మా రాజ్యలక్ష్మి...
మా చిలకమ్మ. రాజ్యలక్ష్మి అనగానే నగుమోముతో కళ కళ లాడుతూ కనిపించే ఒక అందమయిన గృహిణి మనకు గోచరిస్తుంది.
ఎంత మందిలో వున్నా గలగలా. అందరితో కలుపుగోలుగా ఆత్మీయంగా మనః పూర్వకంగా పలకరించి మాట్లాడుతుంది.
అలంకరణ చేయడం ఇష్టం. చక్కటి సలహాలు ఇచ్చి పూజలూ, పెళ్ళిళ్ళ కార్యక్రమాలు, ఏ కార్యక్రమమైనా
నిర్వహించ గలదు.
వీణ చాలా బాగా వాయిస్తుంది. కాకపోతే తను తన భర్తతో పాటే వీణ వాయించాలని నియమం పెట్టుకోడం వల్ల విడిగా స్టేజ్ మీద వాయించదు. ఎంతో మంది శిష్యులను నిష్ణాతులుగా తయారు చేస్తున్నది. పతి సేవా పరాయణురాలు.
అతిథులను ఆదరించడంలో అన్నపూర్ణా దేవి.
అయ్యగారి వారికి తగిన కోడలు. ముఖ్యంగా సత్యప్రసాద్ కు దొరికిన జాతి వజ్రం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి