ఆహా యూరప్ 9
june 17 th
ఈ రోజు ఉదయం మళ్ళీ యధావిధిగా అన్ని సామాను సర్దుకుని, బస్సు లో ఎక్కించి, 9 కల్లా బయలుదేరి పోయాం.
"ఎక్కడికి?" అన్నాము భూషణ్ తో... "అబ్బబ్బా మీకు ఎన్ని సార్లు చెప్పాలి, ఎక్కడికీ అని అడక్కూదని అని భూషణ్ గయ్ మన్నాడు'. మేమందరమూ గంటు మొహాలు పెట్టుకున్నామని, మళ్ళీ తనే అన్నాడు ఉండండి చెబుతా., అని చెప్పేడు.
తరవాత మేము ఒక గంట ప్రయాణించి.. LUCERN LION MONUMENT ( అక్కడ ఒక సింహం బాణం తగిలి ఏడుస్తూ పడుకున్నట్లు, ఒక పెద్ద రాతి లో చెక్కి ఉంది ) ఎంత బాగుందో, ఆ శిల్పి ఎంత బాగా తన భావాన్ని వ్యక్త పరిచాడో , స్పష్టంగా కనిపిస్తోంది చూద్దురు గాని ఫోటో లో. .
అక్కడ నుండి Broc వెళ్లి అక్కడ The Famous Maison Cailler Swiss Chocolate Factory, outlet shop కి వెళ్లి అక్కడ పిచ్చ్చిగా చాక్లెట్లు కొనుక్కున్నారందరూ. మేము చక్కగా వాటిని చూసుకుని, ఫొటోస్ తీయించుకున్నాము.
బస్సు స్టార్ట్ అయ్యింది, కొంచెం దూరం వెళ్ళేక మా ట్రూప్ లో తమిళియన్ ఒకావిడ చాకొలేట్ షాప్ బయట బాగ్ మర్చిపోయామని, ఖంగారు పడిపోతుంటే, మళ్ళీ భూషణ్ బస్సు వెనక్కి తిప్పించి, అక్కడ లోపల కి వెళ్లి కనుక్కుంటే, ఎవరో దొరికిందని ఇచ్ఛేరని చెప్పి , వాళ్ళు దానిని తిరిగి ఇచ్ఛేసారు. అదీ నిజాయతీ అంటే.
అక్కడ నుండి Inter laken తీసుకెళ్ళేరు. అది మంచి ఫోటో స్పాట్, అద్భుతమయిన ఫొటోస్ తీయించుకున్నాము. ఇవన్నీ ఒక దాని కొకటి అరగంట దూరం లో ఉన్నాయి. మొత్త్తం అన్నీ కలిపి 12 గంటల లోగా చూసుకుని, రోప్ వే దగ్గరకి వెళ్ళేము. అక్కడ టికెట్ కొనుక్కుని రోప్ వే స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళేము. టికెట్స్ ఎక్కడైనా సరే భూషణ్ దే బాధ్యత, అతను కొని మనకిచ్చ్చి, మళ్ళీ మనతో పాటూ వఛ్చి, మనకి చూడమని టైం ఇఛ్చి, కింద వైట్ చేస్తుంటాడు. అదన్నమాట విషయం.
సరే ఎక్కడకి వెళ్లాం rope way మీద? ఊహించండి చూద్దాం... అవునవును వెళ్లిన వారందరూ చెప్పగలరు, వెళ్ళ బోయే వారు, వెళ్ళ లేని వారికీ ఎలా చెప్పక పోతే? సరే ఏం చేస్తాం నేనే చెబుతాను....
ఈ రోజు మేము Mount Titlis, The heighest Peak in Central Switzerland about 10,000 feet height లో ఉన్న మౌంటెన్ కి వెళ్ళేము Cable Cars లో. రెండు కేబుల్ కార్స్ లో వెళ్ళేము.
వర్ణనకి అతీతమైన అనుభవం. ఎటు చూసిన దేవతలు నడయాడిన స్థలమే. కింద నుండి కేబుల్ కార్ నెమ్మదిగా అలా వెళుతుంటే కిందకి చూస్తుంటే అస్సలు ఎవ్వరితో మాట్లాడాలని లేదు, మళ్ళీ పిచ్చ్చి గా కేరంతలు కొట్టాలని, పిచ్చ్చిగా పాటలు పాడాలని ఎదో తెలియని వెర్రి ఆనందం. అన్నట్లు ఆ cable car ఎక్కేప్పుడు నెమ్మదిగా అది నడుస్తుండగా ఎక్కాలి. సరదాగా ఉంది.
అక్కడ నుండి 15 నిమిషాల్లో పైకి వెళ్లి పోయాము. మళ్ళీ అక్కడ లంచ్. ఇండియన్ లంచ్. (ఎప్పుడు చూసినా లంచ్, డిన్నర్ అని రాస్తున్నట్లు గానే ఉంది నాకు, మరి మీకో) అది అవ్వగానే 100 మంది పెట్టె rotating cable car లో 5 నిమిషాలు ప్రయాణించి, దిగాము. అన్ని వైపులా తిరుగుతూ ఆ కేబుల్ కార్ చుట్టూ ఉన్న అన్ని వైపులా మంచు తెరలని చూపించింది.
బయటకి వచ్ఛాక , పైకి లిఫ్ట్ ఉంది. అది ఎక్కి పైకి వెళితే , ఓపెన్ లో పేద్ధ deck చెక్కలతో ఉంది, దాని మీద బెంచెస్ , అక్కడ కూర్చో వచ్చు. లేదంటే నడుచుకుంటూ adventurous గా మంచులోకి వెళ్లి పోవచ్చు.
మేము అందరమూ కొంత దూరం మంచు లోకి వెళ్లి వెనక్కి వచ్చాం. ఆ రోజు కి మేమందరమూ 10,000 height కీ, ఆ మంచుకి adjust అయ్యాము. మాలో ముగ్గురు (మా డాక్టర్ గార్లిద్దరూ, అరుణ) ఇంకొంచెం లోపలికి వెళ్లి ఐస్ ఫ్లయెర్, క్లిఫ్ walk (ఐస్ కొండకీ, ఐస్ కొండకీ మధ్యలో రోప్ బ్రిడ్జి మీద నడవడం లక్ష్మణ్ ఝూలా లాగా ) కి వెళ్లి వచ్చారు. ఇక వర్ణించ లేను, ఫొటోస్ పెడతాను.
ఎటు చూసినా మంచు. తెల్లని వర్ణం లో ఆకాశం నేల ఏకమై ఉంది. "మంచు పల్లకీ" మంచు తో ఆడుకున్నాం. మంచు మీద నుంచ్చున్నాం, మంచు చేత్తొ పట్టుకున్నాం, మంచు పీల్చాము, మంచు చూసాము. అక్కడ "మంచే" సర్వస్వము." ఇంకొంచెం దూరం వెళ్లి వచ్చిన వాళ్ళ ముగ్గురిలో ఎవరైనా వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పాల్సిందే. వీలైతే కామెంట్స్ లో రాయండి ప్లీజ్.
ఇక ఒకే కేబుల్ కార్ లో మార కుండా కిందకి వచ్చేసాం. బస్సు ఎక్కి మా అనుభూతులు పంచుకుంటూ డైరెక్ట్ గా హోటల్ "Movenpick" వచ్చాం.
సామాను సర్దేసుకుని, డిన్నర్ కోసం 10 నిమిషాలు నడచి ఒక పంజాబీ రెస్టారంట్ కి వెళ్ళేము.. అది SWISS BOARDERS లో ఉంది. ఆది వారం అవ్వడం తో నిర్మానుష్యం గా ఉంది. రోడ్ మీద పాలు పోసి ఎత్తుకోవచ్చు, దిండు వేసుకుని నిద్ర పోవచ్చు. రోడ్ మీద పెద్ద టివి పెట్టి, 200 మంది మా హోటల్ పక్కన ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్నారు. పంజాబీ రెస్టారంట్ వాళ్ళు ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించారు. ఆశ్చర్యం కరం గా ఆ హోటల్ glass display లో మన వీణ ఒకటి display చేసి ఉంది, మాలో ఎవరైనా ఫోటో తీసేరో లేదో కానీ, మేము పొరబాటున తియ్య లేదు.
Restaurant దాటగానే ఒక రోడ్, అది దాటితే ఇటలీ లోకి ఎంటర్ అయినట్లే. So Switzerland and Italy Boarder లో road మీద వేసిన కుర్చీల్లో కూర్చుని Boarder చూసుకుంటూ డిన్నర్ చేసేమని చాల అద్భుతమైన ఫీల్ తో రూమ్ కి వెళ్లి ఏమి చేసుంటా మంటారు?
కలల అలలో తేలుతూ హాయిగా నిద్ర పోయాం!
ఇంత పెద్ద ఎపిసోడ్ తీరిగ్గా చదువు కుంటారని, మీకు కొంత విశ్రాంతి ఇస్తున్నా, నేను మళ్ళీ ఆదివారం కనిపిస్తాను.
ఇంత రాసినా తృప్తి తీరడం లేదు ప్చ్ ప్చ్ ప్చ్..
సరే ఉంటా....సశేషం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి