అమ్మో
తప్పు చేస్తే అమ్మ
చంపేస్తుంది అని మేము,
భాను ( అక్కయ్య/పిన్ని/ అమ్మమ్మ/
అత్తయ్య) కోప్పడుతుందని బంధువులు
అందరికీ తన ముందు,
కానీ వెనక కానీ
తప్పు చెయ్యాలన్నా, అబద్ధం చెప్పాలన్న
భయం. ఎందుకంటే
ఒప్పుకోదు. తప్పు చెయ్యనివ్వదు,
ఛస్తే తప్పు చేయదు. “That is Bhanumathi.”
మమ్మల్ని చాలా చాలా
క్రమశిక్షణతో, అవసరమయితే శిక్షతో
సరి చేసింది. లెఖల్లో దిట్ట.
చదువులో విపరీతమయిన చురుకు.
తను స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్
ముందు రోజు గాజులు పెట్టిన్చుకుంది, రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నేను
పుట్టేనట. ఊరంతటికీ ఫస్ట్
వచ్చింది. స్కూల్ పీపుల్
లీడర్. జీవితం పట్ల విపరీతమయిన
ఆశక్తి, అన్నీ తెలుసు కోవాలనే
జిజ్ఞాస. మల్టీ టాలెంటెడ్ పర్సన్.
వీణ వాయించేది, బాగా
చదువుకునేది, రచనలు చేసేది.
మా అత్తగారి శిష్యురాలు వీణలో.
వాళ్ళిద్దరి అనుబంధం ఒదినా- మరదల్లకీ, గురు శుష్యులకీ ఆదర్శ
ప్రాయం. క్రితం పగడాల ఉంగరం
చేయించేరు గురువుగారికి. ముఖ్యంగా
నా మొదటి వీణ గురువు మా అమ్మ. గురువుగారంటే
ఎన లేని అభిమానం. చిన్నప్పుడు గురు
దక్షిణ సమంగా ఇచ్చేమో
లేదోనని 10 సంవత్సరాల
అన్తేన్డుకండీ! మా అమ్మ నాన్నగారు వాళ్ళ గురువులకు
(అయ్యగారి సోమేశ్వర రావు గారు, అయ్యగారి జయకుమారి గార్లకు)
నన్ను గురుదక్షిణగా సమర్పించి...” నన్ను వాళ్ళతో సవ్యంగా
నడచుకుని, చక్కగా వ్యవహరించి, కుటుంబాన్ని చక్కగా చూసుకుని మంచి
పేరు తెచ్చుకోమని ఆదేశించారు.”. నేను అలాగే
నడచుకున్నాను, నడచుకుంటున్నాను, నడచుకుంటాను.
నేను
గర్వ పడే విషయం ఏమంటే మా నాన్నగారు
“ నాకు జన్మ అంటూ మళ్ళీ ఉంటే జయలక్ష్మే నాకు
మళ్ళీ కూతురుగా పుట్టాలి” అన్నారు. మా అమ్మ “ పిల్లలంటే ఎవరికైనా అభిమానం
ఉంటుంది, కానీ జయలక్ష్మి అంటే
మాకు గౌరవంతో కూడిన
అభిమానం.” అని చెప్పారు. అభిమానం నా హక్కు,
గౌరవం నేను
సంపాయిన్చుకున్నది. నా జన్మ ధన్యం.
కాకపోతే
చివర్లో పులిలాంటి మా అమ్మ
పిల్లిలా అయిపోయి, కొన్ని మర్చిపోయి,
యోగినిలా నవ్వుతూ చూస్తూ ఉండి పోయింది
మాట్లాడకుండా....... అటు వంటి
స్థితిలో కూడా చదువుకి
సంబందిన్చనవి మటుకూ ఫుల్ పర్ఫెక్ట్. లేక్ఖలు ఎంత క్లిష్టమైనవైన క్షణాల్లో
చెప్పేది, ఇంగ్లీష్ లో అమ్మ సైట్ అర్ధం ఏమిటి అంటే ....సైట్ మూడు రకాలవి...అని.. Sight, site, cite అని చెప్పింది, పద్యాలు
చెప్పింది, అలానే ప్రైజ్ అంటే..రెండున్నాయి praise, prize..అని మొదటిది మనం చేసిన ప్రయత్నానికి ఎదురు వాళ్ళు ఇచ్చేది, రెండోది మనం హక్కుగా సంపాయించు కునేదట. బాగుందా?
అలానే Pedestrians, Trespassers లాంటి క్లిష్టమైన పదాలకి అర్ధాలు చెప్పేరు, పోయే ముందు మూడు నెలల ముందు ఇదంతా... తెలుగు పద్యాలు ఎన్నో చెప్పి
రాసుకోమంది, కానీ అజ్ఞానం వల్ల రాసుకోవచ్చులే అనుకున్నా, ఫలితం అర్ధంయ్యిందనుక్కుంట..
పాపం మా అమ్మ మొదటి నుండి ధైర్యంగా
పరిస్థితులతో పోరాడింది, చివరికి మృత్యువుతో కూడా
పోరాడి .అలసి
సొలసి ఓడిపోయింది తప్పని
పరిస్థితులలో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి