పాపం నేను....
ఆ ఇంటి వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చే లోగా ఫోన్ చేసేను మా ఒకానొక ఫ్రెండ్ దేవికా రాణికి. వాళ్ళింట్లో ఫోన్ వుందంటే, నంబరు అడిగి తెచ్చుకున్నాను. అది పట్టుకుని చేసాను గబ గబా..... వినిపించదే.... అస్సలు వినపడ్డం లేదు.
ఎలా వినిపిస్తుందండీ ఎలా వినిపిస్తుందీ? మౌత్ పీస్ చెవి దగ్గరా, ఇయర్ పీస్ మూతి దగ్గర పెట్టు కుంటే. 😄😄😄😄
చాలా రోజులు పాటూ...ముందు మనం హలో అనాలా? వాళ్ళు అనేదాకా ఆగాలా? సందేహంతో తలకిందుల తపస్సు.🤔🤔🤔 .చివరికి అవమానం దిగమింగి, మొహమాటం ఒదులుకుని ఎలాగోలా నా ఆంతరంగిక ప్రియ మిత్రురాలిని రహస్యంగా అడిగితే.... నాకూ తెలీదని సమాధానం. ఎవరింట్లో ఫోన్ వుందని?. చివరికి ఎలాగోలా తెలుసుకున్నాను.
ఇప్పుడు సెల్లు హస్తభూషణం. పైగా మొన్ననే ఎంతో అపురూపంగా సంపాయించుకున్న లాండ్ లైన్ తీయించేసాము.
కాలం పెను మార్పులు తీసుకు రావచ్చు, కానీ జ్ఞాపకాలు మటుకూ మనం వున్నంత వరకూ మనతోనే పదిలంగా వుంటాయి. ఏమంటారు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి