కంచికి వెళ్తే అంతా మంచే
మా గురువుగారికి "నాద నిధి" పురస్కారం
అవునండీ నిజం, ముమ్మాటికీ నిజం. మా గురువు గారు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు క్రితం సారి కంచి ఆస్థానవిద్వాంసులుగా నియమితులై రాగానే, ఇంటికి వచ్చే సరికి సంగీత నాటక ఎకాడమీ అవార్డ్ శుభవార్త.
మరి ఈసారో?
మైసూర్ దత్తపీఠం వారు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజి 75 వ పుట్టిన రోజు వేడుకలలో 9 మంది eminent artists కి "నాద నిధి" పురస్కారంతో సత్కరిస్తున్నారు. వారు...
- శ్రీ అంజాద్ అలీఖాన్.. సరోద్
- కుమారి అవసరాల కన్యాకుమారి.. వయోలిన్
- శ్రీ T.H.వినాయక్ రామ్.. ఘటం
- శ్రీ గురువాయూర్ దొరై.. మృదంగం
- బోంబే సిస్టర్స్ శ్రీమతులు సరోజా & లలిత.. గాత్రం
- శ్రీ అయ్యగారి శ్యామసుందరం .. వీణ
- శ్రీ కదిరి గోపాల్ నాథ్.. సాక్సోఫోన్
- శ్రీయుతులు రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రా హిందుస్థానీ గాత్రం
- శ్రీ వెంకటేష్ కుమార్.. హిందుస్థానీ గాత్రం .
- మా గురువుగారు ఈ అవార్డ్ May 27 th పూజ్య స్వామీజీ కరకమలముల ద్వారా అందుకోబోడం అమితమైన ఆనందం కలగజేస్తోంది. మా శ్రేయోభిలాషులైన మీ అందరితో ఈ శుభ వార్త పంచుకుంటున్నాను..... అయ్యగారి జయలక్ష్మి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి