ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం........
చిన్నప్పుడు........ (అమ్మో, నాయనోయ్, బాబోయ్, వామ్మో! మళ్ళీ మొదలెట్టిందిరా చిన్నప్పుడూ అంటూ అనుక్కుంటున్నారు కదా! మనస్సులొ. ఏం చెయ్యనండి 365 x 60 పుటలున్నఈ పుస్తకం నిండా వింతలూ, విడ్డూరాలు, అనుభవాలు, అనుభూతులే, కాబట్టి మీకు తప్పదు వినక, చదవక, చూడక, పొగడక! ఏమంటారు)
సరే చిన్నప్పుడు సినిమాకి రిక్షా లో వెళ్ళాం. మా అమ్మ,నాన్నగారూ, సీట్ మీద కూర్చుంటే, మా తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ ఒళ్ళో కూర్చున్నారు, నేనూ మా చెల్లీ కింద అటూ ఇటూ కూర్చున్నాం, (అన్నట్లు పైన రిక్షా బొమ్మ మీరు చూసి తీరాల్సిందే అంత చిన్న దానిలో మేము ఎంత చిన్నగా ఉంటే కోర్చోగలమో ఊహించండి)
సరే ఆ రిక్షా అతను ఎప్పటికైనా తన రిక్షా లో ఒక పెద్ద వీణా విద్వాంసుడు ఎక్కబోతడా అనే ఆశతో అనుక్కుంట చక్రాలకి గజ్జెలు కట్టేడు. (బహుసా మీరు ఇలాటిది చూసే ఉంటారు, లేదా బయటకి చెప్పక పోయినా ఎక్కే ఉంటారు)
ఆ రోజు నేనూ మా చెల్లీ సిగ్గు, అవమానంతో సతమత మయ్యాం. ఊహించండి ఎందుకో, సరే నేనే చెబుతాను...... చిన్నప్పుడు అన్నిటికీ అవమానమే! గుడ్డ సంచీ పట్టుకుంటే అవమానం, చేతికి వాచ్ లేదని అవమానం, ఎవరైనా మనని పరికించి చూస్తే అవమానం, మనని చూసి నవ్వితే ఇక సరే సరి.
ఇక ఈ పరిస్థితిలో 11 ఏళ్ల వయస్సులో నేనూ మా చెల్లీ అలాంటి రిక్షాలో కింద కూర్చుని, అందరిని ఆకర్షించేలా, అందరూ మనవేపు చూసేలా, గజ్జల గుర్రం లాంటి రిక్షా ఎక్కితే.....
వారేవాః ! నాదీ మా చెల్లిదీ అవమానం ఫేసులు చూసి తీరాల్సిందే...... పాపం వెర్రి నాగన్నలు మా తమ్ముళ్ళు సినిమాకి వెడుతున్నాం అని సంతోషమే వాళ్ళకి . మా పేరెంట్స్కి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తున్నాం అని తృప్తి.
ప్రాక్టికల్ జీవితం మీద అవగాహన లేని ఆ రోజులే వేరు.........

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి