"ముక్తి క్షేత్రం"
ఇప్పుడే రమా శాండిల్య గారు రచించిన ముక్తి క్షేత్రం కాశీ గురించి చదవడం అయింది. ముఖ చిత్రం, ముందు మాట కూచి గారు అద్భుతంగా చదవాలనిపించే విధంగా వేసారు, రాసారు. మరో ముందు మాట లక్ష్మి గారు రాసారు. ఇక రమా శాండిల్య గారు ఎంత బాగా రచించారో చెప్పనలవి కాడం లేదు. మొదటి సారి రాసినట్లుగా లేదు. హృదయంలోంచి వచ్చిన మాట, మన పక్కన కూర్చొని చెప్పారు.
ఇప్పటికీ 4,5 ఇప్పటికి నాలుగైదుసార్లు కాశీకి వెళ్ళాం. ఆవిడ పుస్తకంలో చెప్పినట్టుగా (నిజంగా చెప్తున్నాను మనసులో మాట,) వీధులు పరిశుభ్రంగా లేవనే అనుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా మేము విశ్వేశ్వరుడి గుడి, అన్నపూర్ణాదేవి గుడిని, గంగా హారతి, కాలభైరవుని గుడి, బెనారస్ హిందూ యూనివర్సిటీ, దుర్గ దేవి గుడి ఇవే చూశాం.ఈరోజు పుస్తకం చదివాక మేము చాలా చూడలేదని తెలుస్తోంది. ఎంత వివరం రాశారు, కాదు కాదు, పక్కనే కూర్చుని చెప్పారు, అనేకంటే దగ్గరుండి చేయి పట్టుకుని చూపించారు అనాలి. సరళమైన భాషలో ఎంత చక్కగా వివరించారో చెప్పలేను. మళ్లీ ఒకసారి వారణాసి వెళ్లాలని ఉంది. ఒకవేళ వెళ్లినా, వెళ్ళలేకపోయినా ఇది చదివితే చూసినంత సంతృప్తిగానే ఉంది.అంత సవివరంగా చెప్పారు.
నేను ఎప్పుడూ పుస్తక సమీక్షలు చేయలేదు.రమా శాండిల్య గారిని కానీ, ముక్తి క్షేత్రం పుస్తకానికి కానీ నేను ప్రోత్సహించడానికి కాదు ఈ రాస్తున్నది.మనసులో కలిగిన భావం చెప్పకపోతే మనసు దొలిచేస్తోంది. ఈ పుస్తకం ప్రమోట్ చేయడానికి నేను ఎంత దానిని అండీ, విశ్వేశ్వరుడు చూసుకుంటాడు.
ఒక పుస్తకం రాయడం సులభం ఏమోగానీ, అది పుస్తక రూపంలోకి తేవడానికి చాలా వ్యయప్రయాసలు ఉంటాయి.అందరూ వీలైతే ఈ పుస్తకం కొనుక్కుని ముక్తి పొందండి .రమ గారికి మరో పుస్తకం రాయడానికి ప్రోత్సాహాన్నీ, ఉత్సాహాన్ని ఇవ్వండి. ఈ ముక్తి క్షేత్రం పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. రమా శాండిల్య గారిని కావాలనుకుంటే మన ఫేస్బుక్ లోనే ఉన్నారు సంప్రదించండి.