరగించేస్తాడేమోనని కల్గిన అనుమానానికి  పరిష్కారం  ఇది.  ఇంట్లో  తిన్నా  మళ్ళీ  జంతికలు  చేతిలో  ఉంటే తినకుండా  ఉండగలరా  ఎవరైనా?  
                               
           అప్పట్లో  ఆటో  సీతాఫల్మండి  నుండి  సికింద్రాబాద్  స్టేషన్కు 80  నయపైసలు,  ద్రాక్షపళ్ళు కిలో  80 పైసలు, యాబియ్యం  కిలో రెండు  రూపాయల  చిల్లర, నూనె  నలుగు  అయ్యిందని  బాధ  పడి  పోయాం.  కాబట్టి  ఇది  వరకు  అని  గత స్మృతులు  తలచుకుంటే  ఆశ్చర్యంగా  ఉందంటే  అర్ధం  మనం  చాలా........పెద్ద  వాళ్లమయినట్లు.  కానీ  ఒట్టేసి  చెబుతున్నా,  నాకు  ఇదంతా  నిన్నా   మొన్నా  జరిగినట్లుంది?

  ఇలా  సాగుతోంది  హైదరాబాద్  కాపురం.......ఇంతలో  మా బుజ్జి  గాడు   విజయాదిత్య  పుట్టేడు.... సశేషం.......
         

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి