మా చిన్న మనవరాలు శ్రియ ఒక నెల మాతో ఉండి వాళ్ళ అమ్మ నాన్నలతో అమెరికా వెళ్ళిన తరవాత కలిగిన భావ ఆవేశం తో రాసిన మైల్ మీ అందరి కోసం……………..
డియర్ చిన్నారి చిట్టి ప్రేయసీ! మా చంటి రాక్షసీ!
మా హృదయాలని దొంగిలించి న్యూ జెర్సీ పారి పోయిన " ఓ శ్రియమ్మా"!
మా ఇంట చక్కగా నడయాడి, నీ బోసి నవ్వులతో మా మనస్సులను దోచి, మా చేత అన్ని సేవలూ చేయించుకుని, కనిపించిన అందరినీ నగుమోముతో పలకరిస్తూ, వారు నీ వేపు చూస్తే చాలు చెంగుమని గెంతి…..వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి పోయి, వాళ్ళని ఆనంద పరుస్తూ, మాకు కొంత స్వాంతన చేకూరుస్తూ, (మా చేతులు నొప్పులు పుట్టకుండా చూసిన ఉపాయమంతురాలా) ఎంత చక్కగా వ్యవహరించేవు!
చివరికి మా హృదయాలని దొంగిలించి వెళ్ళి పోయేవు. మొన్న ఎవరో నిన్ను ఎత్తుకు పోతున్నట్లు కల వచ్చింది. (తీరా చూస్తే అది మీ అమ్మ నాన్నగారు నిన్ను న్యూజెర్సీ తీసుకెళ్ళి నందుకు వచ్చిన తిప్పలన్న మాట)
మరలా ఇవాళ నువ్వు పాకుతూ వస్తున్నట్లు కల.
" ఓ కలల రాణీ! కనికరించు" మమ్మల్ని మా పనులు చేసుకోనీ.
అన్నట్లు మన వారందరికీ చెప్పేవా? ఏమని అంటే :-
"మా అమ్మమ్మ చింత చిగురు పప్పు, ఆవకాయ అన్నం, చారూ, పెరుగూ, చాలా బాగా చేస్తుంది..( ఎలా తెలుసు అంటారా? నాకు అన్నప్రాసన మర్నాడే పెట్టింది కాబట్టి) అన్నట్లు అయిస్ క్రీం కూడా పెట్టింది తెలుసా?
అవును నిజం, మా అమ్మమ్మ నాకు అవన్నీ పెట్టింది. మా అమ్మకి చెప్పద్దు, నన్ను" ప.. ప్ప… ప్పా" అయితే- గియితే అమ్మమ్మని కూడా. కాబట్టి దయ చేసి చెప్పద్దు.
మా అక్క కూడా నన్ను చిట్టి తల్లీ అనీ, పండూ అనీ, ముద్దు లాడు తోంది. (నాకు అర్ధంకాడంలేదు, మా అక్క కూడా చిట్టి తల్లే కదా !నన్ను ఎందుకు అలా అంటోంది? )
అయినా నాకెందుకు లెండి. నేను బహుసా అందరికీ చాలా……….ముద్దు వస్తున్నాననుక్కుంట. " అని అందరికీ చెప్పేవా? లేదా? లేకపోతే ఇది చదివి తెలుసుకోమను.
అమ్మమ్మ
4 కామెంట్లు:
adbhutam ga undi nee flow. Akkada chinna pilla adutunnatlu ga undi.. Pa PA PaAAAA.. Sriya ki annaprasana ayye daaka wait chesevaa icecreame petta taaniki. Lasya ki 1st month lone petti??
hello jaya,
Ninnu vakdevi ga newjerssy sabha lonay gurthinchamu. Sangitham sikshanna ietha.. sahithyam ne lo imidivundi!!!!!!!!!!
Ne bhavatarangalu BHAVI taralaku pondhuparuchu
regards,
SRILAKSHMI.BANDI
jayalakshmi garu,nenu inta sepu miku telugulo reply idamani tantalu padutunanu, kani emi rayalekapoyanu,miru rasina vyakhyalu chala bhavunnayi.chadivi anadinchadam tappa , mi bhavalaku anugunanga mi sthayilo nenu rayalenu, kani, mi sangathymlo nerchukuni mundu mundu inka vipulunga miku javabu rayadaniki prayatnistanu.
miru mi chinnarula tipi gurutulani mi
gundallo padilanga dachukuni chala chakkaga vyaktam chesaru.
aruna peddinti
జయలక్ష్మి గారూ! నేను ఇంత సేపూ మీకు తెలుగులో రిప్లై ఇద్దామని తంటాలు పదుతున్నాను. కానీ ఎమీ రాయలేక పోయాను. మీరు రాసిన వ్యాఖ్యలు చాలా బాగున్నాయి. చదివి ఆనందించడం తప్ప, మీ భావాలకు అనుగుణంగా, మీస్థాయిలో నేను రాయలేను, కానీ మీ సాంగత్యం లో నేర్చుకుని ముందుముందు ఇంకా విపులం గా జవాబు రాయడానికి ప్రయత్నిస్థాను.
మీరు మీ చిన్నారుల తీపి గురుతులను మీ గుండెలలో పదిలం గా దాచుకుని చాలా చక్కగా వ్యక్తం చేసేరు. అరుణ పెద్దింటి
(ఆశ్చర్యం నేను తెలుగు లో రాసేనే?)
కామెంట్‌ను పోస్ట్ చేయండి