27, జూన్ 2018, బుధవారం

ఆహా యూరప్ 3
 జూన్ 10 రాత్రి 11 గంటలకి బయలుదేరి అందరం ఎవరిళ్ల నుండి వాళ్ళు Airport కి చేరుకున్నాము.
check in  పూర్తి చేసుకుని  గేట్ దగ్గరకి చేరుకొని అందరం ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నాము.

తెల్లవారు ఝామున 4.35  బయలు దేరిన  విమానం ఎక్కి, దుబాయ్ చేరుకొని అక్కడ నుండి గేట్ మారి పారిస్ ఫ్లైట్ ఎక్కి 11 జూన్ మధ్యాహ్నం 1.30  కి పారిస్ చేరుకున్నాము. (టైం జోన్ తేడా వల్ల 1.30  అయినా  మన లేఖ్ఖ లో సాయంత్రం 5, యూరప్ మన కంటే 3. 30 గంటలు వెనక ఉంటుంది.)

మేము సామాను తీసుకుని బయటకి వెళ్లేసరికి మా టూర్ మేనేజర్ "భూషణ్"  ప్ల కార్డు  పట్టుకుని మమ్మల్ని స్వాగతించాడు,  అంతే కాదు మా అందరికీ తలో  పేపర్ బాగ్ చేతులో పెట్టేడు.  ఏంటి అది అని చూస్తే " packed lunch"  మేతి పరోటా, రైస్, బొంబాయి శనగల కూర, ఒక స్వీట్, కర్డ్ ఉన్నయందులో, అన్నట్లు మంచి నీళ్ల బాటిల్ కూడా. మేము అది తినే లోగా మా బ్యాచ్ వాళ్ళు ఇద్దరు వేరే ఫ్లైట్ లో చెన్నై నుండి వచ్చ్చేరు.

"చలో యూరప్ టూర్ స్టార్ట్ " బస్సు లో సామాను కింద డిక్కీ  లో డ్రైవర్ పెట్టేసేడు. 16 మంది మీ 40 Seater బస్సు లో దర్జాగా కూర్చుని బయలు దేరేం.

మా టూర్ మేనేజర్ భూషణ్ మైక్ తీసుకుని, ప్రయాణం బాగా సాగిందా అని కుశల ప్రశ్నలు వేసి, మీకు అలసట లేక పోతే ఇప్పుడు 2. 30 అయ్యింది కాబట్టి ఈ రోజు హోటల్ రూమ్ కి అప్పుడే కాకుండా guided city tour, చేసుకుని
ఈఫిల్  Tower చూసుకుందామా?  అన్నారు,సరే మాకేం అలసట లేదన్నాము.

దారిలో మాకు పారిస్ చరిత్ర, జనాభా వివరాలు, క్లుప్తం గా చెప్పేడు . ఈ లోగా  ఒక లేడీ Guide మా బస్సు ఎక్కి ఈఫిల్  టవర్ వచ్ఛేదాకా మాకు కొన్ని ముఖ్యమైన మాన్యుమెంట్స్ చూపించారు.  ( వాటి చరిత్రలడక్కండి నేను చెప్పలేను, చూశానంతే) ఫొటోస్ తీసుకున్నాం దిగి. అవి ఏమంటే....... Place de la concorde, Magestic Arc De Triomphe, Magnificent opera house చూసాము.

ఇక అసలైంది ఈఫిల్ టవర్ చేరుకునేసరికి బాగా మబ్బు పట్టి ఉంది. నిజానికి మేమందరం చిన్న గొడుగులు పట్టుకెళ్ళం, కానీ అన్నీ మా పెట్టెల్లో పెట్టి డిక్కీ లో ఉంచాం, మాకేం తెలుసు అంత హోరున వాన వస్తుందని. బస్సు దిగుతుండగానే సన్న చినుకు మొదలయ్యింది.

నేను దిగను వాన వస్తోంది ,  అంటే మా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు" మేడం! దిగండి, ఇంత రొమాంటిక్ Situation ఒదులుకోకండి పదండి , మర్చి పోయారా? "చిట పట చినుకులు పడుతూ ఉంటె,చెలికాడే సరసన ఉంటే" పాట, గురువుగారు పక్కన ఉండగా వాన లో, ఈఫిల్ టవర్  సందర్శన, పరమ రొమాంటిక్ గా ఉంటుంది. పైన వేడిగా కాఫీ తాగుదాం" అని బాగా inspire చేసి దింపేరు బస్సు.

దిగి నడవడం మొదలవ్వగానే హోరున వర్షం, గొడుగులు పెట్లో , పరుగు పందేలతో  బోలెడంత  దూరం పరుగెట్టి  మొత్త్తనికి ఈఫిల్ టవర్ లెవెల్ 2 కి వెళ్లి చూడ వలసింది, కనిపించిందంతా చూసి, చక్కటి కాఫీ మా డాక్టర్ గారు ఇప్పిస్తే తాగి, ఫోటోలు తీసుకుని వాన లోనే తిరిగి బస్సు చేరుకున్నాము.

మంచి ఇండియన్ రెస్టారెంట్ లో డిన్నర్ చేసుకుని హోటల్  Ibbis   చేరుకొని రాత్రి కి విశ్రాంతి,..... తీసుకున్నాము..

భూషణ్ మాతో పాటే డిన్నర్ చేసి మా హోటల్ లోనే వున్నాడు.

                                                     సశేషం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి