"మౌనమే నీ భాష ఓ మూగ మనసా" అన్నట్లు...... భాష కందని భావం. ఎంతమంది మమ్మల్ని ఆశీర్వదించేరో, ఎంత మంది శుభాకాంక్షలు అందించేరో అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
ఆత్రేయ గారు అన్నట్లు "నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి" అని, నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుపుతో కాదండీ బాబూ! ఆనందంతో. వాటినీ " ఆనంద భాష్పాలు" అంటారు లెండి....
ఈ కార్యక్రమాన్ని ఎంతో సుందరంగా, సుమనోహరంగా తీర్చి దిద్దిన ప్రతీ ఒక్కరికీ (ముఖ్యంగా సంకల్పించిన నా చెల్లెలు ఉమాదేవి, దానిని అందంగా ఆచరణలో పెట్టిన నా భర్త శ్రీ శ్యామసుందర్ గారికి) ధన్యవాదాలు.
ఇంతమంది స్నేహితులు, శిష్యులూ, బంధువులూ ఆత్మీయులను సంపాయిన్చుకున్నామనే భావన చాలా త్రుప్తినిస్తోంది.
ఇంతకనా పరిపూర్ణత ఏముందండి జీవితానికి.
రోజూ రాయడం అలవాటయి పోయి చేతులు...........పుట్టేస్తున్నాయి. ఏం చెయ్యాలబ్బా? సరే ఎదో ఒకటి చేద్దాంలే. అయినా నా వీణో, మళ్ళీ వీణ వాయిన్చుకోవాలి.. అసలే ఈ మధ్య "ఊహూ! అస్సలు......... లేదు" అయినా గురువుగారు ఊరుకోరుగా.
అయినా నాకు మరీ ఉబలాటం ఎక్కువైతే రాసేస్తా, తప్పదు మీరు చదవక............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి