28, ఏప్రిల్ 2015, మంగళవారం

నాన్నగారు.......

.
నాన్నగారు అనగానే... జీడిపప్పు, సీతాఫలాలు, ఎండాకాలంలో కిటికీలకి తడి పరదాలు కట్టి, వాటికి వట్టివేళ్ళ తడకలు కట్టి...పళ్ళాల్లో నీళ్ళు పోసి, పైనుండి ఫ్యాన్ వేసి, మమ్మల్నదరినీ చుట్టూ పడుక్కోబెట్టి ఎండా కాలం ఏసీ కింద పడుక్కున్న ఎఫెక్ట్ తెప్పించడం, రాత్రి పూట చక్కగా వీణ వాయించి నిద్ర పోగాట్టడం. ( తనకిష్టమయిన జనని నినువిన రీతిగౌళ, కేదారగౌళ లో కృతులు, శహన లో కృతులు, ఇంకా ఎన్నెన్నో). నా చేత రన్ & మార్టిన్ గ్రామర్ బుక్ BA Bed., ఇంగ్లీష్ & సోషల్ టీచర్గా వర్క్ చేసేరు చాలా కాలం), వాళ్ళ స్కూల్ గ్రంధాలయం నుండి మంచి మంచి బొమ్మలతో ఉన్న సింద్బాద్ కధలు, అరేబియన్ నైట్స్ తెచ్చి చదివి వినిపించడం.... డాక్టర్ గారి అమ్మాయిలతో కలపి సంగీతం వోకల్ నేర్చుకోడం ఎన్ని జ్ఞాపకాలో.
పొద్దున్న వాతావరణ సూచన రేడియోలో విని మా అమ్మగారు గాలిలో తేమను బట్టి వాన పడుతుందో లేదో చెబుతారు. మా నాన్నగారి అమితమైన ప్రేమ వల్ల వాన మొదలవ్వక పోయినా సరే ముందు జాగ్రత్త చర్యగా మాకు రైన్ కోట్స్ వేస్తారు. రైన్ కోట్స్ వేసుకుని చిక్కడపల్లి తోట దగ్గర మా ఇంటి నుండి ,మాడపాటి స్కూల్ దాక రోడ్ మీద వ్యోమగాముల్లాగా నేను మా చెల్లి ఇద్దరమే వింతగా వెళ్ళడం. వద్దంటే కోప్పడతారు, మాకేమో అవమానం. ఏంచేస్తాం కొన్ని సార్లు మాట వినక తప్పదుగా.
పాపం జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్టూ కూడా మమ్మల్ని మా అమ్మ నాన్నగారు ఎంతో ప్రేమగా క్రమశిక్షణతో పెంచేరు. అమ్మ నాన్నగారు మీకు మా నమస్సులు..........మీ ఋణం తీర్చుకోలేం.............

1 కామెంట్‌:

K.Venkataramana చెప్పారు...

తెలుగు వికీపీడియాలో తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రలు చేర్చే భాగంగా "పప్పు సోమేశ్వరరావు" వ్యాసం తయారుచేయబడినది. దానిని విస్తరించుటకు తగు సమాచారం, చిత్రాలు, వంశవృక్షం అంతర్జాలంలో లభ్యమగుటలేదు. దయచేసి వ్యాసాన్ని విస్తరించుటకు తగు సమాచారం అందజేయవ్వలసినదిగా అభ్యర్థిస్తున్నాము. వ్యాసం కోసం ఈ లింకును చూడండి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81_%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81


కె.వెంకటరమణ, వికీపీడియా నిర్వాహకులు
విద్యుల్లేఖ:kvr.lohith@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి