ఆహ యూరప్ 8
జూన్ 16
పొద్దున్న 7 కల్లా కిందకి దిగి, అక్కడి గులాబీ వనం లో అద్భుతమైన ఫొటోస్ అందరమూ తీసుకొని, బ్రేక్ఫాస్ట్ చేసుకుని, ప్రయాణం మొదలు 9 కల్లా మొదలయ్యింది. ఈ రోజు సామాను బస్సు ఎక్కించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు "యాంగ్ ఫ్రొ" చూసుకుని రాత్రి కి అక్కడే బస.
ఎంత హాయిగా ఉందో ! చిన్న గొడుగులు, మంచినీళ్ల సీసాలు, చిన్న స్నాక్స్, చిన్న షోల్డర్ బాగ్ వేసుకుని, చేతులూపుకుంటూ రికామీగా వెళ్ళేము.
ఆ రోజు 2. 30 గంటలు ప్రయాణం చేసి , top అఫ్ ది mountain 11,000 అడుగుల ఎత్త్తుకు, ట్రైన్ లు రెండు మారి వెళ్ళాలి, మళ్ళీ అలాగే తిరిగి mountain కు రెండో వేపు చూసుకుంటూ రావాలి అని భూషణ్ చెప్పీడు.
ఆ రోజు మేము Jungfraujoch (యాంగ్ ఫ్రొ అంటారుట ) A MAJESTIC BACKDROP OF ICE. top of the mountain, 11,000 feet height కి వెళ్ళేము.
12 కల్లా ట్రైన్ పైకి వెళ్ళేది వస్తుంది , తొందరగా నడవండి అని 11.30 కల్లా స్టేషన్ కి తీసుకెళ్లి పోయాడు. అక్కడ టికెట్స్ కొని ఇఛ్చి, తిరిగి వచ్ఛేదాకా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి చేతికి ఇచ్ఛేడు. వేరే ట్రావెల్స్ లో ఇది 155 యూరో లు ఉంది, దీనిలో మటుకూ ఆప్షనల్ కాదు, included.
దారి అంతా నేను వర్ణించను, చూపిస్తాను చూడండి
cogwheel train లో Lauterbrunnen station నుండీ 15 minutes ఒక రైల్, తరవాత ట్రాక్ మారి 35 మినిట్స్ ఒక ట్రైన్ , ఎక్కి (రైల్ కూ రైల్ కూ మధ్యలో దిగి ఫొటోస్ తీసుకుని) చివరకి పైకి చేరుకున్నాము. అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండి giddiness కానీ గాలి ఆడక ఇబ్బంది గా కానీ ఉండవచ్చూ, చాక్లెట్ ఒకటి ఇఛ్చి నోట్లో వేసుకోండి, ఎక్కువగా మంచి నీళ్లు తాగమని జాగ్రత్త చెప్పేడు. భూషణ్.
సరే అక్కడకి వెళ్ళేక top of the mountain మీద bombay restaurant లో అద్భుతమైన భోజనం చేసుకున్నాం. ఎటు చూసినా రైల్ ఎక్కిన దగ్గర నుండి దిగే దాకా, వెండి కొండలే . శివ పార్వతుల నృత్యం చూశామంటే నమ్మండి.
ఈ అనుభూతిని వర్ణించలేను. చూపించగలను.
కొన్ని భావాలకు భాష రాదు, లేదు. చిత్రాలే చూపించగలను.
కానీ మేము ఒక 7 గురం రెస్టారంట్ నుండి బయటకు వఛ్చి ఆఛ్చాదన ఉన్న చోటే ఉండి పోయాం, కారణం కళ్ళు తిరిగి పోతున్నాయి, చెప్పలేని Discomfort. మళ్ళీ తిరుగు రైల్ వచ్ఛేదాకా, బయటకి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్ఛే దాకా, ఎదురు చూసి వాళ్ళ తో తిరిగి రైల్ ఎక్కి పోయాము..
బయటకు వెళుతూ మా డాక్టర్ గారు రమ్మని చాలా ప్రోత్సహించారు, కానీ వెళ్ళ లేక పోయాము.
వాళ్ళు చాలా చాలా చాలా ఆనందించారు. ఆనందపు అంచులు చూశామని, చిన్న పిల్లలై ఆడుకున్నామని ఊరించారు.ఇప్పుడు మీలానే మేము కూడా వారు పొందిన ఆనందాన్ని ఫొటోస్ రూపం లో చూసాము.
అన్నట్లు పైకి వెళ్లిన మేము గట్టిగా చలిని ఓర్చుకునే కోట్, స్కార్ఫ్, చేతులకి గ్లోవ్స్, కాళ్ళకి మంచి షూస్ వేసుకున్నాము. బయటకి మంచు లోకి వెళ్లిన వాళ్ళకే కాదు, అక్కడి దాకా వెళ్లిన మాకు కూడా, చాలా అవసరం అక్కడ చలి తట్టు కోడానికి ఆ బందోబస్తు అంతా.
ఇక మళ్ళీ 530 కి కిందకి దిగి , 2.30 గంటలూ ప్రయాణించి డిన్నర్ కి వెళ్లి, అక్కడ నుండి శయనాగారం కి చేరుకొని, కళ్ళు మూసుకుని ఆ సుందర దృశ్య మాలికని నెమరు వేసుకుంటూ నిద్ర లోకి జారుకున్నాము.
సశేషం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి