అవును మా ఇంట ఇరువురు శ్రీరామచంద్రులు పుట్టేరు.
వాళ్ళు పిత్రువాక్య పరిపాలకులైనా, మా
పాలిట కరటక దమనకులూ / నక్షత్రకులూ. ఎందుకంటారా?
మరి చదవండి..........
మేము ఏడూ, ఆరూ
తరగతులు చదువుతున్నాం (నేనూ, మా
చెల్లీ) వివేకనగర్ వెల్ఫేర్
సెంటర్కి ఘంటసాల, కుట్టి
పద్మిని, రాజసులోచన , సి. స్. రావు
వస్తున్నారని అందరూ వెళ్ళబోతున్నారు, మాకు
తెలిసిన పిల్లలూ పెద్దలూ. ఇందులో
మాకు నచ్చిన వారు
ఘంటసాల, కుట్టి పద్మిని.
మా నాన్నగారిని ఒక్కరే
అడిగితే తిట్లన్నీ
వాళ్ళకే చెందుతాయని......ఇద్దరికీ చెరి
సగం పంచుకోడానికి వీలుగా
నేను “నా” మా చెల్లి “న్న” మళ్ళీ నేను “గా” మా
చెల్లి “రు” ఇలా
కూడ బలుక్కుంటూ అడిగేము.
ఏ కళనున్నారో కానీ
సరే అన్నారు. ఎన్నింటికి
వస్తారు వాళ్ళు అని అడిగేరు.
రాత్రి ఏడూ గంటలకి
అని చెప్పేము. సరే
మాతో బాటూ మా
తమ్ముళ్ళిద్దరూ కాపలాకి వచ్చి మమ్మల్ని
అరగంటలో వెనక్కి తెచ్చేయ్యాలి,
అదీ ఒప్పందం...... ఎంత
ఆనందపడ్డమో చెప్పలేము.
ఇక సాయంత్రం ఆరున్నర........... బయలుదేరి నలుగురం
నడుచుకుంటూ వెల్ఫేర్ సెంటర్కి
వెళ్ళాం......అప్పటికే అక్కడ ఇసుక
వేస్తే రాలనంత జనం.
పాపం బుజ్జి గాళ్ళం
ఎలాగోలా అక్కడ దూరంగా
కూర్చున్నాం. ఏడు అయ్యింది,
రాలేదు............. ఏడున్నర అయ్యింది రాలేదు.
ఈ లోగా మా సాకేతపురవాసులిద్దరూ చేతికి
వాచీలు లేక పోయినా
పక్క వాళ్ళని టైం
అడిగి అరగంట అయ్యిందని
బయలుదేరమని రక రకాలుగా
వొత్తిడి చేస్తున్నారు. మేము
పక్కకి ముఖం తిప్పం,
వాళ్ళని చూడం. ఇంతలో ఎనిమిదిన్నర అయ్యింది
వచ్చారు, వచ్చారంటూ అందరూ
లేచి నుంచుని చూస్తున్నారు. మళ్ళీ
కూర్చోడంలో మా కాలి వేళ్ళు,
పాదాలూ తొక్కి పడేసారు.
ఏడుపు ఆపుకుంటూ నోర్మూసుకుని
కూర్చున్నాం.
ఘంటసాల గారు “భలే
మంచి రోజు” “జరిగిన
కధ పాట” పాడేరు. ఈ కరటక -దమనకులు కూడా
మాతో కలసి పోయి
ఆనందిన్చచ్చు కదా..............
మమ్మల్ని చంపుకు తిని
బయలుదేర దీసేరు... అప్పుడే అసలు
వాళ్ళందరూ వచ్చి ఇదు
నిమిషాలయ్యింది.........
ఏడుపు మొహాలతో ఇంటికి
వచ్చేం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి