30, జూన్ 2018, శనివారం

ఆహా యూరప్ 6
June 14 th

అబ్బా ఇంకెత సేపు తెల్లారడానికి?
అయ్యో అదేమిటి అర్ధ రాత్రి ఒంటి  గంట కూడా వాచ్ లో చూసానే, 6  అయ్యింది అప్పుడే,
 పనులు తెముల్చుకోక పోతే ఎలా? అని పరుగులు, పోటీలూ  మా ఆయనతో . ఇవాళ్టికి రెస్ట్ కి  రెస్టే  ఈ పూట.

షరా మామూలు. break fast, ఫొటోస్, ప్రయాణం మొదలు.
అన్నట్లు ఈ రోజు కూడా పెట్టె బేడా సర్దుకుని, బస్సు ఎక్కి పోయాం.

ఇవాళ ఎక్కడికబ్బా?  ఏమిటో మరి ఏమి చూపిస్తాడో భూషణ్ ని చెప్పనివ్వండి , అన్నట్లు రోజూ  రాత్రి దిగే ముందు చెప్తాడు కదా, మర్చి పోయాం ఏమి చెప్పేడో. గొడవ చెయ్యకండి "ఉష్ ఉష్ ఉష్" విననీండి. అదిగో మాట్లాడుతున్నాడు.... (మీకు తెలుసా ఇప్పుడు నేను భూషణ్) ...... 

Today  Drive to Amsterdam. Enjoy a leisurely Canal Cruise, the best way to see this captivating City. Later drive to Germany and there we will see magnificent Cologne Cathedral after wards you can walk and shop there.


అక్కడ నుండి 2 గంటలు వెళ్ళేక , canal cruise ,Amsredam . బస్సు ఆపి బోట్ దాకా నడిపించి టికెట్స్ కొనిఛ్చి, నాలాంటి భయపడుతున్న వాళ్లకి చేయూత నిచ్చ్చి బోట్ ఎక్కించాడు భూషణ్ .  బోట్ తాలూకు window గ్లాస్సెస్ లోంచి అద్భుతం గా  సిటీ మొత్త్తం చూసాం. కేరింతలు కొట్టుకుంటూ కొంతమంది, photos  వీడియో లతో కొంతమంది, సీట్ లోనే కూర్చుని మాట్లాడుకుంటూ కొందరు, మాట్లాడ కుండా ప్రకృతి సౌందర్య ఆరాధన చేస్తూ కొందరు. గంట సేపు వేరే లోకం లోకి వెళ్లి పోయాం.

మళ్ళీ చెయ్యి పట్టుకుని బోట్ లోంచి  జాగ్రత్తగా దింపి, భోజనానికి తీసుకెళ్లి మంచి ఇండియన్ భోజనం పెట్టించాడు భూషణ్. , మళ్ళీ బస్సు దాకా నడచుకుని వెళ్లి, "చలో జెర్మనీ"  నినాదం తో బయలుదేరేము.

జర్మనీ ఎంత అందమైన దేశమండీ. నాకు స్విట్జర్లాండ్ తరువాత  చాల నచ్చ్చిన  ప్రదేశం  జర్మనీ.

 ప్రకృతి  ఒడిలో  పసి పాపాల స్వచ్ఛంగా నడయాడుతోంది, నాట్యం చేస్తోంది జర్మనీ.  బహుశా "చెంగావి రంగు చీర " పాట, ఇక్కడే ఇక్కడే ఇక్కడే, చిత్రీకరించారు అని మా వారు అన్నారు. నిజమయ్యి ఉండవచిచ్చు.  విశాలమైన మైదానాలు,  lawns,  అక్కడక్కడా ఆవులు. Land స్కేప్  ఎక్కువగా ఉంది, అక్కడక్కడా ఇళ్ళు. ఎంత అందముగా ఉందొ. అలా ఎవ్వరితో మాట్లాడకుండా కిటికీలోంచి చూస్తూ కూర్చున్నమందరమూ.

ఇంతలో Cologne Cathedral చూద్దాం దిగమన్నారు భూషణ్.  పొలో మంటూ గొడుగులూ, మంచి నీళ్ల సీసాలో పట్టుకుని దిగి నడుచుకుంటూ బయలుదేరేము.

వాన పెరిగి పోయింది. మేము  Cathedral చూసుకుని (బయటకి చూడ్డానికి పాత గా ఉన్నా, లోపల అద్భుతమైన కళా ఖండాలతో ఉంది) photos తీసుకుని, బయటకి వఛ్చి యావ గా ఆ వాన లోనే షాప్ లు తిరిగి, కొంతమంది ఏవో కొనుక్కుని, మొత్త్తనికి వాన తప్పించుకుంటూ బస్సు ఎక్కేము.

మళ్ళీ మామూలే డిన్నర్ ఇండియన్ రెస్టారంట్ లో,
 విశేషం ఈ రోజు కొద్దిగా ముందుగా రూమ్ కి వెళ్లి ,ఇహ చూసుకోండి రెస్టే రెస్ట్.

 చాలా బిజీ గా ఉన్నాను బాబూ ఇంకా నన్ను డిస్టర్బ్ చెయ్యకండి........

                                       సశేషం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి