బాల్యం మరలా ఒకసారి తిరిగి రావా ప్లీజ్
ఎటు చూసినా ఎంత చక్కటి పచ్చిక బయళ్ళు, గుబుర్లూ, తలలూపుకుంటూ అందమైన పేద్ద చెట్లు, చల్లటి వాతావరణం. ఎటు చూసినా పచ్చదనం, కాలుష్యం లేని చల్లగాలి. ఇళ్ళ మధ్య నుండి తాచు పాములా మెలికలు తిరుగుతూ తెల్లగా సాగి పోతున్న రోడ్.
ఇంత మంచి వాతావరణం మా చిన్నప్పుడు వుంటే, ఎన్ని లక్కపిడతలూ, ఉప్పు ఆటలు, నేల బండా ఆటలూ, కల్పించి కల్పించి కట్టు కధలూ, సినిమా కధలూ ఎన్ని చెప్పుకునేవాళ్ళం.
ఆ ఇరుకు ఇరుకు చిక్కడపల్లీ సందుల్లోనే మేమనుభవించిన ఆనందం తలచుకుంటే ఎంత ఆనందమో.
ఇక్కడి పిల్లలు పాపం.....ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్, టివీలు, వగైరాలే పాపం.
అందుకే "దేముడా ప్లీజ్ వెంఠనే నాకు ఒక్కరోజు నా బాల్యాన్నీ, దానితో పాటూ నా చిన్న నాటి స్నేహితులనూ కూడా ఇవ్వావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" 🙏🙏🙏

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి