టీచరు గారూ 🙏🙏🙏
మాధవపెద్ది సుబ్బలక్ష్మీ మూర్తిగారు.......
ఆవిడ ఒకసారి పరిచయమౌతే గుర్తుండి పోయే వ్యక్తి. ఇక అలాటిది ఆవిడ నాకు గురువు, గైడ్, స్ఫూర్తిప్రదాయని, నాకు ఆదర్శం,ఇంకా చెప్పాలంటే తల్లి,తండ్రీ,గురువూ, దైవం, ఇంతకన్నా చెప్పడానికి నా భావానికి భాష లేదు.
టీచర్ గారు మంచి ఝరితో ఎగిసి దూకే జలపాతం, చల్లగా సాగే సెలయేరు, చల్లటి మలయమారుతం, సుడులు తిరుగుతూ చుట్టబెట్టే సుడిగాలి, సన్నజాజీ-సంపెంగలు కలబోసిన సువాసన! వారి గూర్చి ఎంత చెప్పినా నాకు తృప్తి తీరదు.
మనకి ఏదైనా సమస్య వున్నప్పుడు సానుభూతి చెప్పేవారి వల్ల మనం మరింత డీలా పడి పోతాం, ఆవిడ సానుభూతి చెప్పరు ధైర్యం చెబుతారు (నయానా భయాన)
వారి గూర్చి ఒక పుస్తకం రాయచ్చు, ఇంకా ఎంతో చెప్పాలని వుంది కానీ ఇంతటితో ముగిస్తున్నా!
టీచరు గారూ! మీరు నా జీవితంలో తారస పడడం, నా పూర్వ జన్మసుకృతం.............🙏🙏🙏