skip to main | skip to sidebar

Ayyagari Jayalakshmi

అప్పుడప్పుడు నాకు తోచింది వ్రాస్తే, నా అభిమానులందరికీ అందుబాటులో ఉండడానికి ఇలా ఈ బ్లాగు లో పోస్ట్ చేద్దామని.. తెలుగు లో ఇలా వ్రాయగలగడం ఎంత బావుందో!

18, మార్చి 2017, శనివారం



అయ్యగారి సోమేశ్వర రావు గారి సన్మానములు,సత్కారములు............


వీణా పాణి అయిన వాగ్దేవి కరకమలాలను అలంకరించిన వీణ, దైవాంశ గల గంధర్వ వాద్యంగా మన మన్నలను పొందింది. పాడడమే ఎరుగని పామరుడి నుండి పండితుని వరకూ రంజింపజేయగల వాద్యం వీణ.

శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారు మూర్తిలో చిన్న వారైనా కీర్తిలో అనితరమైన స్థాయిని అందుకున్నారు. వారి వాయిద్యం మలయ మారుతంలా చల్లగా, జలపాతంలా ఎగిరి దూకుతూ శ్రోతల హృదయాలను ఆకట్టుకుంటుంది.

 సర్వ రంజకమయిన వీణా గానమే లక్ష్యంగా పెట్టుకున్న  ఈ వైణిక తపస్వి నిరాడంబరులు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం " మనసును మరపించేదే గానం. ఇది శాస్త్రీయమా కాదా అనేమీమాంస రాకుండా, ఏ నాదామృతంలో మునిగి తేలుతామో ,అదే నిజమైన గానం"

మొదట్సో చెన్నై AIR నుండి వీణ వాయించే వారు,1948 లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏర్పడిన తరువాత అక్కడ నుండి ఉన్నత శ్రేణి విద్వాంసులుగా అనేక  ప్రోగ్రాంలు చేసేరు.

"భారతీ తీర్ధా" వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ నుండి " వీణా కోవిద" బిరుదును పొందారు. 

ఆంధ్ర సారస్వత పరిషత్ కార్య సభ వారి నుండీ "వైణిక రత్న" బిరుదును పొందారు. ఈ సంస్థ దిగ్గజాల్లాంటి పెద్దలతో out standing personality  లకు బిరుదులిస్తారు. దీనికి president...Sri Raja Venkatadri AppaRao, Sri Nagapudi Chandra Sekharayya, Supreme court judge మొదలైన వారు. 

వీణా వెంకట రమణ దాసు గారు " ఇతడు నా వద్ద రెండు మూడు పర్యాయములు వీణా గానము సల్పి నాడు, అద్భుతముగా వాయించుచున్నాడు, పరిణితికి రాగలడనియు ఎట్టి ప్రోత్సాహమునకైనా అర్హుడు" అని ఉటంకించారట.

"వాగ్గేయ కారక రత్న" హరి నాగభూషణం గారు ఈయన ప్రతిభకు చకితులై "వైణిక బాల భాస్కర" బిరుదమునిచ్చి ఆంధ్ర దేశమున వెంకట రమణ దాసు గారి వలె, సంగమేశ్వర శాస్త్రి గారి వలె చిర స్థాయి అయిన యశస్సు పొందమని దీవించారట.

విజయ నగరం పౌరులు వారిని " వీణా గాన సుధానిధి" బిరుదమునిచ్చారు.

దక్షిణాది దేశంలో అనేక కచేరీలు చేసేరట. ముఖ్యంగా పల్లడం సంజీవ రావు (వేణు గాన ధురీణులు) గారూ, బెంగుళూరు నాగరత్నమ్మ గారూ  మొదలగు వారి సమక్షంలో తిరువాయూర్ నందు వాయించి "శహభాష్" అని పించుకున్న ధీశాలి. 

ఇక దేవులపల్లి వారూ, ఇంద్పగంటి హనుమఛ్ఛాస్త్రి గారూ, మొదలగు మహామహులు పరవశించి  వారిపై గేయాలు రచించేరట.

1955 లో బాపట్ల  పురజనులు వారికి కాశీ కృష్ణాచార్యుల వారి కర కమలముల ద్వారా  సువర్ణ ఘంటా కంకణమును బహూకరించారట.

"తన మనోభావ వీధుల్లో మెరిసే విరిసే నాదామృతాన్ని మధురిమలై ప్రవహింపచేసి, శాంత జన హృదయాలను ఆనందపు తెప్పలపై ఊయల లూపుతారని" భావించే శ్రోతల భావన కంటే గొప్ప సత్కారం ఇంకేమి కావాలండీ? ఆ వైణిక రత్న కు.
                                            అది చాలదూ!





Sent from my iPhone
Click here to Reply or Forward
11.69 GB (77%) of 15 GB used
Manage
Terms - Privacy
Last account activity: 6 minutes ago
Details
వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 8:15 AM కామెంట్‌లు లేవు:

   శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి విద్యాభ్యాసం


ఎక్కడో పుల్లతో ఖాళీ డబ్బా మీద లయ బధ్ధంగా, సున్నితంగా, వినసొంపుగా వాయిస్తున్నారు ఎవరో. ఎవరా అని వెతకి చూస్తే చాటుగా కూర్చుని వాయిస్తున్నాడు మనవడు. 

అమ్మమ్మ తిరగలి విసిరి వెళ్ళాక ఆ బాలుడే అక్కడ కూర్చుని తిరగలి తిప్పుతూ చక్కగా పాడుతున్నాడు.( ఎందుకు అంటే అప్పట్లో రేడియో లేదు గ్రామ్ ఫోన్ రికార్డ్ ప్లేయర్ లో ప్లేట్ తిరగడం చూసి వుంటాడా చిన్ని బాలుడు. దానిని గ్రామ్ ఫోన్ ప్లేట్ గా భావించి దానిని చేతితో తిప్పుతూ తనే పాడుతున్నాడు)

ఇంట సంగీతపు ఛాయలు తక్కువే. తండ్రీ , పెద్ద అన్నగారూ వేద ఘనాపాటీలు. తల్లికి పెద్దగా సంగీతాభిరుచి వున్నట్టుగా తెలీదు. మరి ఈ చిన్నారికి సంగీతాభి రుచి ఎలా కల్గిందో? ముఖే ముఖే సరస్వతి. బహుశః చతుర్వేదాలలోని సామ వేదం నుండి పుట్టింది కదా సంగీతం, తండ్రి గారి అంశ అయ్యుంటుంది. 

 ఇక అసలు విషయానికి వద్దాం........
ఇక ఆ బాలుని తీసుకుని బాలుని అమ్మమ్మ శ్రీలక్ష్మమ్మగారు "విజయ రామ గాన పాఠశాల" ప్రిన్సిపాల్ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్దకు తీసుకెళ్ళి ఈ విషయం అంతా చెప్పేరు. (నారయణదాసు గారు వారి అమ్మమ్మగారికి పిన మామగారు) నారాయణ దాసు గారు ఆ బాలుని కళాశాలలో గాత్రం లో పేరి బాబు గారి వద్ద చేర్చమని, వీణ వాసా వెంకట రావు గారి వద్ద చేర్పించారట. అప్పట్లో డిప్లమో 10 సంవత్సరాలు. 

ఇంకా సందేహ మెందుకు ఆ బాలుడే వర్తమానంలో "వీణా కోవిద" "వైణిక శిరోమణి" శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారు. 

శ్రీ సోమేశ్వర రావు గారు కళాశాలలో చేరేటప్పుడు ప్రిన్సిపాల్ గా వున్న నారాయణదాసు గారు రిటైర్ అవ్వడం, ద్వారం వెంకట స్వామి గారు ఆ స్థానం లోకి రావడం అన్నీ ఆ 10 సం।। కాలంలో జరిగింది. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు తనతో కూడా వాయించమని సాధన చేయించేవారట.

మహరాజా సత్రంలో 10 సం।। భోజనం, కళాశాలలో బయట దూరంగా వున్న పెద్ద గదిలో (హస్తబల్) స్నేహితులతో కలపి బస. 

మేము ఆ మధ్య విజయనగరం వెళ్ళినప్పుడు ఆ గదిని దర్శించి మనస్సులో నమస్కరించుకున్నాం. మహా మహులు నివశించిన చోటు.  ఘంటశాల మా మామగారికి జూనియర్. మా మామగారు డిప్లమా అవుతుండగా వారు చిన్న తరగతులలో వుండేవారట. ఇలాగే సత్రం భోజనం, ఆగదిలో వసతి.

అప్పట్లో విజయనగరం సంగీత కళాశాల ఒక్కటే వుండడం వల్ల అన్ని చోట్ల నుండీ విద్యార్ధులు వచ్చి సత్రం భోజనం ఆ గదిలో మకాం. 

అన్నట్లు విజయ రామ గాన పాఠశాల చాగంటి గంగ బాబు గారనే అంధ విద్యార్ధి వయోలిన్ నేర్చుకోడం కోసం మహరాజు గారు ఏర్పాటు చేసేరట. అది ఈ నాటి విజయనగరం సంగీత కళాశాలగా వేవేల మంది కళాకారులను తయారుచేసి, ఆంధ్ర దేశానికి అందించింది. మన ఆంధ్ర దేశ చరిత్రకే మకుటాయమానమై , ఆంధ్ర మాతకు కలికి తురాయిగా నిలిచింది.


వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 8:14 AM కామెంట్‌లు లేవు:

మా ఇంటి ఆణిముత్యములు


విజయనగర సంప్రదాయం.....
వాసావారి సంప్రదాయం..........।విజయనగర సాంప్రదాయం లోని వీణే "ఆంధ్రా వీణ" గా ప్రసిధ్ధి గాంచింది.అసలు పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు అందరూ విజయనగరంలో నేర్చుకుని వచ్చినవారే.

మా మామగారు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారూ, శ్రీ వాసా కృష్ణమూర్తి గారూ సహధ్యాయులు, శ్రీ వాసా వెంకట రావు గారి వద్ద 10 సంవత్సరములు విద్యాభ్యాసం గావించారు. 

ఇద్దరిదీ విడదీయరాని స్నేహం. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇద్దరూ కలసే వుండేవారుట. కలసే వీణ ప్రాక్టీస్ చేసేవారట. 

ఎంత విడదీయరాని బంధం అంటే వాసా కృష్ణ మూర్తి గారు మా మామగారు పోయినప్పుడు మా ఇంటికి వచ్చి "సోమేశం లేకుండా నేను వుండలేనురా" అన్నారు. పాపం ఏడాది తిరగకుండా పరమపదించారు, కాదు కాదు స్నేహితుని కలవడానికి వెళ్ళారు. 

 అన్నట్లు వీరిరువురూ మొదట్లో వీణ నిలబెట్టి వాయించేవారట. 

ఇక 1948 లో మా వారు పుట్టినప్పుడు,  బాపట్ల వచ్చేసారు మా మామగారు, అక్కడ పురజనుల కోరికపై. 

 1960 లో మా మామగారి, శ్రీ మహదేవు రాధాకష్ణ రాజు గారి, శ్రీ కోటిపల్లి ప్రకాశ రావు గారి appointment తో విజయవాడ సంగీత కళాశాల ప్రారంభించ బడింది. మొదటి ప్రిన్సిపాల్గా శ్రీ బాలమురళీ గారు appoint అయ్యేదాకా 1 1/2 సంవత్సర కాలం మా మామగారే Incharge principal గా వ్యవహరించారట. వారి జీవితం సంగీతమయం ఇంటా బయట అనేక వేలమంది శిష్యులను తయారు చేసారు.

 మా ఇంటిలో వారి శిష్యులు మా నాన్నగారు శ్రీ పప్పు సోమేశ్వర రావు గారూ, శ్రీ శ్యామ సుందర్ గారూ, పరిటీ రాజేశ్వరిగారూ శ్రీ సత్యప్రసాద్ గారూ, మిగిలిన వారి ముగ్గురు పిల్లలూ, అన్నట్లు వారి భార్య శ్రీమతి జయకుమారి. నేనూ ఒక సంవత్సరం వారి వద్ద విద్యనభ్యసించే అదృష్టానికి నోచుకున్నాను. ఇక ప్రశిష్యులు తామరతూడులా పెరిగి పోతున్నారు. 

ఇక వారి సంగీత సేవ గూర్చి మరలా  వీలు చూసుకుని, వీలు చేసుకుని వ్రాస్తాను.

 ఇప్పటికి శలవా మరి



వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 8:04 AM కామెంట్‌లు లేవు:


చెంచా
"చెంచా" అంటున్నానని కాకా పట్టడం అనుక్కోకండి.
బారిష్టర్ పార్వతీశం టోపీ లా తగలడింది ఈ చెంచా నా పాలిట. అంతే కాదు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా నా మొహం మీద తాండవిస్తూ. విసిరేసినా మళ్ళీ మళ్ళీ కన్పించకుండా వచ్చి చెంచాల స్టాండ్ లో దూరి పోయి కూర్చునుండడమే కాక 🤧🤧🤧 "16 ఏళ్ళ వయస్సు" సినిమా లో చంద్రమోహన్ లాగా తగుదునమ్మా అని ముందుగా అన్నిటికీ తనే తయారు. విసుగు వచ్చేస్తోంది.
కానీ ఇప్పుడే దాని మీద ఎన లేని జాలీ, వ్యామోహం కలిగి చెంచాల స్టాండ్ నుండీ తీసి మాన్యుమెంట్ లాగా భద్రంగా దాచేసా. ఇంక కాళ్ళల్లో పడదు చక్కగా భద్రంగా వుంటుంది.
దాని పరోపకార బుధ్ధికి, నా యందు గల అవ్యాజమైన ప్రేమకు గుర్తుగా దాచుకున్నాను బుజ్జి మున్నను.
వీరిచే పోస్ట్ చేయబడింది Ayyagari Jayalakshmi వద్ద 7:56 AM కామెంట్‌లు లేవు:
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్

అయ్యగారి జయలక్ష్మి

ఒక పండితుని (పప్పు సోమేశ్వర రావు గారు) ఇంట పుట్టి, ఒక పండితుని ఇంటిని (అయ్యగారి సోమేశ్వరరావు గారు) మెట్టి, ఒక పండితుని (అయ్యగారి శ్యామసుందరం గారిని) చేపట్టే మహత్ భాగ్యం తో బాటూ....అంతో, ఇంతో సరస్వతీ కటాక్షం లభ్య మవ్వడం పూర్వ జన్మ సుకృతంగా, భగవత్ ప్రసాదం గా భావిస్తున్నా. నా కుటుంబ సభ్యులందరికీ ఆ వాగ్దేవి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని ఆశ, ఆకాంక్ష.

పాత రాతలు

  • ►  2024 (1)
    • ►  మే (1)
  • ►  2023 (7)
    • ►  సెప్టెంబర్ (1)
    • ►  ఆగస్టు (3)
    • ►  జూన్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2022 (4)
    • ►  అక్టోబర్ (2)
    • ►  మే (1)
    • ►  జనవరి (1)
  • ►  2021 (1)
    • ►  నవంబర్ (1)
  • ►  2020 (37)
    • ►  నవంబర్ (6)
    • ►  అక్టోబర్ (5)
    • ►  ఆగస్టు (17)
    • ►  మే (9)
  • ►  2019 (32)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (5)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (1)
    • ►  జూన్ (6)
    • ►  ఏప్రిల్ (2)
    • ►  జనవరి (15)
  • ►  2018 (13)
    • ►  డిసెంబర్ (1)
    • ►  జులై (7)
    • ►  జూన్ (5)
  • ▼  2017 (4)
    • ▼  మార్చి (4)
      •    శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి విద్యాభ్యాస...
      • మా ఇంటి ఆణిముత్యములు విజయనగర సంప్రదాయం..... ...
  • ►  2016 (18)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (1)
    • ►  మే (3)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  మార్చి (3)
    • ►  జనవరి (5)
  • ►  2015 (20)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (1)
    • ►  మే (12)
    • ►  ఏప్రిల్ (6)
  • ►  2014 (1)
    • ►  మే (1)
  • ►  2011 (4)
    • ►  జనవరి (4)
  • ►  2009 (9)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (1)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (6)