నేను అనుకున్నాను “ఎవరైనా సరే ఏదైనా రాద్దమనుక్కోగానే,
పరా పరా రాసేయచ్చని” కానే కాదు,
నాకు నా డెస్క్ టాప్, నా గూగుల్
తెలుగు లాంగ్వేజ్ బార్, నా కుర్చీ, నా బుజ్జి సింగిల్
మాన్ ఫాన్ అయితేనే
రాయడానికి మూడ్ వస్తుందని అర్ధమయ్యింది.
రెండు రోజులనుండి తెలుగు
లాంగ్వేజ్ బార్ కనిపించక
రాయ లేక పోయా. కాబట్టి
నేను కూడా రచయిత్రిని
అయిపోయానోచ్....... (నన్ను
రచయిత్రి కాదన్నవాణ్ణి రాయెట్టి
కొడుతా)
గణపతి నాటకంలో చెప్పినట్లు “కలిగిన వాడు గుర్రమెక్కితే
లేని వాడు గాడిద
ఎక్కినట్లు” ఆత్రేయ గారు
ఊటీ వెళ్లి రాస్తే
నేను, మా డెస్క్ టాప్ దగ్గర రాస్తా.
ఇదే నా ఊటీ , కొడైకెనాల్. అమ్మయ్య....ఇక
మూడ్ లోకి వచ్చేసా........
పెళ్లి మర్నాడు
మా మ్యూజిక్ కాలేజీ విజయవాడ
ప్రేమిమిసిస్లో నూకల వారి
కచేరీ, (అన్నట్లు బాపట్లలో కూడా ప్రకాశరావు గారి
కచేరి) తదనంతరం భావన
కళా సమితి వారి సినీ విభావరి. (మా వారి
స్నేహితులు) అందులో ఇప్పటి
మహా మహులు పాల్గొన్నారు.)...మాధవపెద్ది రమేష్,,
మాధవపెద్ది సురేష్, చంద్రకాంత,
సర్రాజు ప్రసన్న కుమార్ (వాలు జెడా తోలు బెల్టు మ్యూజిక్ డైరెక్టర్) ఇత్యాదులందరూ అద్భుతంగా
ఆనందింప చేసేరు వచ్చిన
అశేష జనాన్ని.
ఇలా
మొదలయ్యింది వైవాహిక జీవనం...... మళ్ళీ రేపు
కలుద్దాం..........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి