(ఆ గతానికి స్వాగతం)....
నేనే ఉమాదేవిని. ఎందుకూ అంత ఆశ్చర్య చకితులవుతున్నారు. ఇంత మంది నా వాళ్ళు నాకిష్టమైన సంగీతం పాడుతుంటే నేను ఎక్కడకెళ్లగలను చెప్పండి, ఇక్కడే మీ మధ్యే తిరుగుతున్నా. మా అక్క మీ అందరినీ పాడమంది కదా, నేను కూడా నా చిన్ని శిష్యుడు బబ్లూతో కలసి పాడుతాను, విని మీ
అభిప్రాయాలు చెప్పాల్సిందే.
నా గురించి...
నాకు ప్రకృతి ఇష్టం, అందమైనవి ఏమైనా ఇష్టం, వంటలిష్టం, పాటలు, మాటలు,చీరలు, నగలు, నవ్వులు, పువ్వులు, మనషులు, మమతలు, ఆటలూ, అందంగా తయారవ్వడం. వేయేల నాకు ఈ మానవ జన్మ ఇష్టం.
కానీ భగవంతుడు నన్ను ( 18 వ ఏటనుండి) కేవలం బాధల్ని భరించడానికే పుట్టించినట్లున్నాడు... అయినా చెదరని చిరునవ్వుతో జీవితపు challenges ని నా భర్త సహకారంతో ఎదుర్కొంటూ.....నలుగురికీ నా సంగీత విద్యనే పంచి.... బాధలని..... భావోద్వేగాలనీ నాతోనే తీసికెళ్ళిపోయాను సెప్టెంబరు 2019 లో ... అంత వరకూ, "మేమే బాధలు పడిపోతున్నాం అనుకునే ఎవ్వరైనా నా నుండి ఎంతైనా నేర్చుకోవాలి" అనే విధంగానే బతికాను. .... అందరికీ ఆనందం పంచి, అందులోంచి నా ఆనందాన్ని వెతుక్కున్నా.
మీ అందరికీ " పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" పాట తెలుసుగా. అందులో పూర్ణమ్మలా అడుగుతున్నా " మీ అందరూ కలసి నప్పుడు ఒకసారి ఈ ఉమపిన్నిని తలచుకోండి"......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి