టూర్ ముగింపు ....
june 21.......
టూర్ ముగింపుకు వచ్చ్చేసాం. 10 రోజులయ్యాక మొదటి సారి కొంచెం నెమ్మదిగా లేచి, సామాను పూచిక పుల్ల కూడా వదల కుండా సర్దేసుకుని కిందకి 8. 30 కి బ్రేక్ ఫాస్ట్ కి వచ్చేసాం . తీరా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ 9 కి అయిపోతుందిట, సో గబా గబా తినేసాం. వాళ్ళు మేము చూస్తుండగానే ఒక్కోటి సర్దేసుకుంటున్నారు. బానే ఉంది, నయం అర గంట ముందు వచ్చెం కాబట్టి ఈ మాత్రమైనా దక్కింది అనుకుని, గబా గబా తినేసాం.
తరవాత ఫొటోస్ తీసుకుని, మంచి ఆధ్యాత్మ రామాయణ కీర్తన మా వారు నేర్పిస్తుండగా మేమందరమూ నేర్చుకుని, reception దగ్గరకు వచ్చ్చేసరికి ఉల్లాస్ రెడీ. చిన్న పిల్లవాడు, చక్కగా ఉన్నాడు. హుషారుగా మీరు సామాను తీసుకెళ్లాలి కాబట్టి పెద్ద బస్సు వచ్చ్చేస్తోంది, రెడీ గా ఉండండి అని చెప్పేడు.
అందరం రూమ్ కి వెళ్లి సామాను తీసుకుని రెడీ గా ఉన్నాం, ఇంతలో బస్సు వచ్చింది. సామన్లు అందులో ఎక్కించి ఎయిర్పోర్ట్ కి బయలుదేరాం. 20 నిమిషాల్లో రోమ్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాము. మమ్మల్ని క్యూలో నిల్చోబెట్టి మాకు జాగ్రత్త లు చెప్పి, నేను కింద వేరే టూర్ మెంబెర్స్ ని తీసుకెళ్లాలి, కాబట్టి కిందే ఉంటానని, అవసరమైతే ఫోన్ చెయ్యమని చెప్పి , కిందకి వెళ్ళేడు.
మాకు నిన్న రాత్రి ఎన్ని సందేహాలొ! ఉల్లాస్ ఎవరు? టైం కి వస్తాడా? బస్సు ఎప్పటిలా పెద్దది వస్తుందా?(సామాన్లు పట్టాలి కదా డిక్కీ లో) మేము టైం కి ఎయిర్ పోర్ట్ కి వెళ్లగలమా? నాగవల్లి పెళ్లి వారం కదా SOTC వాళ్లకి మా మీద కేర్ ఉంటుందా? అన్నిటికీ సమాధానం దొరికి పోయింది. మొదటి రోజు ఆహ్వానం ఎలాగో చివరి రోజు వీడ్కోలు కూడా అంత బాగానూ. జయహో SOTC జయహో! JEETHE RAHO!
ఈ ట్రిప్ వల్ల మాకు తెలిసిన విషయాలు.... మేము చక్కగా ఎంత దూరమైనా నడవగలము అనీ, నిచ్చెనలెక్కి ఏమైనా తీయగలమని.
నిజానికి కాళ్ళ నొప్పులు నడుస్తుంటే కొద్దిగా అనిపించిన మాట వాస్తవం కానీ, రాత్రి రూమ్ కి వెళ్ళేసరికే లేవు, పక్క రోజు నిద్ర లేచేసరికి అస్సలు లేవు.
Rome లో చెక్ ఇన్ అయ్యి చక్కగా లోపల చైనీస్ రెస్టారంట్ లో fried రైస్ తిన్నాము. మేము ఎక్కడా ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వలేదు. మంచి స్టే, మంచి ఫుడ్, తోడుగా ఒకరు మన గ్రూప్ కోసం allot అయి, మనని నిరంతరం వెంట ఉండి చూసుకోడం. SOTC THE GREAT TRAVELS.
దుబాయ్ లో దిగి, ఇండియా వెళ్లే ఫ్లైట్ గేట్ దగ్గరకి వెళ్ళడానికి ఎంత నడవాలో , చుక్కలు కనిపించాయి. నిజం చుక్కలే. అర గంట సేపు ఈజీ గా నడిచేము. ఎక్కడా TRASFERRING వెహికల్స్ కనబడ లేదు. ఎట్టకేలకు అక్కడకి చేరుకొని నెమ్మదిగా ఫ్లైట్ లోకి పిలుపు వచ్చ్చాక ఎక్కి 22 ఉదయం 8.30 కల్లా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి, ఎప్పటికీ రాని Suitcase ల కోసం ఎదురు చూసి, ఎదురు చూసి, మొత్త్తనికి అందరమూ బయటకి వఛ్చి cab ఎక్కి ఇంటికి వచ్చ్చేసాము.
రోమ్ లో ఎయిర్ పోర్ట్ నుండి మా డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారు మమ్మల్నిద్దరినీ చంటి పిల్లల్లా వెంట పుచ్ఛు కుని తీసుకెళ్ళేరు. కంటి రెప్పలా చూసుకున్నారు.
మా గ్రూప్ లో మేము 14 మంది కాక నలుగురే తమిళియన్లు ఉంది, మా కోసమే ట్రిప్ ఏర్పాటు చేసినట్లుంది, తెలుగు ,మాట, తెలుగు పాట ,ఒకే నేపధ్యం, సంగీత సాహిత్యాలు , మంచి స్నేహితులుండడం వల్ల, ట్రిప్ మేము అద్భుతం గా enjoy చేసేము. ముఖ్యం గా మా డాక్టర్ గారు, విజయదుర్గా గారూ, మా వారూ పాత పాటలు దంచి కొట్టారు. మిగతా వారూ ఇతోధికం గా పాల్గొన్నారు.
మరి ఇక ఈ ట్రిప్ కి సంబంధించి సెలవా?
శలవు
నమస్తే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి