కాలం
ఆగదు, ఆపలేం. అందుకే అన్నారు జ్ఞాపకాలు పదిల పరచుకోమని. ఏమో బాబూ నా కైతే నా జీవితపు మంచి పుటలన్నీ కంఠోపాఠమే.
మొన్న నేను పుట్టగానే శ్యామసుందరం నీకు భార్య పుట్టింది అని టార్చ్ వేసి చూపించారట తెలుసా!
ఐదవ తరగతి శెలవలకు అమ్మ్మమగారి వూరు బాపట్ల, అక్కడ నుండి అత్తయ్యగారు, పెద్దమ్మగార్ల వూరు విజయ వాడ వెళ్ళాం.
బస్ దిగగానే మా పెద్దమ్మగారి అమ్మాయి నన్ను మా బావను ఒకే రిక్షాలో కుదేసింది. రిక్షాలో ఈమూల ఒకరు, ఆ మూలకి ఒకరు తగలకుండా జాగ్రత్త పడ్డాం. మా మధ్య రిక్షాలో ఆమడ దూరం. నిజం నమ్మండి నవ్వకండి.
ఆ సారి మా బావ మాకు విజయవాడ అంతా చూపించడం, సత్యహరిశ్చంద్ర సినిమా అన్నీ మొన్నేగా చూసాం, అరే అప్పుడే ముందుకొచ్చేసామా!
సరే 1968 లో విజయవాడ స్టేషన్లో నేనూ మా నాన్నగారూ, తమ్ముడూ దిగే సరికి బ్రిడ్జ్ మీదనుండి దిగుతూ మా బావ నా వేపు చూసి నవ్వుతే మదిలో కోటి వీణలు మ్రోగాయి, ఇంకా ఆ నాదం చెవుల్లో రింగు రింగు మంటోందిగా.
1969 మేము హైదరాబాదు నుండీ వస్తుంటే మా బావ సైకిల్పై వస్తూ మమ్మల్ని చూసి, ఆగి వెనుదిరిగి ఇంటికి వచ్చేసి (పని మానుకుని) నాకూ మాచెల్లికీ జామ తోటలు చూపించి మంచి సంపెంగ పువ్వు ఇస్తే, ఎన్ని రోజులు పుస్తకంలో దాచుకున్నానూ!
ప్రేమ లేఖలు రాయమంటే ప్రోగ్రస్ రిపోర్ట్ పంపింస్తున్నానని కోపం తెచ్చుకున్నది మొన్ననే కదా! ( అప్పటి పదవ తరగతి పిల్లలంతకంటే ఏం రాస్తారండీ సోద్యం కాకపోతే)
ఇంతలోనే చిటుక్కున బావతో పెళ్ళి, పిల్లలు ,వారి చదువులూ,వారి పెళ్ళిళ్ళూ, మనవలూ మనవరాళ్ళూ.........ఇలా విస్తరించుకుంటూ ఇంత దూరం వచ్చేసామా?
నా మటుకూ గడిచిన కాలం, గడుస్తున్న కాలం అంతా ఆనందమయమే.
నిన్న పుట్టినరోజు పెళ్ళి కొడుకేనండీ ఈ హీరో!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి