ఆహా యూరప్ 12
June 20 th
ఆరోజు ఉదయం మాకు breakfast దగ్గర పరేష్ కనపడి, “ఈ రోజు మనం 8.30 కే బయలుదేరాలి, ఎందు వలన అంటే 10.15 కి మనం వేటికన్ గేట్ లో ప్రవేశించడానికి Appointment దొరికింది, తొందరగా వెళ్ళాలి, appointment లేకపోతే general క్యూ చాలాఎక్కువగా వుంటుందని” చెప్పేరు. ఈ రోజు మేము చూడవలసిన ప్రదేశాలు Vatican Museum, the Sistine Chapel and St. Peter’s Basilica,gigantic colosseum, Trevi fountain.
హిందువులందరూ తిరుపతి ఒక్కసారైనా దర్శించుకోవాలని ఎలా అనుక్కుంటారో, క్రైస్తవులందరూ జీవితంలో వేటికన్ దర్శించుకోడం ఒక కలలా భావిస్తారు.
యూరోపు నాగరికత అంతా గ్రీక్, రోమన్ చరిత్రలతో ముడిపడి ఉన్నది. క్రైస్తవమతం విస్తరణ రోమన్ చక్రవర్తుల మూలంగా జరిగింది. ప్రాచీన కట్టడాలు, శిల్పాలు, చిత్రాలకు ఆ ప్రాంతం ఒక నిధి.
Vatican city రోమ్ నగరంలోని భాగమైనా, దానిని ఒక state గా ప్రకటించారు. వాటికన్ ప్రపంచంలో అతి చిన్న స్టేట్, చుట్టూ రోమ్, ఇటలీ వుంటాయి. వాటికన్ Roman Catholic church కు head quarters. Pope ఇక్కడే నివసిస్తారు. అద్భుతమైన శిల్ప సంపద, paintings నిక్షిప్తమై వున్నవి ఇక్కడ. మానవులందరూ ఒకసారి కులమతాలకు అతీతంగా దర్శించ వలసిన పరమ పవిత్ర స్థలం ఇది.
కొన్ని భావాలు ప్రకటించడానికి ఒక్కోసారి మనం భాషను వెతుక్కోవల్సి వస్తుంది. భాషాతీత భావం, వర్ణనాతీత దృశ్యం. కొన్ని photo లు పోస్ట్ చేస్తాను. వాటికన్ చూడ్డానికి 3 గంటల సమయం సరిపోలేదు.ఇది అంతా ఒక గైడ్ ఆధ్వర్యంలో జరిగింది, అతను మాకు ఆ రోజంతా మాతోనే వున్నాడు. చాలా చక్కగా చెప్పేడు.
పరేష్ పని మమ్మల్నందరినీ తోల్కపోడమే, పెద్దగా నచ్చలేదు, చాలా soft గా వున్నాడు. అయినా ఆ ఒక్కరోజేగా ఫర్వాలేదు సర్దుకోవచ్చు. ఇబ్బంది లేదు. అన్నట్లు క్రిస్ లేడు కదా, సామాన్లు మొయ్యడం కూడా లేదని,చిన్న బస్సు ఏర్పాటు చేసారు SOTC వాళ్ళు.
అక్కడ నుండీ లంచ్ చేసుకుని కొలోజియమ్ దగ్గర బస్ దిగి బయటనుండీ చూసాం. లోపలికి వెళితే చాలా సమయం పడుతుందని, appointment తీసుకోవాలని చెప్పేరు, దాంతో బయట నుండి చూసుకొని వచ్చేసాం.
కొలోజియమ్ అంటే బాగా సంపన్నులైన రోమన్స్ చనిపోయిన వారికి గౌరవార్ధం అక్కడ colosseum fights చేయించేవారట. జంతువులతో గుంపుగా పోట్లాడించి, కృూరమైనవేటతో వినోదించేవారట. ఒక సాధువు ప్రబోధం వల్ల ఈ కిరాతక చర్య 404 A.D తో నిలిపి వేసారు.
అలాగే Gladiatorial games, రోమన్ దేవతలను సంతుష్టలను చేయడానికి జరిపేవారు, తద్వరా ఆ దేవతలు రోమ్ ని అన్ని విధాలా కాపాడుతారని ప్రజల నమ్మకం.
Collosseum నేటికి కూడా మన తాజమహల్ సరసన seven wonders లో ఒకటిగా పరిగణించ బడుతోంది.sistine chappel లో వున్న paintings sculpture ఎప్పటికీ ఎల్లప్పటికీ. క్లాసిక్స్గా పరిగణించబడతాయి.సీలింగుకు Michelangelo paint చేయడానికి చూపిన ఏకాగ్రత వల్ల అతనికి కంటి చూపు మందగించింది. అతని ఆత్మ కధను “ The Agony and Ecstasy” by Irving Stone made into a grand movie.. అలాగే Roman emperor నీరో చక్రవర్తి రోమ్ కాలిపోతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడని నానుడి. Nero was a symbol callous insensitivity. ఈ రోజుకు కూడా అటువంటి వారిని నీరోతో పోలుస్తారు,
అక్కడ నుండి Trevi Water fountain కి వెళ్ళాము. దీనితో యూరప్ ట్రిప్ దర్శనా స్ధలాలు పరిసమాప్తి. ఇది 85 అడుగుల ఎత్తు, 65 అడుగుల వెడల్పు వుంటుంది. దానికి ముందు పెద్ద జలాశయం వుంది. దీనిలో మనస్సులో ఏమైనా అనుక్కుని coins వేస్తే, కోరిక సిధ్ధిస్తుందని ప్రజల నమ్మకం.
బోలెడంత దూరం నడిచి వెళ్ళినందుకు, ఆ జలాశయం ముందు కూర్చుందామని మా అరుణా, పద్మా లాక్కుని వెళ్ళేరు. ఎంతలా నీళ్ళతో ఆడుకున్నామో. అలసట అంతా “It’s gone”, “గాయబ్”, “మటుమాయ మైంది”. నెమ్మదిగా బయలు దేరి నడుచుకుంటూ coffee తాగి , బస్ కోసం ఒక పేధ్ధ టనెల్ దాటుకుని వెళ్ళి అక్కడ వున్న మా బస్ ఎక్కి బయలు దేరాం.
ఈ రోజు మేము early dinner. Restaurant కి వెళ్ళే సరికి dinner ready అవ్వడానికి ఇంకా time ఉంది అనే సరికి రోమ్ నగరం చుట్టూ మమ్మల్ని చక్కర్లు కొట్టించారు.
రోమ్ పురాతన నగరం. కట్టడాలన్నీ చాలా శిధిలా వస్థలో నున్నాయి. వాటికి పునరుజ్జీవనానిచ్చి (రూపు మారకుండా) వుంచిన వారి శ్రధ్ధకు నమోవాక్కాలు. మనమైతేనా వాటిని dismantling చేసి అద్భుతమైన కట్టడాలు నూతన విధానంలో నిర్మించి మురిసి ముక్కలవ్వమూ?
ఇరుకు సందులు, వందల ఏళ్ళ నాటి పురాతన కట్టడాలు. ఏదో మన కాలచక్రం వెను తిరిగిందా అని భ్రాంతి కలుగుతుంది. రోమ్ నగర దర్శనం ఒక అద్భుత అవకాశం.
నిజానికి ఈ రోజు నడచినది చాలా ఎక్కువ, కానీ ఆ అద్భుత చారిత్రాత్మక దర్శనీయ స్థలాలు అన్నిటినీ మరిపించాయి
ఇక డిన్నర్ కావించుకుని హోటల్కి 8.30 కల్లా చేరుకుని. కొంచెం సేపు rest తీసుకుని, రేపు మాతృదేశానికి ప్రయాణం అని తలచుకుంటూ నిద్ర లోకి జారుకున్నాం..
సశేషం