అయ్యగారి సోమేశ్వర రావు గారి సన్మానములు,సత్కారములు............
వీణా పాణి అయిన వాగ్దేవి కరకమలాలను అలంకరించిన వీణ, దైవాంశ గల గంధర్వ వాద్యంగా మన మన్నలను పొందింది. పాడడమే ఎరుగని పామరుడి నుండి పండితుని వరకూ రంజింపజేయగల వాద్యం వీణ.
శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారు మూర్తిలో చిన్న వారైనా కీర్తిలో అనితరమైన స్థాయిని అందుకున్నారు. వారి వాయిద్యం మలయ మారుతంలా చల్లగా, జలపాతంలా ఎగిరి దూకుతూ శ్రోతల హృదయాలను ఆకట్టుకుంటుంది.
సర్వ రంజకమయిన వీణా గానమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ వైణిక తపస్వి నిరాడంబరులు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం " మనసును మరపించేదే గానం. ఇది శాస్త్రీయమా కాదా అనేమీమాంస రాకుండా, ఏ నాదామృతంలో మునిగి తేలుతామో ,అదే నిజమైన గానం"
మొదట్సో చెన్నై AIR నుండి వీణ వాయించే వారు,1948 లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏర్పడిన తరువాత అక్కడ నుండి ఉన్నత శ్రేణి విద్వాంసులుగా అనేక ప్రోగ్రాంలు చేసేరు.
"భారతీ తీర్ధా" వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ నుండి " వీణా కోవిద" బిరుదును పొందారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ కార్య సభ వారి నుండీ "వైణిక రత్న" బిరుదును పొందారు. ఈ సంస్థ దిగ్గజాల్లాంటి పెద్దలతో out standing personality లకు బిరుదులిస్తారు. దీనికి president...Sri Raja Venkatadri AppaRao, Sri Nagapudi Chandra Sekharayya, Supreme court judge మొదలైన వారు.
వీణా వెంకట రమణ దాసు గారు " ఇతడు నా వద్ద రెండు మూడు పర్యాయములు వీణా గానము సల్పి నాడు, అద్భుతముగా వాయించుచున్నాడు, పరిణితికి రాగలడనియు ఎట్టి ప్రోత్సాహమునకైనా అర్హుడు" అని ఉటంకించారట.
"వాగ్గేయ కారక రత్న" హరి నాగభూషణం గారు ఈయన ప్రతిభకు చకితులై "వైణిక బాల భాస్కర" బిరుదమునిచ్చి ఆంధ్ర దేశమున వెంకట రమణ దాసు గారి వలె, సంగమేశ్వర శాస్త్రి గారి వలె చిర స్థాయి అయిన యశస్సు పొందమని దీవించారట.
విజయ నగరం పౌరులు వారిని " వీణా గాన సుధానిధి" బిరుదమునిచ్చారు.
దక్షిణాది దేశంలో అనేక కచేరీలు చేసేరట. ముఖ్యంగా పల్లడం సంజీవ రావు (వేణు గాన ధురీణులు) గారూ, బెంగుళూరు నాగరత్నమ్మ గారూ మొదలగు వారి సమక్షంలో తిరువాయూర్ నందు వాయించి "శహభాష్" అని పించుకున్న ధీశాలి.
ఇక దేవులపల్లి వారూ, ఇంద్పగంటి హనుమఛ్ఛాస్త్రి గారూ, మొదలగు మహామహులు పరవశించి వారిపై గేయాలు రచించేరట.
1955 లో బాపట్ల పురజనులు వారికి కాశీ కృష్ణాచార్యుల వారి కర కమలముల ద్వారా సువర్ణ ఘంటా కంకణమును బహూకరించారట.
"తన మనోభావ వీధుల్లో మెరిసే విరిసే నాదామృతాన్ని మధురిమలై ప్రవహింపచేసి, శాంత జన హృదయాలను ఆనందపు తెప్పలపై ఊయల లూపుతారని" భావించే శ్రోతల భావన కంటే గొప్ప సత్కారం ఇంకేమి కావాలండీ? ఆ వైణిక రత్న కు.
అది చాలదూ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి