2001 మే 15 అర్ధరాత్రి 2.36 నిమిషాలు, JFK Hospital New Jersey. మా పెళ్ళి రోజు, పెళ్ళి ముహుర్తం......
“అరే బాప్రే బాప్! మళ్ళీ మొదలా. నిన్ననేగా పెళ్ళి రోజన్నారు. మళ్ళీ 18 ఏళ్ళ క్రితం పెళ్ళి రోజు తలచుకుంటున్నారు.ఈవిడ ఈ మత్తులోంచి బయట పడదురా నాయనా” అనుక్కుంటున్నారని బెట్.
మరి విషయం వుంది వినండి. 2001 మే 15 రాత్రి ఇలా కునుకు పట్టిందో లేదో, ఒక సుందర దివ్య విగ్రహం ప్రత్యక్షమై నీకు పెళ్ళి రోజు కానుకగా గులాబీల బుట్ట కావాలా/ మల్లెల బుట్ట కావాలా అని అడిగారు! నేను నాకు అందమైన గులాబీల బుట్ట కావాలని కోరేను.
ఇంతలో ఎక్కడో “ఉవ్వా, ఉవ్వా, ఉవ్వా” అని వినిపిస్తోంది, కళ్ళు నులుము కుంటూ టైమ్ చూస్తే 2.36, సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మావారు నాకు మంగళ సూత్రధారణ చేస్తున్న సమయం అనుక్కున్నాను మనస్సులో , ఇంతలో మా అమ్మాయి, అమ్మా మంచం కింద చూడూ అంది.మా అమ్మాయి మంచం కింద పెద్ద గులాబీ రంగు గులాబీల బుట్ట.
పేధ్ధ పేధ్ధ గులాబీలు అందంగా పరచబడి సువాసనలు వెదజల్లుతున్నాయి. బయటకి నెమ్మదిగా బుట్ట జరిపాం నేనూ మా అల్లుడూ. అందులోంచి వున్నట్టుండి కాళ్ళూ చేతులూ కదులుతున్నాయి. బాబోయ్! చాలా భయం వేసింది. ఇంతలో చంద్ర బింబంలాంటి వదనంతో ఒక గులాబీ బాల. ఎఱ్ఱటి పెదవులు, ముద్దుగా వున్న ఒక ముద్దులొలుకే బొమ్మలాంటి “లాస్య”
ఓహో! ఆ దివ్యసుందర విగ్రహం మాకు ఒసగిన ఈ గులాబీ బాల ఎవరంటే......30వత్సరాల మా వైవాహిక జీవితానికి ఒక తీపి గుర్తు.
మా పెళ్ళి రోజు, పెళ్ళి ముహర్తంలో ఆ దేవ దేవుడు ప్రసాదించిన ఆ బుజ్జి పాప మనవరాలుగా మాకు అనంతమైన ఆనందం కలగజేసింది, జేస్తుంది, చేస్తూనే వుంటుంది.
మొన్నీమధ్యే పుట్టిన మా మనవరాలు బాగా చదువుకుంటూ, వీణ వాయిస్తూ మమ్మల్ని చాలా ఆనంద పరుస్తోంది.
అప్పుడే 3 గంటల వీణ అరంగేట్రం, ఇచ్చి ఇప్పుడు మంచి కాలేజీలో చేరబోతోంది..భగవద్గీత 18 అధ్యాయాలూ చూడకుండా చదువుతుంది.
మొదటి మనవలు ఎప్పుడూ అపురూపమే....
చిట్టి “లాస్యమ్మా” భగవంతుడు నీకు అఖండ విద్య, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి, పరిపూర్ణమైన జీవితాన్నివ్వాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ........ అమ్మమ్మ, తాతగారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి