విజ్ఞాన ఖని.......
అదొక అందమైన పూదోట . అందు అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన పొదరిల్లు. ఆ ఇంట సంగీతం, సారస్వతం, విజ్ఞానం కలబోసుకుని చిరునవ్వుతో మనని ఎంతో ఆప్యాయంగా స్వాగతిస్తాయి. అంతెందు కండీ ఆ నట్టింట లక్ష్మీ సరస్వతులు నాట్య మాడుతూ ఉంటాయి.
ఆప్యాయతకి మారు పేరైన " మా అత్తగారి" ప్రతి రూపం మా వారి చిట్టి చెల్లెలు శ్రీమతి బండి శ్రీలక్ష్మి గారు. ఎంతో్ ప్రేమాస్పదురాలు. అడుగడుగునా ఎదుటి వారికి ఏమి కావాలి? ఏమి ఇష్టం అనే తపనే ఆవిడకి. మమ్మల్ని తల్లిలా చూసుకున్నారు విశాఖపట్నం వెళ్ళిన రెండు రోజులూ .
ఇక మా అన్నయ్య గారు డాక్టర్ శ్రీ బి.ల్ .నరసయ్య గారు . వారొక కదిలే విజ్ఞాన గ్రంధాలయం . ఏ విషయన్ని గూర్చైనా అనర్గళంగా విపులీకరించగలరు. ఆయనతో గడిపే ప్రతీ క్షణం అంతో ఇంతో విజ్ఞానం సంపాయించుకోకుండా బయట పడం.
నాకు స్ఫూర్తి ప్రదాయిని,ధైర్యం ఇచ్చి వెన్ను తట్టి నన్ను నడిపే సద్గురువు శ్రీమతి మాధవపెద్ది సుబ్బలక్ష్మి మూర్తి గారు.....
నా సర్వస్వం,సంగీతంలో నేను మీటే ప్రతీ మీటు, జీవితంలో నా ప్రతీ అడుగుకీ మార్గదర్శకులు నా గురువు, భర్త అయిన శ్రీ శ్యామసుందర్ గారైతే........
నాకు జ్ఞానాన్ని ప్రసాదించే గురువు శ్రీ నరసయ్య గారు......
వీరందరూ నాకు తల్లీ తండ్రీ గురువు దైవంతో సమానమ్. ఇంతకంటే వ్యక్తీకరించడానికి నా భావానికి తగ్గ భాష లేదు.
గురువులకు నా నమో వాక్కాలు.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే విశాఖపట్నం వెళ్లి సింహాచలం, రామనారాయణం,
"అలుపెరుగని అలలు, అంబరాన్ని చుంబించే ప్రయత్నాన్ని" తనివి తీరా చూసి, ఆనన్దించి......
మళ్ళీ కొండంతబలం తో తిరిగి వచ్చామ్......

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి