నారాయణ గుడా స్కూల్ నుండి
చిక్కడపల్లి ఇంటి దాకా
పెద్ద బస్తాడు పుస్తకాలు
మోసుకుంటూ ఇంటికి రాగానే
అమ్మేది అమ్మేది అని
వెతుక్కుంటుంటే అమ్మ చిట్టి
అత్తయ్యా వాళ్ళింటికి వెళ్లి బన్
చేస్తోంది అని తెలిసింది.
నోరు ఊరి పోయింది.
దానికి చాలా కారణాలున్నాయి.
1)
స్వీట్ చేస్తోంది
మా అమ్మ.
2)
ఇంగ్లీష్ వంటకం
బన్ ఇంట్లో చెయ్యడం
(బన్ కోసం జ్వరం
అని, ఎన్ని దొంగ
వేషాలు వేసేవాళ్ళం, ఈ రోజు
అది సర్వ సాధారణ తిండి)
3)
అందులోనూ
స్కూల్ నుండి రాగానే
వెయ్యి ఏనుగుల ఆకలి,
అలసట, అమ్మ కోసం
వెతుకులాట.
సరే! ఇక
వాళ్ళింటికి పరుగెత్తుకుంటూ వెళితే
కలిగిన తీవ్రమైన నిస్పృహ
ఏమిటో తెలుసా?
రంగు, రుచీ వాసన దేనికీ
సరి కాని బన్ అక్కడ తయారవుతోంది.
అంతటి నిరాశా,
నిస్పృహా, నీరశం ఇంకెప్పుడూ రాలేదు.
ఇప్పుడు మీకే ప్రశ్న అది
ఏమిటి? నేను ఆన్సర్
తరవాత చెబుతా, ఎవ్వరూ
చెప్పలేక పోతే.................
(అది జుట్టుతో చేసే "ముడి బన్" అండి.)
అర్ధంయ్యిందనుక్కుంటాను ఎందుకు అంత తీవ్ర నిరాశో..........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి