4, ఏప్రిల్ 2009, శనివారం

నా మొదటి పోస్ట్: ఇష్టం

నా అభిమానులందరికీ! ఇది ఒక సారి చూడండి. చొప్పదంటులా ఉంది కదా. నవ్వకండి. తెలుగులో మైల్ రాస్తుంటె ఏదో కవిత్వం కూడా వచ్చేస్తోంది -- జయలక్ష్మి

ఇష్టం


నాకు మా నాన్నగారూ, మా అమ్మా,మా శ్రీవారూ, మా అబ్బాయీ, మా అమ్మాయీ, అల్లుడూ, కోడలూ, మనవరాళ్ళూ, మనవడూ అంటే చాలా ఇష్టం.( ఎవరికి ఇష్టం ఉండదూ, ఇందులో వింతేమీ లేదు.)


వ్యక్తి నైజాన్ని బట్టి, అభిరుచులూ, అభిరుచులతో బాటూ ఇష్టాలూ ఏర్పడతాయి. వ్యక్తుల మీద కావచ్చు, భావాల మీద కావచ్చు, భాష మీద కావచ్చు, వస్తువుల మీద కూడా కావచ్చు. (అప్పుడప్పుడు మారుతూ కూడా వుండచ్చు).


అలా ఏర్పడిన ఇష్టం, ఏదైనా, ఎవరి మీదైనా, దేని మీదైనా కావచ్చు. దానిని ఎందుకు ఇష్ట పడుతున్నారు?, అనే దాన్ని బట్టి ఆ మనిషి నైజమూ, వ్యక్తిత్వమూ ఆధారపడి ఉంటుంది. కాదంటారా?
భావాలను నిర్వచించటం ఒకింత…. కాదు, కాదు… చాలా…. కష్టం.


రెండు భావాలు కలిస్తేనే అక్కడ ఇష్టం అనేది చొటు చెసుకుంటుంది అంటాను నేను.


అసలు దేని వల్ల ఇష్టంఏర్పడుతుంది?
ఇష్టం అంటే అన్ని ఇష్టాలూ ఒకలాంటి వేనా?
దానికి కారణం?
పర్యవసానం? పరాకాష్ట?
దాని వల్ల లాభమా/నష్టమా?
అహ్హ హ్హ హ్హ! ఇష్టం అన్నాక లాభ -నష్టాలేమిటి?.
ఇష్టానికి నిర్వచనం ఇష్టమే. అంతే.

5 కామెంట్‌లు:

Srinivas Udumudi చెప్పారు...

మనకి ఇష్టపడగలగడానికి ఉండే విషయాలు పరిమితం గా ఉంటాయి. మన ఇష్ట అయిష్టాలు ఈ పరిమితి లో నే ఉంటాయి. పరిమితి మార్చగల స్వేచ్చ మనకి ఉండదు (మామూలుగా). ఇలా ఉన్న వాటిలోనే కొన్ని విషయాలని ఇష్ట పడతాం, కొన్నిటిని ఇష్టపడం.

ఇష్ట అయిష్టాల తో తప్పక లాభ నష్టాలు ముడి పడి ఉంటాయి. కొన్ని సార్లు, మనకి అయిష్టమైనా ఇష్టం ఉన్నట్లు నటించాల్సి వస్తుంది!

Aditya Ayyagari చెప్పారు...

amma,
Nene mee abbayi aditya ni...nuvvu blog chesthe bavundu ani chala rojulu nundi anukuntunna - ippudu choosthunna - chala santosham...bavundi.

love,
Aditya

అజ్ఞాత చెప్పారు...

Jayatta :
Nuvvu ela nee vidya ni technology tho kalipi maa taraalu annitiki margadarsi gaa daari choopistunnanduku maa andari hrudayapoorvaka abhinandanalu .

regards
Vasudha Pappu

bharani mahankali చెప్పారు...

madam ,
i have listen to the radio vijayawada station in khammam two days back, u r father's music
very nice to hear ,then i tried in net for that song in vain.in that process i hapened to see u r site.if u post u r father songs ,i will be greatful.i am govt teacher by profession and a good listener in music.

itikala(yatavakilla) padmasri
9912165478

bharani mahankali చెప్పారు...

Thanks for u r ready responce madam,
pl post the details to the mail id:
bharanimx@yahoo.com,
thanks & reagards
itikala(yatavakilla) padmasri
9912165478

కామెంట్‌ను పోస్ట్ చేయండి