7, జులై 2018, శనివారం

ఆహా యూరప్ 10

ఆహా యూరప్ 10
  జయలక్ష్మి అయ్యగారి
June 18

యధావిధిగా  బాగ్స్ సర్దుకుని 9 కల్లా బయలుదేరి, స్విట్జర్లాండ్ బోర్డర్ వదిలి, ఇటలీ లోకి 3 నిమిషాల్లో ఎంటర్ అయిపోయాము, ఎందువలనా అంటే నిన్న చెప్పేను  కదా, మేము బోర్డర్ లో ఉన్నామని.

అక్కడ నుండి 4 గంటలు ప్రయాణం చేసి, మధ్యలో ఆడుకుంటూ, పాడుకుంటూ, మధ్యలో మా నోళ్ళకి పని చెబుతూ (పొరబడకండి, తిట్టుకోలేదు, స్నాక్స్ తింటూ , మధ్యలో రెండు సార్లు  పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతూ (ఎందుకో మీకు తెలుసు కదా) చివరగా లంచ్ రెస్టారంట్ లో ముగించుకుని "వెనిస్  నగరం"   చేరుకున్నాము.

వెనిస్ నగరం 100 చిన్ని చిన్ని ఐలాండ్స్ మీద కట్టి , కెనాల్స్ తో విడ దీయ బడి, బ్రిడ్జెస్ తో కలప బడి ఉంది. మా గ్రూప్ కి  విడిగా చిన్న బోట్ బుక్ చేసేరు, అందులో ప్రయాణం. మన బోట్ వెళ్తుంటే నీటి అలలు మనని తాకుతాయేమోనన్నంత  విశృంఖలం గా  ఎగిరి ఎగిరి మన బోట్ లోకి వచ్చ్చేద్దామన్నంత  ప్రయత్నం చేస్తుండగా,  నీటి తుప్పర మొహం మీద చిందులేస్తుంటే ,  ఎంత గొప్ప ఆనందపు అనుభవమో చెప్పలేను, ఎవరికీ వారు తెలుసుకోవలసిందే.  ఈ బోట్ లోకి ఎక్కుతుంటే మా భూషణ్ చాలా సహాయం చేసేడు.

బోట్ దిగేక,  చల్ల దనం మటు  మాయం. పైగా విపరీతమైన ఎండ. పైన గొడుగు వేసుకుని, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, కాళ్ళీడ్చుకుంటూ ఎన్ని బ్రిడ్జిలు  దాటామో,ఎంత దూరం నడిచేమో!  "అయ్యో పాపం అంత దూరం ఎండలో నడిచేవా  జయలక్ష్మి" అని నా మీద నాకే జాలి వేసింది. బ్రిడ్జిలు లేఖ పెట్టుకుంటూ వెళ్ళేము, ఎందుకంటే మమ్మల్ని భూషణ్ అక్కడ వదిలేసి 5 గంటలకి  రండి, మన బోట్  వస్తుంది, లేక పోతే మీరు ఇక్కడే ఉండాలని, లేదా మీ ఏర్పాటు తో మీరు రావాలని బెదిరించాడు.  వచ్ఛేప్పుడు తప్పి పోకూడదు కదా. మళ్ళీ బ్రిడ్జిలు  లేఖ్ఖ  పెట్టుకుంటూ వచ్ఛేసాము 4.30  కల్లా.

అక్కడ నుండి మేము నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి The St,Marks square కి వెళ్లి అక్కడ  The Historic Ducal Palace,The Romantic Bridge of Sighs,Splendid St,Mark's Basilica. చూసుకుంటూ నడుచుకుంటూ, నడుచుకుంటూ, మళ్ళీ నడుచుకుంటూ, మురానో గ్లాస్ ఫ్యాక్టరీ  కి వెళ్ళేము. అక్కడ హాయిగా చల్లగా ఉంది లోపల.

గ్లాస్ తో  అద్భుత కళాఖండాలు తయారు చేసి ఉన్నాయి.  అక్కడ కొనుక్కొవచ్చుఁ కూడా. అక్కడ  మనకి  ఆ కళాఖండాలు ఎలా తయారు చేస్తారో డెమో ఇస్తామన్నారు. దొరికిందే తడవుగా అందరమూ చూసే పేరు తో, కొంచెం సేపు కూల బడ్డాం. నిజం గా అద్భుతం గా ఉంది డెమో. క్షణాల్లో చక్కటి కళాకృతి తాయారు చేసేసారు. (ఇంకొంచెం సేపు చెయ్యచ్చుఁగా, ఇంకొంచెం సేపు చూసే పేరుతో కూర్చోవచ్చని అనిపించింది నాకు. ) సరే అవ్వగానే బయటకు వస్తే, బయట చిన్న చిన్న ప్రైవేట్ బోట్లు  తీసుకుని హాయిగా ఎవరికి  వారు  వెళ్తున్నారు. ఆ బోట్స్ ఎంత అందం గా ఉన్నాయో.

 కానీ నాకు గ్లాస్ ఫ్యాక్టరీకి  వెళ్లేదార్లంతా హైదరాబాద్ చార్మినార్ దగ్గర పాత బస్తీ లాగా ఇరుకు సందుల్లోంచి, ఇరుక్కుని వెళ్లినట్లు గా ఉంది. చార్మినార్ దగ్గర కూడా glass products తయారు చేసే factories,  కళాఖండాలు తయారవుతాయి. మన దేశం కూడా అన్ని విధాలా ఎవ్వరితో  ఏమాత్రం తీసి పోదు.

 కాక పోతే మేము చల్లగా కొంచెం సేపు కూర్చునే ఛాన్స్ దొరికింది అనేది  మటుకూ నిజం. ఎక్కడ బయట షాప్స్ దగ్గర ఖాళీ కుర్చీల్లో కూర్చుందామంటే, మీరు ఏమైనా కొంటే  కూర్చొండంటున్నారు.  కూర్చోడం  కోసం ఏమి కొనం?  పైగా ఇటలీ, రోమ్ లో తస్కరులు చాలా  ఎక్కువ అని ముందే అందరూ హెచ్చరించారు, అంతే కాక భూషణ్ కూడా చెప్పేడు.  కాబట్టి Passports, Euros విషయంలో జాగ్రత్త గా ఉండాలి అందరూ.

మళ్ళీ నడుచుకుంటూ, నడుచుకుంటూ, నడుచుకుంటూ, (ఎదురెండ తప్పించుకుంటూ) బ్రిడ్జి లు లెఖ్ఖ  పెట్టుకుంటూ వెనక్కి వఛ్చి మా Boat Pick up Point కి ఎదురుగా కాఫీ షాప్ లో కాఫీ తాగి, అరగంట అక్కడ కూర్చుని మా బోట్ రాగానే, అందులో కూర్చుని మళ్ళీ కేరింతలు కొడుతూ కొందరూ   , కేరింతలు కొట్టడానికి ఓపిక లేక కొందరూ, ఒడ్డుకు వఛ్చి హాయిగా మా బస్సు ఎక్కి హోటల్ కి వచ్చ్చేసాము. (ఇది నా అనుభవము, మా గ్రూప్ లో ఉన్న 50 ల వాళ్ళు ఈ ఇబ్బంది పడలేదని నా భావన, కానీ ఎండ ఎవరినైనా బాధిస్తుంది కదా, నాలా 60 దాటినా వాళ్లనే కాదుగా, ఏమో మరి వాళ్ళు చెప్పాలి వాళ్ళ అనుభవం)  ఆ రోజు హోటల్ పేరు "Best Western Palace"

ఈ రోజు డిన్నర్ ఇక్కడే. పాస్తా, ఇటాలియన్ పిజ్జా, baked and sliced brinjals , aloo, చిలకడ దుంప. లాంటివి ఇచ్ఛేరు. ఇదొక అనుభవం.  తిన్న వాళ్ళు తిన్నారు, తినలేని వారు  జాగ్రత్తగా కానిచ్ఛేసారు.

కి వెళ్లి AC వేసుకుని రెస్టే  రెస్ట్. సొమ్మసిల్లి  పడుకున్నాం. మా అమ్మ "డాక్టర్ పద్మ" ఉంది కదా, గురువుగారూ Madam AC ఉన్నా సరే అక్కడ ఉన్న  చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకుని పడుక్కోండి, మంచి నిద్ర వస్తుంది అని చెప్పింది. మా పద్మ చల్లగా ఉండాలి.
                                                            సశేషం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి