skip to main | skip to sidebar

Ayyagari Jayalakshmi

అప్పుడప్పుడు నాకు తోచింది వ్రాస్తే, నా అభిమానులందరికీ అందుబాటులో ఉండడానికి ఇలా ఈ బ్లాగు లో పోస్ట్ చేద్దామని.. తెలుగు లో ఇలా వ్రాయగలగడం ఎంత బావుందో!

30, జూన్ 2018, శనివారం

ఆహా యూరప్ 5
June 13 th

అబ్బా ఈ వెధవ అలారంకు కొట్టడమే పని! ఛంపేస్తోంది.....

బాబోయ్ లేవాలిగా, లేకపోతే అందరికన్నా వెనక పడిపోతాం. (లేవగానే ఇదివరకయితే అర చేతులు చూసుకుంటూ, ఏదో మంత్రం వల్లించుకునే వాళ్ళం, మరి ఇప్పుడు కూడా అర చేయి చూసుకుంటూనే వుంటాం......... తెలుసుగా ఏమిటో అది.)ఉన్నట్లుండి కర్తవ్యం గుర్తుకు వచ్చి పనులన్నీ పూర్తి చేసుకుని తయారయి, యధావిధిగా నిన్నటిలానే షరా మామూలు.

9 గంటలకు బయలు దేరింది. ఈ రోజు బస్సు......Brussels, Belgium and Amsterdam, The Netherlands కు ప్రయాణం.

బ్రసెల్స్ బెల్జియం రాజధాని. Brussels లో chocolates, fries, waffles, lace works చాలా special ట. వారి official language french.

మేము ఉన్న Paris నుండి బ్రసెల్స్ కి 4.30 గంటల దూరం. బ్రసెల్స్ వెళ్ళే లోగా 2 చోట్ల ఆపారు.

ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. యూరప్ లో చాలా చోట్ల restrooms pay & use. కొన్ని చోట్ల 50/70 cents తీసుకున్నారు. Petrol bunks లో, మరి కొన్ని malls లో free restrooms.

ఇంతే కాదు యూరప్ లోనీళ్ళు ఎక్కడ పట్టుకున్నా మంచివే అని టూర్ మేనేజర్ చెప్పడంతో మేము తీసుకెళ్ళిన ఖాళీ సీసాల్లో హాయిగా నీళ్ళు పట్టుకుని తాగాం, మేము నిక్షేపంగానే వున్నాం వచ్చాక గూడా.ఈ విధంగా కొంత కూడికగా వ్యవహరించాం.

బ్రసెల్స్ వచ్చే ముందు ఒక petrol bunk బయట చల్ల గాలిలో కేరింతలు కొట్టుకుంటూ packed lunch తిన్నాము. బస్ లో 4.30 గంటలూ సందడే సందడి.

ఇక Brussels కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నాం. అక్కడ మేము ముందుగా beautiful grand place and historic town hall చూసుకుని, అక్కడ నుండి adorable ‘Manneken Pis’ statue of a little boy, ( బుజ్జిగాడు ఒకడు urine pass చేస్తున్న విగ్రహం) చూసాం.

వాటి చరిత్రలడక్కండి చెప్పింది వినండి, ఎందుకంటే నాకూ అంతంత మాత్రమే తెలుసు కనుక, photos చూసుకోండి హాయిగా.

ఇక అక్కడనుండి బయలు దేరి 2.30 గంటలు ప్రయాణం చేసి ( అలసటతో నిద్రలు అందరూ)
Netherlands లో (ఒకప్పుడది Holland ట తప్పు వుంటే విజ్ఞులు దిద్దండి)Madurodam - Holland in miniature with beautiful models of palaces, canals, windmills దర్శించాం.

Miniature form లో అవన్నీ చూస్తుంటే,మతి పోయింది.అద్భుతమైన బొమ్మల కొలువు. నాకు అలాంటి బొమ్మల కొలువు వుండచ్చుగా అని అసూయ వచ్చింది. బోట్లు, ఎగురుతున్న విమానాలు, రైలు, stations,మనుషులు,భవంతులు, అన్నీ అద్భుత అభూత కల్పన. కానీ నాకు ఎదురుగా చూస్తే అవి బొమ్మలని తెలిసిపోయింది గానీ photo లో చూస్తే నిజంలా వున్నాయి, (కావాలంటే మీరూ చూడండి) దారి పొడుగునా పచ్చదనం. వెళ్ళండీ వెళ్ళి చూసి రండీ!

అక్కడ నుండీ గంటన్నర ప్రయాణం చేసి Indian restaurant లో dinner చేసుకుని Fletcher Hotel లో బస. సామాన్లు దింపుకుని ఈడ్చుకుంటూ ( ఒళ్ళునీ, సామాన్లనీ) అన్నట్లు wifi password తెలుసుకొని, room కి వెళ్ళగానే rest.

Rest అంటే అర్ధ మయ్యిందిగా....

Paris లో room చిన్నదిగానీ, ఇక్కడ bathroom paris లో room అంత వుంది. పేధ్ధది. AC లేదనగానే “చచ్చాంరా భగవంతుడా” అనుకున్నాం కానీ చల్లగా వుండి అలసటతో ఒళ్ళు తెలీని నిద్ర, ఏది ఏమైనా priority rest కే, అది మర్చి పోకండి.

మళ్ళీ రేపు కలుద్దాం.
సశేషం



Click here to Reply or Forward

s

వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 8:08 AM

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్

అయ్యగారి జయలక్ష్మి

ఒక పండితుని (పప్పు సోమేశ్వర రావు గారు) ఇంట పుట్టి, ఒక పండితుని ఇంటిని (అయ్యగారి సోమేశ్వరరావు గారు) మెట్టి, ఒక పండితుని (అయ్యగారి శ్యామసుందరం గారిని) చేపట్టే మహత్ భాగ్యం తో బాటూ....అంతో, ఇంతో సరస్వతీ కటాక్షం లభ్య మవ్వడం పూర్వ జన్మ సుకృతంగా, భగవత్ ప్రసాదం గా భావిస్తున్నా. నా కుటుంబ సభ్యులందరికీ ఆ వాగ్దేవి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని ఆశ, ఆకాంక్ష.

పాత రాతలు

  • ►  2024 (1)
    • ►  మే (1)
  • ►  2023 (7)
    • ►  సెప్టెంబర్ (1)
    • ►  ఆగస్టు (3)
    • ►  జూన్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2022 (4)
    • ►  అక్టోబర్ (2)
    • ►  మే (1)
    • ►  జనవరి (1)
  • ►  2021 (1)
    • ►  నవంబర్ (1)
  • ►  2020 (37)
    • ►  నవంబర్ (6)
    • ►  అక్టోబర్ (5)
    • ►  ఆగస్టు (17)
    • ►  మే (9)
  • ►  2019 (32)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (5)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (1)
    • ►  జూన్ (6)
    • ►  ఏప్రిల్ (2)
    • ►  జనవరి (15)
  • ▼  2018 (13)
    • ►  డిసెంబర్ (1)
    • ►  జులై (7)
    • ▼  జూన్ (5)
      • ఆహా యూరప్ 6 June 14 th అబ్బా ఇంకెత సేపు తెల్లారడ...
      • ఆహా యూరప్ 3  జూన్ 10 రాత్రి 11 గంటలకి బయలుదేరి అం...
      • ఆహా యూరప్ 2
      • ఆహా యూరప్ 1
  • ►  2017 (4)
    • ►  మార్చి (4)
  • ►  2016 (18)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (1)
    • ►  మే (3)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  మార్చి (3)
    • ►  జనవరి (5)
  • ►  2015 (20)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (1)
    • ►  మే (12)
    • ►  ఏప్రిల్ (6)
  • ►  2014 (1)
    • ►  మే (1)
  • ►  2011 (4)
    • ►  జనవరి (4)
  • ►  2009 (9)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (1)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (6)