అది 1974 . రాత్రి 10 గంటలు. చిమ్మ చీకటి.
నేనూ మా వారూ, మా అబ్బాయి బుజ్జి "ఆదిత్యా" ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాము. అసలయిన కధ ఇక్కడ మొదలవుతోంది.
జాగ్రత్తగా భయపడకుండా చదవండి. ఏమీ భయంలేదు, సరేనా? ఇక ముందుకెళ్దాము…………….
విజయవాడ లో మా ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్. మేడ మీద ఇల్లు మాది. కింద రెండు , పైన రెండు ఇళ్ళు. పైకి వెళ్ళడానికి మధ్య నుండీ మెట్లు. మెట్ల గదికి కింద చక్కటి తలుపు.
అన్నట్లు ఇక్కడ ఒక విషయంచెప్పలి:- మా మేడ మీద ఎదురు పోర్షను వాళ్ళింట్లోకి, కింద మెట్ల తాలూకు కామను బల్బు కనక్షను ఉంది. పైన ఉన్న కనక్షను మాకు. దాని వల్ల మా ఎదురు ఇంటి ఆయన మెట్ల మీద బల్బ్ పెట్టనిచ్చే వారు కాదు. బిల్లు వాళ్ళు కట్టాల్సి వస్తుందని. మేము సొంతం గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలీని అమాయకత. దాంతో మెట్ల తలుపు వేసెయ్యంగానే చిమ్మ చీకటి.
ఎప్పటి లాగానే కింద తలుపు గొళ్ళెం పెట్టి పైకి ఎక్కుతున్నాము, సగం మెట్లు ఎక్కగానే నా కాలు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. నేను భయంతో దొంగా. దొంగా……..అని గట్టిగా కేకలు మొదలెట్టేను ఆ దొంగ నా రెండు కాళ్ళూ ఇంకా గట్టిగా పట్టు కున్నాడు.
నా అరుపుకి మా వారు కూడా చాలా………భయ పడి పోతూ ఏమయ్యిందని అరుస్తున్నారు. దొంగ నా కాళ్ళు వదడంలేదు. నేను భయంతో కాళ్ళు విదిలించుకుంటున్నాను.
ఇంతలొ ఈ హడావిడికి మా అత్తగారు ఖంగారు పడిపోతూ, తలుపు తీసేరు……………
దొంగ దొరికేడు.
దొంగ ముద్దుగా, బిత్తర చూపులతో, చిన్నిచిన్ని అరచేతుల తో , చిట్టి చిట్టి పాదాల తో, "అమ్మానన్నంటావా…………..దొంగననీ అంటావా? '' అని ప్రశ్నిస్తూ నుంచుని ఉన్నాడు.
అర్ధమయ్యిందనుక్కుంటాను. దొంగ ఎవరో.
ఎవరో కాదండీ మా అబ్బాయి "బుజ్జి ఆదిత్యే" ఆ ఇంటి దొంగ.
ఆదిత్య మొదటిసారిగా మమ్మల్ని అమ్మా నాన్నగారూ అని పిలిచి ఎనలేని ఆనందం కల్గ చేసాడు.అన్ని ఏళ్ళ క్రితం విషయాలూ కబుర్లూ నిన్నా మొన్నలా జ్ఞాపకాల మంజూషలో పదిలంగా పచ్చగా వున్నాయి.
వస పిట్టలా తను చెప్పిన కబుర్లు ఎన్నో ఎన్నెన్నో. “ చికల” ఎకల”., ఏంతి బంతి, “ లక్ష్మడికి ఆగాయిత్యం సీతా దేవికి ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు” అంటూ రామాయణ ఘట్టం ఒకటి చెప్పడం నుంచీ రోజు రోజూ వేవేల జ్ఞాపకాలు.
చదువుకుంటున్న రోజుల్లో, నాతో అన్ని విషయాలూ వెనక వెనకే తిరుగుతూ చెప్పుతుంటే నేను కూడా కాలేజీకి వెళ్ళి చదువు కుంటున్న భావనలో వుండేదాన్ని (కాలేజీ గుమ్మం ఎక్కని దాన్ని).
తను MTech కి Calicut వెళిపోతే, నాకు నిత్యం విజ్ఞానం ప్రసాదించే నా స్నేహితుడు వెళ్ళి పోయాడని మనస్సు ఎంత దుఃఖించిందో. కానీ చక్కటి నడవడికతో, అక్కడ చాలా బాగా చదువుకొని, అక్కడ నుండి బెంగళూరులో CAIR లో Sr. Research fellowship తీసుకుని, తరవాత అక్కడే scientist గా appoint అయి
, వివాహం చేసుకుని,ఇక అక్కడ నుండి అమెరికా వెళ్ళి భార్యా, కొడుకుతో కలపి సుఖజీవనం సాగిస్తున్నాడు.
నేను కోరుకున్న విధంగా సత్సాంగత్యంతో,సత్ప్రవర్తనతో, సన్మార్గంలో వెళ్ళే ఆదిత్య నా ప్రాణం. సుఖీభవా ఆదిత్యా.
వీణ, కీబోర్డ్ చాలా బాగా వాయించి, ఇంటి వారసత్వ సంపద అంది పుచ్చుకుని కొనసాగిస్తున్నాడు.
ఈ రోజు మా అబ్బాయి ఆదిత్య పుట్టిన రోజు.
ఆదిత్యా! వంద సంవత్సరాలు నీ భార్యా టీనా, పిల్లవాడు తేజస్ తో , మనవలూ మునిమనవలతో కలపి చల్లగుండు బేటా.
దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య , దిగ్విజయ ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి