"సత్తుగిన్నె"
అవును సత్తుగిన్నే.....ఇది అటక సర్దుతుండగా దొరకగానే, మనస్సు పులకించింది. ఎన్ని స్మృతులు దీనితో?...
1971 లో పెళ్లి అయ్యి హైదరాబాద్ కాపురానికి పంపుతూ మా పుట్టింటి వాళ్ళు పులుసులూ, సాంబార్లూ, చార్లూ పెట్టుకోమని మా ఇద్దరికీ ఇచ్చిన సత్తుగిన్నె ఇది.(బుజ్జిది).
ఇందులో విశేషం ఏముంది పెద్ద, అందరికీ ఇస్తారుగా? అదేనా మీ ఆలోచన...
కానీ మాకు ఉందండోయ్! మా వారు సికింద్రాబాద్ సంగీత కళాశాలలో కొలువు. డిసెంబర్లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ మాదిరిగా రోజూ రవీంద్రభారతిలో త్రీ షోస్ సంగీత ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసేరు, కల్చర్ డిపార్టుమెంటు వారు.
ఆ రోజు ఫస్ట్ షో M.S. Subbu Lakshmi అమ్మ ప్రోగ్రాం, సెకండ్ షో బిర్జు మహారాజ్ కథక్ డాన్స్ . 11.30 రాత్రి దాకా ప్రోగ్రాం అయ్యింది, అయ్యాక బయలుదేరి సీతాఫల్మండి వచ్చాం. ఇంటికి రాగానే మరి భోజనం చెయ్యాలిగా?
చలి కాలం కాబట్టి నేను మధ్యానం చేసి వెళ్ళిన సాంబార్ ఒక ఒత్తుల స్టవ్ మీదా, రెండో స్టవ్ మీద వండుకుని వెళ్ళిన అన్నం వేడి చేద్దామని పెట్టి నడుం వాల్చి మంచి నిద్రలోకి వెళ్లి పోయాం.
తెల్లవారుఝామున 4 వేళ మెలుకువ వచ్చి, అబ్బ ఎవరింట్లోనో కండి పప్పు మాడి పోతోంది, ఇంత పొద్దున్నే మాడుస్తున్నారు అనుక్కుంటూ కళ్ళు విప్పేసరికి ఇల్లంతా దీపావళి లాగా కాంతులీనుతూ ఉంది లైట్లతో. వంటిట్లో చూద్దుము కదా , సాంబార్ నల్లగా తెట్టు కట్టేసింది (ఈ సత్తుగిన్నే అది, తోమేసరికి తాతలు దిగోచ్చేరు) ఇప్పడి వాళ్ళయితే విసిరేస్తారు, కానీ అప్పుడు దాచేను కాబట్టే ఈ నాడు ఈ స్మృతి.
ఇక కుక్కర్ లో అన్నం ఎర్ర బియ్యం అన్నంలాగా ఎర్రగా మారి పోయి స్టవ్ ఒంటి కన్నుతో వెలుగుతోంది. సాంబార్ స్టవ్ కిరోసిన్ అయిపోయి ఆరిపోయింది.
కాబట్టి ఇంత కధ ఉంది ఈ సత్తుగిన్నె తో...

సరదాగా మళ్ళీ ఇవాళ దీనితో మా ఇంట్లో మంచి ఘుమ ఘుమ లాడే చారు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి