skip to main | skip to sidebar

Ayyagari Jayalakshmi

అప్పుడప్పుడు నాకు తోచింది వ్రాస్తే, నా అభిమానులందరికీ అందుబాటులో ఉండడానికి ఇలా ఈ బ్లాగు లో పోస్ట్ చేద్దామని.. తెలుగు లో ఇలా వ్రాయగలగడం ఎంత బావుందో!

30, జూన్ 2018, శనివారం

ఆహా యూరప్ 6
June 14 th

అబ్బా ఇంకెత సేపు తెల్లారడానికి?
అయ్యో అదేమిటి అర్ధ రాత్రి ఒంటి  గంట కూడా వాచ్ లో చూసానే, 6  అయ్యింది అప్పుడే,
 పనులు తెముల్చుకోక పోతే ఎలా? అని పరుగులు, పోటీలూ  మా ఆయనతో . ఇవాళ్టికి రెస్ట్ కి  రెస్టే  ఈ పూట.

షరా మామూలు. break fast, ఫొటోస్, ప్రయాణం మొదలు.
అన్నట్లు ఈ రోజు కూడా పెట్టె బేడా సర్దుకుని, బస్సు ఎక్కి పోయాం.

ఇవాళ ఎక్కడికబ్బా?  ఏమిటో మరి ఏమి చూపిస్తాడో భూషణ్ ని చెప్పనివ్వండి , అన్నట్లు రోజూ  రాత్రి దిగే ముందు చెప్తాడు కదా, మర్చి పోయాం ఏమి చెప్పేడో. గొడవ చెయ్యకండి "ఉష్ ఉష్ ఉష్" విననీండి. అదిగో మాట్లాడుతున్నాడు.... (మీకు తెలుసా ఇప్పుడు నేను భూషణ్) ...... 

Today  Drive to Amsterdam. Enjoy a leisurely Canal Cruise, the best way to see this captivating City. Later drive to Germany and there we will see magnificent Cologne Cathedral after wards you can walk and shop there.


అక్కడ నుండి 2 గంటలు వెళ్ళేక , canal cruise ,Amsredam . బస్సు ఆపి బోట్ దాకా నడిపించి టికెట్స్ కొనిఛ్చి, నాలాంటి భయపడుతున్న వాళ్లకి చేయూత నిచ్చ్చి బోట్ ఎక్కించాడు భూషణ్ .  బోట్ తాలూకు window గ్లాస్సెస్ లోంచి అద్భుతం గా  సిటీ మొత్త్తం చూసాం. కేరింతలు కొట్టుకుంటూ కొంతమంది, photos  వీడియో లతో కొంతమంది, సీట్ లోనే కూర్చుని మాట్లాడుకుంటూ కొందరు, మాట్లాడ కుండా ప్రకృతి సౌందర్య ఆరాధన చేస్తూ కొందరు. గంట సేపు వేరే లోకం లోకి వెళ్లి పోయాం.

మళ్ళీ చెయ్యి పట్టుకుని బోట్ లోంచి  జాగ్రత్తగా దింపి, భోజనానికి తీసుకెళ్లి మంచి ఇండియన్ భోజనం పెట్టించాడు భూషణ్. , మళ్ళీ బస్సు దాకా నడచుకుని వెళ్లి, "చలో జెర్మనీ"  నినాదం తో బయలుదేరేము.

జర్మనీ ఎంత అందమైన దేశమండీ. నాకు స్విట్జర్లాండ్ తరువాత  చాల నచ్చ్చిన  ప్రదేశం  జర్మనీ.

 ప్రకృతి  ఒడిలో  పసి పాపాల స్వచ్ఛంగా నడయాడుతోంది, నాట్యం చేస్తోంది జర్మనీ.  బహుశా "చెంగావి రంగు చీర " పాట, ఇక్కడే ఇక్కడే ఇక్కడే, చిత్రీకరించారు అని మా వారు అన్నారు. నిజమయ్యి ఉండవచిచ్చు.  విశాలమైన మైదానాలు,  lawns,  అక్కడక్కడా ఆవులు. Land స్కేప్  ఎక్కువగా ఉంది, అక్కడక్కడా ఇళ్ళు. ఎంత అందముగా ఉందొ. అలా ఎవ్వరితో మాట్లాడకుండా కిటికీలోంచి చూస్తూ కూర్చున్నమందరమూ.

ఇంతలో Cologne Cathedral చూద్దాం దిగమన్నారు భూషణ్.  పొలో మంటూ గొడుగులూ, మంచి నీళ్ల సీసాలో పట్టుకుని దిగి నడుచుకుంటూ బయలుదేరేము.

వాన పెరిగి పోయింది. మేము  Cathedral చూసుకుని (బయటకి చూడ్డానికి పాత గా ఉన్నా, లోపల అద్భుతమైన కళా ఖండాలతో ఉంది) photos తీసుకుని, బయటకి వఛ్చి యావ గా ఆ వాన లోనే షాప్ లు తిరిగి, కొంతమంది ఏవో కొనుక్కుని, మొత్త్తనికి వాన తప్పించుకుంటూ బస్సు ఎక్కేము.

మళ్ళీ మామూలే డిన్నర్ ఇండియన్ రెస్టారంట్ లో,
 విశేషం ఈ రోజు కొద్దిగా ముందుగా రూమ్ కి వెళ్లి ,ఇహ చూసుకోండి రెస్టే రెస్ట్.

 చాలా బిజీ గా ఉన్నాను బాబూ ఇంకా నన్ను డిస్టర్బ్ చెయ్యకండి........

                                       సశేషం



వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 9:53 AM కామెంట్‌లు లేవు:
ఆహా యూరప్ 5
June 13 th

అబ్బా ఈ వెధవ అలారంకు కొట్టడమే పని! ఛంపేస్తోంది.....

బాబోయ్ లేవాలిగా, లేకపోతే అందరికన్నా వెనక పడిపోతాం. (లేవగానే ఇదివరకయితే అర చేతులు చూసుకుంటూ, ఏదో మంత్రం వల్లించుకునే వాళ్ళం, మరి ఇప్పుడు కూడా అర చేయి చూసుకుంటూనే వుంటాం......... తెలుసుగా ఏమిటో అది.)ఉన్నట్లుండి కర్తవ్యం గుర్తుకు వచ్చి పనులన్నీ పూర్తి చేసుకుని తయారయి, యధావిధిగా నిన్నటిలానే షరా మామూలు.

9 గంటలకు బయలు దేరింది. ఈ రోజు బస్సు......Brussels, Belgium and Amsterdam, The Netherlands కు ప్రయాణం.

బ్రసెల్స్ బెల్జియం రాజధాని. Brussels లో chocolates, fries, waffles, lace works చాలా special ట. వారి official language french.

మేము ఉన్న Paris నుండి బ్రసెల్స్ కి 4.30 గంటల దూరం. బ్రసెల్స్ వెళ్ళే లోగా 2 చోట్ల ఆపారు.

ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. యూరప్ లో చాలా చోట్ల restrooms pay & use. కొన్ని చోట్ల 50/70 cents తీసుకున్నారు. Petrol bunks లో, మరి కొన్ని malls లో free restrooms.

ఇంతే కాదు యూరప్ లోనీళ్ళు ఎక్కడ పట్టుకున్నా మంచివే అని టూర్ మేనేజర్ చెప్పడంతో మేము తీసుకెళ్ళిన ఖాళీ సీసాల్లో హాయిగా నీళ్ళు పట్టుకుని తాగాం, మేము నిక్షేపంగానే వున్నాం వచ్చాక గూడా.ఈ విధంగా కొంత కూడికగా వ్యవహరించాం.

బ్రసెల్స్ వచ్చే ముందు ఒక petrol bunk బయట చల్ల గాలిలో కేరింతలు కొట్టుకుంటూ packed lunch తిన్నాము. బస్ లో 4.30 గంటలూ సందడే సందడి.

ఇక Brussels కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నాం. అక్కడ మేము ముందుగా beautiful grand place and historic town hall చూసుకుని, అక్కడ నుండి adorable ‘Manneken Pis’ statue of a little boy, ( బుజ్జిగాడు ఒకడు urine pass చేస్తున్న విగ్రహం) చూసాం.

వాటి చరిత్రలడక్కండి చెప్పింది వినండి, ఎందుకంటే నాకూ అంతంత మాత్రమే తెలుసు కనుక, photos చూసుకోండి హాయిగా.

ఇక అక్కడనుండి బయలు దేరి 2.30 గంటలు ప్రయాణం చేసి ( అలసటతో నిద్రలు అందరూ)
Netherlands లో (ఒకప్పుడది Holland ట తప్పు వుంటే విజ్ఞులు దిద్దండి)Madurodam - Holland in miniature with beautiful models of palaces, canals, windmills దర్శించాం.

Miniature form లో అవన్నీ చూస్తుంటే,మతి పోయింది.అద్భుతమైన బొమ్మల కొలువు. నాకు అలాంటి బొమ్మల కొలువు వుండచ్చుగా అని అసూయ వచ్చింది. బోట్లు, ఎగురుతున్న విమానాలు, రైలు, stations,మనుషులు,భవంతులు, అన్నీ అద్భుత అభూత కల్పన. కానీ నాకు ఎదురుగా చూస్తే అవి బొమ్మలని తెలిసిపోయింది గానీ photo లో చూస్తే నిజంలా వున్నాయి, (కావాలంటే మీరూ చూడండి) దారి పొడుగునా పచ్చదనం. వెళ్ళండీ వెళ్ళి చూసి రండీ!

అక్కడ నుండీ గంటన్నర ప్రయాణం చేసి Indian restaurant లో dinner చేసుకుని Fletcher Hotel లో బస. సామాన్లు దింపుకుని ఈడ్చుకుంటూ ( ఒళ్ళునీ, సామాన్లనీ) అన్నట్లు wifi password తెలుసుకొని, room కి వెళ్ళగానే rest.

Rest అంటే అర్ధ మయ్యిందిగా....

Paris లో room చిన్నదిగానీ, ఇక్కడ bathroom paris లో room అంత వుంది. పేధ్ధది. AC లేదనగానే “చచ్చాంరా భగవంతుడా” అనుకున్నాం కానీ చల్లగా వుండి అలసటతో ఒళ్ళు తెలీని నిద్ర, ఏది ఏమైనా priority rest కే, అది మర్చి పోకండి.

మళ్ళీ రేపు కలుద్దాం.
సశేషం



Click here to Reply or Forward

s

వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 8:08 AM కామెంట్‌లు లేవు:

27, జూన్ 2018, బుధవారం

ఆహా యూరప్ 3
 జూన్ 10 రాత్రి 11 గంటలకి బయలుదేరి అందరం ఎవరిళ్ల నుండి వాళ్ళు Airport కి చేరుకున్నాము.
check in  పూర్తి చేసుకుని  గేట్ దగ్గరకి చేరుకొని అందరం ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నాము.

తెల్లవారు ఝామున 4.35  బయలు దేరిన  విమానం ఎక్కి, దుబాయ్ చేరుకొని అక్కడ నుండి గేట్ మారి పారిస్ ఫ్లైట్ ఎక్కి 11 జూన్ మధ్యాహ్నం 1.30  కి పారిస్ చేరుకున్నాము. (టైం జోన్ తేడా వల్ల 1.30  అయినా  మన లేఖ్ఖ లో సాయంత్రం 5, యూరప్ మన కంటే 3. 30 గంటలు వెనక ఉంటుంది.)

మేము సామాను తీసుకుని బయటకి వెళ్లేసరికి మా టూర్ మేనేజర్ "భూషణ్"  ప్ల కార్డు  పట్టుకుని మమ్మల్ని స్వాగతించాడు,  అంతే కాదు మా అందరికీ తలో  పేపర్ బాగ్ చేతులో పెట్టేడు.  ఏంటి అది అని చూస్తే " packed lunch"  మేతి పరోటా, రైస్, బొంబాయి శనగల కూర, ఒక స్వీట్, కర్డ్ ఉన్నయందులో, అన్నట్లు మంచి నీళ్ల బాటిల్ కూడా. మేము అది తినే లోగా మా బ్యాచ్ వాళ్ళు ఇద్దరు వేరే ఫ్లైట్ లో చెన్నై నుండి వచ్చ్చేరు.

"చలో యూరప్ టూర్ స్టార్ట్ " బస్సు లో సామాను కింద డిక్కీ  లో డ్రైవర్ పెట్టేసేడు. 16 మంది మీ 40 Seater బస్సు లో దర్జాగా కూర్చుని బయలు దేరేం.

మా టూర్ మేనేజర్ భూషణ్ మైక్ తీసుకుని, ప్రయాణం బాగా సాగిందా అని కుశల ప్రశ్నలు వేసి, మీకు అలసట లేక పోతే ఇప్పుడు 2. 30 అయ్యింది కాబట్టి ఈ రోజు హోటల్ రూమ్ కి అప్పుడే కాకుండా guided city tour, చేసుకుని
ఈఫిల్  Tower చూసుకుందామా?  అన్నారు,సరే మాకేం అలసట లేదన్నాము.

దారిలో మాకు పారిస్ చరిత్ర, జనాభా వివరాలు, క్లుప్తం గా చెప్పేడు . ఈ లోగా  ఒక లేడీ Guide మా బస్సు ఎక్కి ఈఫిల్  టవర్ వచ్ఛేదాకా మాకు కొన్ని ముఖ్యమైన మాన్యుమెంట్స్ చూపించారు.  ( వాటి చరిత్రలడక్కండి నేను చెప్పలేను, చూశానంతే) ఫొటోస్ తీసుకున్నాం దిగి. అవి ఏమంటే....... Place de la concorde, Magestic Arc De Triomphe, Magnificent opera house చూసాము.

ఇక అసలైంది ఈఫిల్ టవర్ చేరుకునేసరికి బాగా మబ్బు పట్టి ఉంది. నిజానికి మేమందరం చిన్న గొడుగులు పట్టుకెళ్ళం, కానీ అన్నీ మా పెట్టెల్లో పెట్టి డిక్కీ లో ఉంచాం, మాకేం తెలుసు అంత హోరున వాన వస్తుందని. బస్సు దిగుతుండగానే సన్న చినుకు మొదలయ్యింది.

నేను దిగను వాన వస్తోంది ,  అంటే మా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు" మేడం! దిగండి, ఇంత రొమాంటిక్ Situation ఒదులుకోకండి పదండి , మర్చి పోయారా? "చిట పట చినుకులు పడుతూ ఉంటె,చెలికాడే సరసన ఉంటే" పాట, గురువుగారు పక్కన ఉండగా వాన లో, ఈఫిల్ టవర్  సందర్శన, పరమ రొమాంటిక్ గా ఉంటుంది. పైన వేడిగా కాఫీ తాగుదాం" అని బాగా inspire చేసి దింపేరు బస్సు.

దిగి నడవడం మొదలవ్వగానే హోరున వర్షం, గొడుగులు పెట్లో , పరుగు పందేలతో  బోలెడంత  దూరం పరుగెట్టి  మొత్త్తనికి ఈఫిల్ టవర్ లెవెల్ 2 కి వెళ్లి చూడ వలసింది, కనిపించిందంతా చూసి, చక్కటి కాఫీ మా డాక్టర్ గారు ఇప్పిస్తే తాగి, ఫోటోలు తీసుకుని వాన లోనే తిరిగి బస్సు చేరుకున్నాము.

మంచి ఇండియన్ రెస్టారెంట్ లో డిన్నర్ చేసుకుని హోటల్  Ibbis   చేరుకొని రాత్రి కి విశ్రాంతి,..... తీసుకున్నాము..

భూషణ్ మాతో పాటే డిన్నర్ చేసి మా హోటల్ లోనే వున్నాడు.

                                                     సశేషం

వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 8:27 AM కామెంట్‌లు లేవు:

26, జూన్ 2018, మంగళవారం

ఆహా యూరప్ 2

ఆహా యూరప్ 2

మేము వెళ్లిన ట్రావెల్స్ SOTC  గూర్చి పదే  పదే  పేరుని ఇక ఉదహరించను, ఎందువలన అంటే?, నన్ను ఎవరైనా ఆ ట్రావెల్స్ కి  commercial promoter అనుకోవచ్ఛు.

ఎంత బాగా తీసుకెళ్లి, మళ్ళీ మమ్మల్ని సురక్షితంగా  దిమ్పెరంఢీ! The best travels.

నేను ఇంతక ముందు చెప్పినట్లు 10 nights 11 days package. Paris, Belgium,Germany,Netherlands,Switzerland,Italy,Venice,Vatican (Rome) 

Madras నుండీ కూడా చక్కగా operate చేసి,ముందు advance 60,000 కట్టించుకుని , ఇక్కడి వాళ్ళ సంస్థతో టై అప్ అయ్యి, వీసా లు ఏర్పాటు చేసి, final payment అవ్వగానే.... Hotels, Tickets vouchers పంపేరు online లో.

టూర్ అంత మనతో ఒక టూర్ మేనేజర్ అనుక్షణం వెంట ఉండి  మనని సురక్షితం గా చూసుకున్నారు.

Stay అద్భుతమైన 3 star హోటల్స్ లో

పారిస్ నుండి మొత్త్తం ట్రిప్ అంత చక్కటి బస్సు చివర రోమ్ airport దాకా..

ప్రతీ రోజూ lunch, Dinner Indian Food. rotee, two curries,Rice,Curd,sweet. కొన్ని చోట్ల సాంబార్ రసం కూడా.

 ఎక్కడా మేము ఇండియన్ ఫుడ్, ఆ ఖారాలూ ఉప్పులూ మిస్ అవ్వలేదు. చివరికి నార్త్ Indian ఆచార్ తో సహా.

ఒక్క ఇటలీ లో మటుకూ ఒక  dinner పాస్తా , పిజ్జా  లతో తిన వలసి వచ్చింది. Italian Pizza famous కదా, అది కూడా రుచి చూడ్డమైంది.

bus 40 seater అయితే అందులో ఆశ్చర్య దాయకంగా మేము 14 మంది తెలుగు వాళ్ళం, 4 తమిళులు, ఉన్నామంతే.  మా కోసం స్పెషల్ ట్రిప్ వేసినట్లుంది. చక్కగా పాటలు, మాటలూ, తెలుగులో యదేచ్చగా మాట్లాడుకుంటూ ఎంత ఆనందించామో తెలుసా!

ఇక మా  batch లో మా వారూ, నేనూ, డాక్టర్  కృష్ణ సుబ్రహ్మణ్యం గారూ, డాక్టర్ పద్మ, విజయదుర్గా గారూ, అలివేణి గారూ, రమేష్,పద్మజ గార్లూ, P.R.K. Rao, Sarada గార్లూ, వ్.సి.రావు, సావిత్రి గార్లూ,DR. K.B.Lakshmi, Aruna gaarloo, రెచ్చ్చి పోయి లలిత సంగీతాలూ,  సినిమా పాటలూ , జోక్స్ ....అయ్య  బాబోయ్ లో సందడి. అలుపెరుగకుండా మొదటి క్షణం నుండి హైదరాబాద్ airport దిగే వరకూ అల్లరి చేస్తూనే ఉన్నాం.

మేమిద్దరం ప్రత్యకం గా చెప్పుకోవాల్సింది ఏమంటే!" మమ్మల్నిఇద్దరినీ  కంటికి రెప్పలా కాపాడుకున్న మా డాక్టర్గార్లిద్దరూ, అరుణ లకు మా ప్రత్యేక ఆశీస్సులు"

నాగవల్లి పెళ్లి వారు అని సామెతలా కాకుండా ట్రావెల్స్ టూర్ మేనేజర్ మమ్మల్ని చివరికి రోమ్ లో Airport లో క్యూ లో నిలుచో బెట్టి వెళ్ళేరు.

Europe trip కి బెస్ట్ టైం జూన్, జులై, ఆగష్టు, అనుకుంటా. ఏమైనా మేము వెళ్లిన జూన్ 11 టైం చాలా బాగుంది.
ఏమీ కొనకుండా వెళ్లి  వస్తే ఒక్కొరికీ 2,05,000 అయ్యింది ప్రతీ పైసా తో సహా..  ఇది సమయానుకూలం గా కొంత మార్పు ఉండవచ్ఛు . ఇది మా ఖర్చు.

రేపటి నుండి టూర్ విశేషాలు.....






వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 8:39 AM కామెంట్‌లు లేవు:

ఆహా యూరప్ 1

ఆహా యూరప్   1

ఇంతక ముందు చాలా మంది యూరప్  వెళ్లి ఉండ వచ్చు, కానీ ఇది మా అనుభవం....

క్రితం సంవత్సరం అక్టోబర్ లో అమెరికా లో ఉండగా మా అల్లుడు కృష్ణ కుమార్ యూరప్ వెళ్ళమని చెప్పగానే, మాకూ ఆ ఆలోచన నచ్చి ఏర్పాట్లు మొదలెట్టాం.

ముందుగా మా బంధువులని  స్నేహితులని అడిగేము,  ఎవరైనా వస్తారేమోనని . 12 మంది  స్పందించి వస్తామన్నారు.

ఇక ఇండియా రాగానే మా హితులు, సన్నిహితులూ, స్నేహితులూ అయినా శ్రీ దుర్భ శ్రీరామా చంద్ర మూర్తి గారి సలహా మేరకు, వారి దిశా నిర్దేశం లో SOTC ద్వారా 10 nights 11 days package  మాకు అన్ని విధాలా అనువుగా ఉందని  తీసుకుని యూరప్ ట్రిప్ కి శ్రీకారం చుట్టాము.

 టూర్ పేరు "VANAKKAM EUROPE"  మద్రాస్ SOTC PACKAGE ఇది. అయినా సరే వాళ్ళు మమ్మల్ని హైద్రాబాద్ నుండి హైద్రాబాద్ వచ్చ్చేలా ఏర్పాటు చేసేరు.

మొత్త్తం 14 మంది కూడా ఒకే నేపధ్యం, ఒకే భావాలూ కలిగిన వాళ్ళవ్వడం తో  అందరం ఎంతో సరదాగా గడిపేము అన్ని రోజులూ.
వఛ్చిన వాళ్ళందరూ సామాన్యులుగా మారిపోయిన అసామాన్యులు, మాన్యులు.

తరవాత భాగం లో SOTC SERVICE గూర్చి తప్పక చెప్పుకోవాలి.

                                                 సశేషం




వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 7:39 AM కామెంట్‌లు లేవు:
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్

అయ్యగారి జయలక్ష్మి

ఒక పండితుని (పప్పు సోమేశ్వర రావు గారు) ఇంట పుట్టి, ఒక పండితుని ఇంటిని (అయ్యగారి సోమేశ్వరరావు గారు) మెట్టి, ఒక పండితుని (అయ్యగారి శ్యామసుందరం గారిని) చేపట్టే మహత్ భాగ్యం తో బాటూ....అంతో, ఇంతో సరస్వతీ కటాక్షం లభ్య మవ్వడం పూర్వ జన్మ సుకృతంగా, భగవత్ ప్రసాదం గా భావిస్తున్నా. నా కుటుంబ సభ్యులందరికీ ఆ వాగ్దేవి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని ఆశ, ఆకాంక్ష.

పాత రాతలు

  • ►  2024 (1)
    • ►  మే (1)
  • ►  2023 (7)
    • ►  సెప్టెంబర్ (1)
    • ►  ఆగస్టు (3)
    • ►  జూన్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2022 (4)
    • ►  అక్టోబర్ (2)
    • ►  మే (1)
    • ►  జనవరి (1)
  • ►  2021 (1)
    • ►  నవంబర్ (1)
  • ►  2020 (37)
    • ►  నవంబర్ (6)
    • ►  అక్టోబర్ (5)
    • ►  ఆగస్టు (17)
    • ►  మే (9)
  • ►  2019 (32)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (5)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (1)
    • ►  జూన్ (6)
    • ►  ఏప్రిల్ (2)
    • ►  జనవరి (15)
  • ▼  2018 (13)
    • ►  డిసెంబర్ (1)
    • ►  జులై (7)
    • ▼  జూన్ (5)
      • ఆహా యూరప్ 6 June 14 th అబ్బా ఇంకెత సేపు తెల్లారడ...
      • ఆహా యూరప్ 3  జూన్ 10 రాత్రి 11 గంటలకి బయలుదేరి అం...
      • ఆహా యూరప్ 2
      • ఆహా యూరప్ 1
  • ►  2017 (4)
    • ►  మార్చి (4)
  • ►  2016 (18)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (1)
    • ►  మే (3)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  మార్చి (3)
    • ►  జనవరి (5)
  • ►  2015 (20)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (1)
    • ►  మే (12)
    • ►  ఏప్రిల్ (6)
  • ►  2014 (1)
    • ►  మే (1)
  • ►  2011 (4)
    • ►  జనవరి (4)
  • ►  2009 (9)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (1)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (6)