గుర్తుకొచ్చింది ఇప్పుడే!
జీవితం లోని మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకుంటే, ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో కదా. ప్రతీ వారి జీవితంలో కొన్ని చేదు సంఘటనలుఉండొచ్చు . ఆ పుటలను గట్టిగా అంటించేసి, మంచినే తలచుకుంటే ఆనందంగా జీవించగలం.
జీవితం చిన్నది. జ్ఞాపకాలు,అభిరుచులూ, అనుభూతులూ,భావుకత, భావ ప్రకటన లేని జీవితం నిస్సారంగా, నిర్జీవంగా ఉంటుంది.అందువల్లనే నేను నా ఆనందపు అనుభూతులని మీతో పంచుకోవాలని ప్రయత్నిస్తుంటాను.
అనగనగా ఒక హైదరాబాద్ లో చిన్న పిల్లలు నలుగురు కేరం బోర్డ్ కొనిపించుకోవాలనుక్కున్నారు వాళ్ళ నాన్నగారి చేత. కానీ వద్దని వాళ్ళమ్మ అడ్డుకొట్టింది! ఎందుకో తెలుసా? ఉన్న చిన్న మూడు గదుల్లో ఒక గదిలో వాళ్ళు నలుగురూ కేరం బోర్డ్ వేసుకుని కూర్చుని, పెద్ద పెద్ద చప్పుళ్ళతో,నవ్వులతో మొదలెట్టి చివరికి కొట్టుకుంటూ, వాదులాడుకుంటూ నానా భీభత్సం సృష్టిస్తారని భావించి వద్దన్నారు బహుశా .
కానీ ఆ నలుగురూ ఉద్దండ పిండాలు , వాళ్ళ నాన్నగారు బయటి నుండి వచ్చేసరికి ఆయన హృదయం కరిగి పోయేలా..... చక్కగా నేల మీద కేరం బోర్డ్ బొమ్మ గీసుకుని బాటిల్ డంకాలతో కేరం బోర్డ్ ఆడేస్తున్నారు. ఆ తండ్రి హృదయం కరిగి నీరై వెన్వెంటనే కేరం బోర్డ్ కొనుక్కోచ్చేసారు. కధ సుఖాంతం.
కధ కంచికీ మనమింటికీ!
ఇంతకీ ఆ నలుగురులో ఏ ఒక్కరి పేరైనా చెప్పగలరా? తెలిసీ చెప్పక పొతే మళ్ళీ భేతాళుడు చేట్టేక్కేసి దిగనంటాడు జాగ్రత్త.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి