ఆ తలపే ఎంత
హాయి. నేను పుట్టింది,
పదవ తరగతి చదివింది,
పెళ్లి మా బాపట్ల
లోనే.
అంతే కాదు (మా వారి
ఊరు) మా మేనత్త గారు,
మా అమ్మమ్మగారు కూడా
బాపట్లలో ఉండడం (అందువల్లే కదా మా
అమ్మ నాన్నగారికీ పెళ్లి
జరిగింది) వల్ల మా ఇద్దరికీ
బాపట్ల యందు ఎన లేని
అభిమానం. గుంటూరు కాలేజీ
ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు టైం
దొరికితే సినిమా బదులు
బాపట్ల మాయాబజార్
వరకూ రిక్షాలో ,
అక్కడ దిగి పోయి, అక్కడ
నుండి మాయాబజార్ అంత
వాక్ చేసుకుంటూ తిరిగి బస్సు
స్టాండ్కి వచ్చి బస్సు లో
గుంటూరు వాపస్. అంత ఇష్టం.
మద్రాస్ వెళ్తున్నప్పుడు బాపట్ల
రాత్రి పూట వచ్చినా సరే
లేచి ఉండి చూద్దామంటే,
ఈ చివర్నించీ ఆ చివరి దాక
గూడ్స్ బండి! తిట్టుకుంటూ
బాపట్ల సోడా తాగి
పడుక్కోడం..........
ఇక బాపట్ల ఎంత అందంగా
ఉంటుందో మీకెవ్వరికీ తెలీదు కదా (అన్నట్లు నారాయణ స్వామి
గారికి తెలుసు) మల్లె పూలు,
మంచి వంకాయలు, చల్లని సాయంత్రం,
రాత్రి దూరంగా ఎక్కడినుంచో
చక్కగా పాటలు, మంచి నెయ్యి,
దూరంగా తాటి తోపులు. ఆ
తాటి తోపులవతల స్టువర్టు పురం.
పిచ్చి దొంగలు పాపం
వాళ్ళు రాత్రి పూట వచ్చి
ఇంట్లో ఉన్న చద్దేన్నం
బావి గట్టు మీద
కూర్చుని తినేసి, అందరి చెప్పులూ కుక్కల
మీద విసురుకుంటూ వెళ్ళిపోయేవారు
(అవి అరవకుండా). మళ్ళీ తాటి తోపుల్లోకి. ఇంతకీ
వాళ్ళు ఎందుకొచ్చినట్లో ? చద్దేన్నం తినడానికా?
లేక పట్టికెళ్ళే విలువైన వస్తువులు
దొరక్కా? చిన్న వాళ్ళం మాకు తెలీదు, ఆ
భగవంతుడికే తెలియాలి. మళ్ళీ
అంటున్నా....పాపం పిచ్చి దొంగలు.
ఇక బాపట్ల
ప్రశాంతంగా ఎంతో
అందంగా పూల మొక్కలూ,
మేడ మీద కెళ్తే మబ్బులూ,
చల్ల గాలులూ ఆహా! ఎంత
బాగుండేదో. అప్పుడు సీలింగ్
ఫాన్స్ లేవు, పెడస్టల ఫ్యాన్ ఒక్కటే
ఉంది ఇంటి మొత్తానికీ,
అయినా చాలా హాయిగా పడుక్కునే వాళ్ళం.,
మరి ఇప్పుడో ఎసి
ఉంటె కానీ నడవదు
జీవితం . ఎందుకో ఈ
మార్పు. మనుషుల వాళ్ళమే
కానీ, మన మనస్సులూ ,పరిస్థితులే మారాయి.
ఉన్నాయని వాడుకుంటున్నామా?/
అవసరం ఉందా? తెలీదు!
సమాధానం ఇంతే.
మేము పదవ క్లాసు
బాపట్లలో చేరడానికి వెళ్తే,
మమ్మల్ని మహారాణులు/అప్సరసలు అనుకుని
చూసారు. మేము హైదరాబాద్ (సిటీ) నుండి వచ్చాం, పైగా కొంచెం తెల్ల
తొక్కతో ఉన్నాం కదా
అందుకని. నిజం నేను గొప్పలు
కొట్టడం లేదు. మళ్ళీ
అంటున్నాను పిచ్చి వాళ్ళు!
ఎంత హైదరాబాద్ వాళ్ళం అవుతేనేమి?
మాకు చిక్కడపల్లి నుండి
నారాయణగూడా వరకే తెలుసు.. హిందీ పిచ్చి
పిచ్చిగా మాట్లాడ్డం రాదు, ఇంగ్లీష్
మాట్లాడాలంటే భయం! ఇంక
వాళ్ళకీ మాకూ తేడా ఏమిటి? అదే
భ్రమ అంటే. నేను హైదరాబాద్లో తొమ్మిదో తరగతి
వరకూ ఇంగ్లీష్ మీడియం లో
చదివి, పది మటుకూ బాపట్లలో
ఇంగ్లీష్ మీడియం
లేక తెలుగు మీడియంలో
చదివినా.................ఊరు అంతటికీ
ఫస్ట్. బుర్ర
ఉందండీ.......రుబ్బడం కూడా బాగా
వచ్చు, ఇంకేమి కావాలి...
అందుకనే అంటున్నాను తక్కువేమీ లేదూ నాకూ,
తెలివి ఉంది చాలూ,,,
ఎక్కడ
పెడితే అక్కడ బెస్టే............ఒప్పుకుంటారో లేదో.....మరి...........
బాపట్ల
గూర్చి చెబుతే నేను చాలా....చేట భారతం రాసేస్తాను,
అందుకని నన్ను నేను
నియంత్రించుకుంటూ......రేపటి వరకూ శలవా మరి?
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి