24, అక్టోబర్ 2015, శనివారం

అల్లి బిల్లి చందమామ

అల్లిబిల్లి చందమామ ఈ చిన్నారి.............
చిన్ని బాలుడే కానీ..... ఆకాశంలో ఎగరాలని, (పక్షిలాగా), మబ్బులతో నడయాడాలనీ, కాళ్ళకి లేపనాలు పూసుకుని ఆకాశ గమనం చెయ్యాలని, కుక్కపిల్లల మీసాలు పీకాలని, ఇంటికొచ్చిన వారి చెప్పులు దాచేసి వారు వెతుక్కున్టుండగా మళ్ళీ తెచ్చి ఇవ్వాలనీ, ఇలా ఏవేవో చిలిపి తలపులు ఆ బాలుడికి మదిలో వెళ్లి విరిస్తుంటాయి......
ఇక అసలు విషయానికి వద్దాం......
ఒక సారి ఆ బాలుడింటికి వారి మేనమామ వచ్చేరు. ఇక మన చిన్నారికి ఆనందం హద్దులు లేకుండా పొయ్యింది. ఆ వచ్చినాయన బాగ్ లోంచి పేస్టు బ్రష్ తీసుకుని, బ్రష్ మీదా పేస్టు పెట్టుకుని, బ్రష్ చేసుకుందుకు వెళ్ళేరు.
మన బాలుడికి పేస్టు వాసన చూసి అది స్ట్రాంగ్ పిప్పెర్మేంట్ వాసనలా ఉంది అనిపించింది. అంతే బుర్ర పరి పరి విధాల ఆలోచించింది.
కొంచెం తీసుకుని అలమారాలో రౌండ్గా బిళ్ళల లాగా అంటించుకుని (ఆరేక స్ట్రాంగ్ పిప్పెర్మేన్త్స్ అవుతాయనే భావన, భ్రమతో) ఆరేక ఆ స్ట్రాంగ్ బిళ్ళలు తినచ్చని భావించాడు.
ఇంతలో బుర్రలో మరో ఆలోచన తళుక్కున మెరిసి మొహానికి పూసుకుంటే తెల్లగా స్నోలాగా ఉంటుంది కదా అని మొహానికి పూసుకున్నాడు.

మొహం మండి పోతోంది, ఇంతలో మేనమామ పని పూర్తి చేసుకుని వచ్చి చూసి విషయం అర్ధం చేసుకుని ఒళ్ళు మండి కొట్టాలని పించినా మళ్ళీ బాగుండదని (కాబోయే అల్లుడని) నిస్సహాయంగా చాలా ఎక్కువగా ముద్దు లాడి ఏడుపు మొహం పెట్టుకుని ఊరుకున్నారు.
వచ్చిన గెస్ట్ ఊరుకున్నా, వాళ్ళ నాన్నగారూరుకుంటారా? ఊరుకోలేదంతే...ఊరుకోలేదు......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి