"రాగము" భావ వ్యక్తీకరణ సాధనము అను మాట చూడగానే మనకు నిజం అనిపిస్తుంది కదా.
మానవుడు ముందుగా బుద్ది తెలిసిన తరువాత, ప్రకృతిని చూసి తనివి తీరా పాడుకుని, నృత్యము చేసి కొని ఉంటాడు.. తన భావములను పాటలోనే వ్యక్తము చేసికొని ఉంది ఉంటాడు తప్పక..
అనంత మయిన రాగములు నవరసముల లో ఏదో ఒక రసమును కలిగి ఉంటాయి. ఒక్కక్క భావాన్నీ వ్యక్తీకరించడానికి దానికి సరి అయిన రాగాన్ని ఎంచుకోవాలి. అలా చేస్తేనే మన భావాన్ని సంపూర్ణం గా తెలియ జేయగలము.
ఉదా:- రౌద్రమునకు "అటాణా"
విచారానికి "ముఖారి" ,"జిన్గ్లా".
త్యాగరాజు మొదలగు వాగ్గేయ కారులు, భావానుగుణ్యమయిన రాగములలో రచించడం వల్లనే రచనలన్నీ రంజకముగా ఉండి, బాగా వాడుకలోకి వచ్చాయి .
ఉదా:- త్యాగరాజ స్వామి, శ్రీరాముని చూసిన ఆనందములో బిలహరి లో "కనుగొంటినీ శ్రీరాముని" అను కృతి వ్రాయడం చాల సందర్భోచితం గా ఉంది. కారణం ఆనంద కరమయిన బిలహరి రాగం లో రచించడమే అందుకు కారణం, అలా కాకుండా విచారం వ్యక్తం చేసే ఏ రంజని లోనో, లేక జినగ్ల లోనో రచించి ఉంటె బాగుండేది కాదు.
అందువల్లనే మన వాగ్గేయ కారులందరూ, రాగం యోక్క భావాన్ని తెలిసుకుని,వారి రచనలను భావాను గుణ్యముగా రచించారు.
రాగానికి భావమెట్లు తోడ్పడుతుందో,, భావానికి రాగమట్లు తోడ్పడుతుంది..
3 కామెంట్‌లు:
Chaala bagundi.
Nijame, bhavam tagga raagam leka pote... oohinchalemu. Please meeru yedaina Keeratana / raagam gurinchi vivarinchandi. Mee udaaharanalu baaginyya.
మాటకి భావం ప్రధానం,
అది పాట ఐతే భావానికి తగ్గ రాగం జీవం.
దానికి ఉదాహరణ వేంకటాచల నిలయం (మనసు లోతులని స్ప్రుశించే విధం గా) సింధు భైరవి లో ఉండటం, క్షీర సాగర శయన (సాక్షాత్తు కంటి ముందు ఆ నారాయణుడిని ఆవిష్కరించే)దేవ గాంధారి లొ పాడటం లాంటివి
కామెంట్‌ను పోస్ట్ చేయండి