13, మే 2020, బుధవారం

O. V. S. N. Murthy

మానవత్వం పరిమళించిన మహనీయుడు.... O. V S. N. Murthy..... 

మా చెల్లెలి మరిది.  గొప్పగా చెప్పుకోవలసిన వ్యక్తి. ఎవరికీ అలవికాని, ఎవ్వరూ ఎత్తుకోలేని, ఎత్తుకుందుకు సాహసించని బరువునూ, బాధ్యతనూ తన బుజంపై ఎత్తుకున్నారు.
మా చెల్లెలూ భర్తా వుండగా, వారిద్దరూ సత్యం, భార్య, పిల్లలను సొంత బిడ్డలలాగా చూసుకున్నారు. వారి నిష్క్రమణానంతరం కూడా సత్యం కొడుకే అనుకున్నారు.
ఎంత మంది కొడుకులు తల్లి తండ్రులను కానీ, వారి బాధ్యతలను కానీ నెత్తిన పెట్టుకుంటున్నారు నేటి కాల మాన పరిస్ధితి లో.  అన్న,  ఒదినా ఒదిలి వెళ్ళిన మోయలేని, ఎవ్వరూ మోయ సాహసించని బాధ్యత సేవా భావంతో తీసుకుని, ప్రేమగా సేవ చేస్తున్నారు.

అన్న చివరి దశ నుండి, సుమారు ఒక దశకంగా సత్యం వారికి వెన్ను దన్నుగా నిలచి సహాయ సహకారాలందించిన మానవతా మూర్తి. ఈ చివరి మూడు సంవత్సరాలు అయితే పూర్తిగా మా చెల్లినీ, కొడుకునీ కంటికి రెప్పలా కాపాడేరు. అన్న ఒదినల కర్మకాండలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఎవరండీ ఎవరు, తనది కాని బాధ్యతను తనదిగా చూసుకునే వారు, చేసుకునే వారు.

ఇక ముఖ్యంగా....మా చెల్లి చిన్న కొడుకు... 40 సంవత్సరాల  పసి బాలునికి, రోజుల పిల్లవానికి చేయవలసిన  సేవలు చేసే బృహత్కార్యం తీసుకున్నారు. ఎంత కాలమో అంచనా తెలీని ఆ బాధ్యత తీసుకుందుకు చాలా సాహసం, సేవా భావం వుండాలి.

O. V. S. N. Murthy... సామాన్యుడుగా కనిపించే అసమాన్యడు, మాన్యుడు.

వీటన్నిటికీ భార్య సహకారం లేనిదే చెయ్యలేరు. భర్తను ఈ బాధ్యత తీసుకోవద్దని అడ్డుకొట్టకుండా, సంపూర్ణ సహకారాన్నిస్తున్న వరలక్ష్మి గారిని ముందు శ్లాఘించాలి.

ఎప్పుడో ఫలానా వారు అలా అని చెప్పుకోడం ఇష్టం లేక, వెంటనే చెప్పాలనిపించింది.

వరలక్ష్మీ సత్యం మీరిద్దరూ ధన్య జీవులు. మీరు చేస్తున్న ఈ సేవకు భగవంతుని పరి పూర్ణ ఆశీస్సులు మీపై కనక వర్షంలా సదా కురుస్తునే వుంటాయి.

సమస్త సన్మంగళాని భవంతు తథాస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి