ఆహా యూరప్ 11 అయ్యగారి జయలక్ష్మి
June 19
మళ్ళీ పొద్దున్నే దిన చర్యలన్నీ మామూలే. 9 కల్లా బయలుదేరేము. 3 గంటలు ప్రయాణించి, రోమ్ లోని "Leaning Tower of Pisa" చూడటానికి చేరేము.
భూషణ్ మాకు నెమ్మదిగా చెప్పేడు, "రాత్రి నేను బయలుదేరి ఇండియా వెళ్లి పోతాను, మీకు రేపటికి పరేష్ అనే టూర్ మేనేజర్ వస్తారు, అతను మీకు వేటికన్ సిటీ చూపిస్తాడు. మా అంకుల్ చనిపోయారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వెళ్ళ వలసి వస్తోంది , మీకు ఏమీ ఇబ్బంది లేదు రాత్రి హోటల్ లో మీ డిన్నర్ అయ్యా దాకా ఉంది వెళ్తాను, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దగ్గర పరేష్ వస్తారని, పరేష్ వాటికన్ చూపించి వెళ్లి పోతాడని, ఉల్లాస వఛ్చి మమ్మల్ని రోమ్ ఎయిర్పోర్ట్ కి దింపుతాడని " చెప్పేడు. మాకు అది కొంచెం సేపు మింగుడు పడ లేదు. ఏం చేస్తాం తప్పదు కదా.
మేమందరమూ ఒక్కకళ్ళూ 5 యూరోలు వేసుకుని, మేము భూషణ్ కు, మాకు అతను చేసిన సర్వీస్ కి సంతోషం ప్రకటిస్తూ ఇచ్ఛేము, ఒద్దని మొహమాట పడినా, బలవంతం చేసి ఇచ్ఛేసాము.
మా బస్సు చాలా దూరం లో పార్కింగ్ ప్లేస్ లో ఆపేరు. అక్కడ నుండి వేరే బస్సు లో అతి దగ్గరా తీసుకుని వెళ్లి దింపేరు. అక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ పీసా టవర్ ముందు నుండి లంచ్ కి సందు లోపలి వెళ్ళేము. దారంతా ఎండా, గొడుగు నల్ల కళ్లజోళ్ళూ, మామూలే, కాకపోతే నిన్నలా ఎండ అంత బాధించలేదు, కొంచెం గాలి కూడా వస్తోంది కాబట్టి, పెద్దగా ఇబ్బంది లేదు.
ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి ని చూడ్డానికి ఏడూ కొండలు ఎక్కి , చివరగా మోకాళ్ళ పర్వతం ఎక్కినట్లు, చివరి ఇటలీ, రోమ్ 3 రోజులూ మటుకూ ఎండ ఒక పరీక్షే.
ఇక భోజనం అయ్యాక పీసా టవర్ చూడ్డానికి వెళ్ళేము, వెళ్లడ మంటే దాని ముందు నుండే రావాలి తప్పదు.
పీసా టవర్ గూర్చి చిన్న వివరణ....
ఇది చర్చ్ భవనాల సముదాయం లో బెల్ టవర్ / గంట స్థంభం గా 1173 లో ప్రారంభించ బడిందిట. దీని వాస్తు శిల్పి ఎవరో ఖఛ్చితం గా తెలియదు కానీ BONONNO PISANO మొదలగు కొందరని చెప్తారు. ఈ కట్టడం మొదలెట్టినప్పుడు నిలువుగానే మొదలయ్యింది. 5 సంవత్సరాల పాటూ తిన్నగానే నిలుచున్నది. 3 వ అంతస్థు మొదలవగానే కొంచెంగా వంగి పోడం తో నిర్మాణం ఆపేసారు. ఎక్కువ గట్టిదనం లేని మట్టి పై కట్టడం, దానితో పాటూ పునాదులు బలహీనమవడం కారణాలు గా భావించి సుమారు వంద సంవత్సరాలు నిర్మాణం ఆపేసారు.
తరువాత కూడా నిర్మాణం నట్టూతూ, నట్టుతూనే సాగింది. కాకపోతే ఆ వంగడం ఒక పర్యాటక ఆకర్షణ గా నిలవడం తో కొంతకాలం తర్వాత ఆ కట్టడాన్ని వంగే ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
దీని ఎత్త్తు 183 అడుగులు, వెడల్పు 8. అడుగులు.
1372 లో నిర్మాణం పూర్తి అయినప్పుడు ఇది 5. డిగ్రీల కోణంలో వంగి ఉండేది. 1990-2001 మధ్యలో జరిగిన పునరుధ్ధరణ చర్యలతో ఇప్పుడు ఇది 3. డిగ్రీల కోణంలో వంగి ఉంది.
ఒకా నొక టైం లో ఇది ప్రపంచపు "Seven Wonders" ఒకటి, ఇప్పటి కొత్త్త్త లిస్ట్ లో ఉండక పోవచ్చు .
దాని ఫోటోలు పోస్ట్ చేస్తాను చూడండి.
అది చూసుకుని బయటకి వచ్చ్చేస్తుంటే "సావనీర్స్ " కొనుక్కుందుకు షాప్ కి వెళ్తే అక్కడ తెలుగు మాట్లాడుతున్నాడు ఒక షాప్ అతను. ఆశ్చర్యం వేసింది.
ఇంకొంచెం ముందుకు వచ్చ్చేస్తుంటే దారంతా నల్ల వాళ్ళు, కోటీలో లాగా దండలూ, బాగ్స్ వగైరాలు అమ్ముతామని మనని వేధిస్తారని, వాళ్ళల్లో కొందరు తస్కరులుండవచ్చ్చని , వారిని పరికించవద్దు, పలకరించవద్దని భూషణ్ ఇచ్చిన సూచన మేరకు మేము అటు చూడకుండా వచ్ఛే సాము.
మళ్ళీ మా CONNECTIVE బస్సు ఎక్కి, మా అసలు బస్సు వద్దకు వచ్చ్చేసాము.
బస్సు ఎక్కి రోమ్ లో Ardeantina Park హోటల్ కి వచ్ఛేసి సామాను దింపేసుకున్నాము. అక్కడే పక్క రోజు బస కూడా. ఈ హోటల్ తో మా యూరప్ ట్రిప్ సంపూర్ణ మవ్వబోతోంది.
బస్సు దింపి క్రిస్ బస్సు తీసుకుని వెళ్లి పోయాడు పూర్తిగా! ఎందుకంటే ఆ రోజు తో అతనికి డ్రైవింగ్ పర్మిట్ ఉన్న 12 రోజులూ (ఇంకో ట్రూప్ తో 3 రోజులూ+ మాకు 9 రోజులూ పూర్తయ్యిందని) డిన్నర్ అయ్యాక భూషణ్ అన్నీ అప్ప చెప్పి వెళ్లి పోయాడు.
తెలిసిన వాళ్ళందరూ మనని వదిలేసి వెళ్లి పోతున్నారు, ఇంకోరు వఛ్చి మనని జాగ్రత్తగా వాటికన్ సిటీ చూపిస్తారా? తరువాతి రోజు ఇంకోళ్ళొస్తారట ఎయిర్ పోర్ట్ కి దింపుతారా? అన్నీ సందిగ్ధాలు!
అయినా రెస్ట్ మటుకూ మాన లేక పోయాము. నిజం చెప్పాలంటే అందులోనే కదా మనం సేద దీరేది.
సశేషం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి