కల నిజమైన వేళ
వెంకటేశ్వరస్వామి bust దాకా వుండి, అటూ ఇటూ శంఖం చక్రం వుండే ఇటువంటి బొమ్మ అందరూ గోడలకి పెట్టే వారు.
ఈ బొమ్మ plaster of parisది. చాలా ఖరీదయినది,ధనవంతులు మాత్రమే కొనగలిగినది, ఇది మనకు అందు బాటు అయినది కాదనే భావనతో ఎప్పుడూ ఆరాధనాభావనతో చూడ్డమే కానీ ఎంతో కనుక్కో లేదు.
అయినా కొనుక్కుందుకు చేతిలో డబ్బులుంటేగా? నా అనే ఇల్లు వుంటేగా? మన ఇల్లు తప్ప.
ఇంతలో పెళ్ళయింది. హైదరాబాదు కాపురం.
ఒకసారి రాత్రి వేళ రాణీగంజ్కి వెళ్ళాం. అక్కడ రోడ్ మీద పెట్టి అమ్ముతున్నాడు. ఖరీదు విని నేను తట్టుకోలేక పోయాను. అమ్మో ఇంతా. నేను ఏవేవో ఊహించుకున్నాను.
ఇంతకీ ఎంతయ్యుంటుందీ? ఇంతకీ ఇదంతా 1971 లో
చెప్పుకోండి చూద్దాం.రూపాయిన్నర అండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి