9, జనవరి 2011, ఆదివారం

సాహిత్యం:- వినరాద నా మనవి (దేవగాంధారి లో కోవూరి పంచరత్నం)

పల్లవి..... వినరాద నా మనవి


చరణం  1:- కనకాంగ  కావేటి రంగ పతే
                కాంత కాంత లెల్ల కామించి పిలచితే ...వినరాద  నా మనవి


చరణం ౨:- భాగదేయ వైభోగ రంగపతే
               త్యాగరాజ నుత తరుణులు పిలచితే.......వినరాద నా మనవి

8, జనవరి 2011, శనివారం

వినరాద నా మనవి (దేవగాంధారి లో కోవూరి పంచరత్నం)

        ఒక సారి త్యాగరాజ స్వామి చైత్రోత్సవము చూడడానికి శ్రీరంగం వెళ్ళి,ఆ సమయం లో బంగారపు రధం  మీద ఊరేగింపుగా వస్తున్న దేముడిని చూచి ఆనంద పారవశ్యం తో "రాజు వెడలె చూతము రారే ' అను కృతి తోడి రాగం లో పాడేరట. 
    పదహారు మంది బోయీలతో ఊరేగుతున్న ఆ రధం త్యాగరాజ స్వామి  ఉన్న ఇంటి ముందుకు వచ్చింది, కుతూహలముతో త్యాగరాజ స్వామి ఆ వైభోగ రంగని దర్శించు కున్దామనుక్కున్నారు    . కానీ ఆ జన సమూహం లో దర్శించుకునే అవకాశం దొరకక, నిరుత్సాహ  పడి అక్కడే నిల్చుండి  పోయి చూస్తున్నారట. ఇంతలో ముందుకు సాగిన రధం కదల కుండా ఉంది పోయిందట, బోయీల కాళ్ళు బరువులేక్కి   ఒక్క అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి, ద్రుష్టి దోషం తగిలిందని భావించి తరుణోపాయలు వెతుకుతున్నారట.ఇంతలో దేవాలయం అర్చకులలో ఒకరు దేవప్రేరితులై త్యాగరాజ స్వామిని చూపి" ఆ మహా భక్తుని రధం వద్దకు తీసుకు రమ్మని" చెప్పినారట. అంతట త్యాగరాజ స్వామి సంభ్రమ ఆశ్చర్యాలతో దేవుని రధం వద్దకు పోయి ప్రఖ్యాత కృతి "వినరాద నా మనవి" అను కృతి ఆలపించారట.


అనుపల్లవి లో "కాంత కాంత లెల్ల కామించి పిలచితే" అనినారు, అంటే  దేవ దాసీలు నృత్యము చేసి పిలచితే పొరాదా అని రంగానాధుని  ప్రస్నించినారు. ఈ కృతి పాడుట పూర్తి చేసి దీపారాధన పూర్తి అయ్యేసరికి, ఆశ్చర్య దాయకముగా రధము కదలినదట.


తరువాత ఒక రోజు త్యాగరాజ స్వామి దేవాలయమునకు ఆహ్వానింప బడ్డారట. ఆ రోజు మూల విరాట్టు అద్భుతం గా అలంకరింప బడి ఉన్నదట .భగవంతుని జూచి భక్తి తో  ఈశ్వర ప్రేరితులై "ఓ రంగశాయి " అను కాంభోజి కృతి రచించినారట. 


 చిరంజీవి సౌభాగ్యవతి  కల్యాణి  కోరిక మేరకు ఈ కృతి ఏ సందర్భం లో త్యాగరాజ స్వామి రచించారనేది నాకు తెలిసిన విధం గా రాస్తున్నాను. 

7, జనవరి 2011, శుక్రవారం

"రాగము" భావ వ్యక్తీకరణ సాధనము

"రాగము" భావ వ్యక్తీకరణ సాధనము అను మాట చూడగానే మనకు నిజం అనిపిస్తుంది కదా.
 మానవుడు ముందుగా బుద్ది తెలిసిన తరువాత, ప్రకృతిని చూసి తనివి తీరా పాడుకుని, నృత్యము చేసి కొని ఉంటాడు.. తన భావములను పాటలోనే వ్యక్తము చేసికొని ఉంది ఉంటాడు తప్పక..


   అనంత మయిన రాగములు నవరసముల లో ఏదో ఒక రసమును   కలిగి ఉంటాయి. ఒక్కక్క భావాన్నీ వ్యక్తీకరించడానికి దానికి సరి  అయిన  రాగాన్ని ఎంచుకోవాలి. అలా చేస్తేనే మన భావాన్ని సంపూర్ణం గా తెలియ జేయగలము. 
ఉదా:- రౌద్రమునకు "అటాణా" 
విచారానికి  "ముఖారి" ,"జిన్గ్లా".


త్యాగరాజు మొదలగు వాగ్గేయ కారులు,  భావానుగుణ్యమయిన   రాగములలో రచించడం వల్లనే  రచనలన్నీ  రంజకముగా ఉండి, బాగా వాడుకలోకి వచ్చాయి .


ఉదా:- త్యాగరాజ స్వామి,  శ్రీరాముని చూసిన ఆనందములో బిలహరి లో "కనుగొంటినీ శ్రీరాముని" అను కృతి వ్రాయడం  చాల సందర్భోచితం గా ఉంది. కారణం ఆనంద కరమయిన  బిలహరి రాగం  లో రచించడమే అందుకు కారణం, అలా కాకుండా విచారం వ్యక్తం చేసే ఏ రంజని లోనో, లేక జినగ్ల లోనో రచించి ఉంటె బాగుండేది కాదు.


అందువల్లనే మన వాగ్గేయ కారులందరూ, రాగం యోక్క భావాన్ని తెలిసుకుని,వారి రచనలను భావాను  గుణ్యముగా రచించారు.


రాగానికి   భావమెట్లు  తోడ్పడుతుందో,, భావానికి రాగమట్లు తోడ్పడుతుంది..




  

6, జనవరి 2011, గురువారం

కౌముది

విశ్రాంతి  దొరికింది.  ఏమిచేద్దామబ్బా..............? 


కొంచెం సేపు హాయిగా నిద్ర పోతే?

కాదు కాదు టివి న్యూస్  చానల్స్  చూసుకుంటే ?
( అవే కదా మా entertainment చానల్స్, పంది పిల్ల గుడి చుట్టూ తిరిగినా, మాకు గొప్ప  న్యూస్ కదా  మరి.  ఇందులో ఇందులో బాగా  అరచుకుంటూ సంభాషించే రాజకీయ నాయకుల చర్చలూ,   అక్కడా  ఇక్కడా హత్యలూ దొంగతనాలూ జరిగాయనే వార్తలూ,  ఒకటేమిటి మాకు నిత్యం విపరీతమయిన సందడీ, సరదా.  చివరికి ఎలా తయరయ్యమంటే ఏమీ క్రయిం  లేక పోతే ఆ రోజు ఏమీ తోచనంత )

అబ్బో టైం వేస్ట్. చక్కగా వీణ వాయించుకుంటే?

 కొంచెం సేపు మెయిల్స్ చూసుకుని... వెంటనే అయిదు నిమిషాల్లో వీణ వాయించుకుంటా, నిజం ముమ్మాటికీ నిజం..

ఇక ఇంటర్నెట్ లోకి వెళ్లి  మెయిల్స్ చూసాక , యు ట్యూబ్ లో సంగీతం విని,చూసుకుని, అయ్యో మంచి బుక్ చదువుకుంటే  అనిపించి వెంటనే కౌముది చదువుకుంటుంటే , టైం తెలీడం లేదు. ఇంతలో పని వేళ అయిపొయింది. 


  వీణ వాయిన్చుకోలేదని బాధ గా ఉంది. రేపు తప్పక వాయించుకుంటాను.
 వీణ వాయిన్చుకోలేదని అసంతృప్తి గా ఉన్నా,  కౌముది చదివినందుకు  అంతులేని త్రుప్తి.


 అద్భుతమయిన మాగజైన్ కౌముది.

పుస్తకప్రియులందరూ ఇంటర్నెట్ లో కౌముది తెలుగు మాగజైన్ చదవండి తప్పక. అన్నీ ఆణిముత్యాలే.