28, మే 2020, గురువారం

టెలీఫోన్

"బూచాడమ్మా బూచాడు
బుల్లి పెట్టెలో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడూ
కబురులేన్నో చెబుతాడు"

తెలిసిందిగా.
5 వ క్లాసులో వుండగా, నా దోస్త్ దేవికారాణి ( వాళ్ళమ్మ సినిమా ఏక్టర్ అని చెప్పింది) వాళ్ళకి ఫోన్ వుందంటే నంబరు తీసుకుని, మా నాన్నగారి శిష్యుల ఇంట్లో ఫోన్ వుంటే, (చిక్కడపల్లి గుడి పక్కన రెండో ఇల్లు) డాక్టర్ గారింటికి వెళ్ళి, నా ఫ్రెండ్స్ అందరినీ లోపలకెళ్ళనిచ్చి, భయం భయంగా చూసుకుంటూ  ఫోన్ చేస్తే పలకట్లేదు.

కారణం మౌత్ పీస్ చెవి దగ్గర, ఇయర్ ఫోన్ నోటి దగ్గర. ఈలోగా అలికిడి, పెట్టేసాను.

చాలా రోజులు ఫోన్ ఎలా పట్టుకోవాలో డౌట్. కొండ గుర్తు పెట్టుకున్నా, నోటి దగ్గర నుండీ తోకలా వైర్ వేళాడుతుండాలి.

హమ్మయ్య  తరువాత ఇక తిరుగు లేదు నాకు. ఈ రోజు ఫోన్ వీర వనితగా వినతికెక్కాను.... 😄😄😄😄😄

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి