చెంచా
"చెంచా" అంటున్నానని కాకా పట్టడం అనుక్కోకండి.
బారిష్టర్ పార్వతీశం టోపీ లా తగలడింది ఈ చెంచా నా పాలిట. అంతే కాదు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా నా మొహం మీద తాండవిస్తూ. విసిరేసినా మళ్ళీ మళ్ళీ కన్పించకుండా వచ్చి చెంచాల స్టాండ్ లో దూరి పోయి కూర్చునుండడమే కాక 🤧🤧🤧 "16 ఏళ్ళ వయస్సు" సినిమా లో చంద్రమోహన్ లాగా తగుదునమ్మా అని ముందుగా అన్నిటికీ తనే తయారు. విసుగు వచ్చేస్తోంది.
కానీ ఇప్పుడే దాని మీద ఎన లేని జాలీ, వ్యామోహం కలిగి చెంచాల స్టాండ్ నుండీ తీసి మాన్యుమెంట్ లాగా భద్రంగా దాచేసా. ఇంక కాళ్ళల్లో పడదు చక్కగా భద్రంగా వుంటుంది.
దాని పరోపకార బుధ్ధికి, నా యందు గల అవ్యాజమైన ప్రేమకు గుర్తుగా దాచుకున్నాను బుజ్జి మున్నను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి