29, డిసెంబర్ 2015, మంగళవారం

Gurthukosthunnayi

గుర్తుకొస్తున్నాయి 2

చిన్నప్పుడు టీచర్ దృష్టి లో పడ్డానికి ఎంత తాపత్రయం . వాళ్ళని ఆకర్షించడం కోసం చాల బాగా చదవడం కూడా జరిగేది. టీచర్కి  గులబీలిచ్చిన వాళ్ళు కొందరైతే, ఫస్ట్ బెంచ్లో కూర్చుని, మేము చాలా బాగా చదివేవాళ్ళం అని తెలియ జెయ్యడం కోసం (నిజమయిన సరే, బిల్డుప్ లివ్వడం) ప్రయత్నం కొందరిదీ, ఫ్రెండ్స్ మీద కంప్లైంట్స్ ఇచ్చి తమ సచ్చీలతను చాటుకునే వాళ్ళు కొందరు అవునా కాదా?

  మరి నేనో? ..... మా మీనాక్షీ టీచర్ గారు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడివద్ద  నుండి కొబ్బరి చిప్పలు 25 పైసలకి 2 అమ్ముతారని తెలిసి,కొనుక్కుని రమ్మంటే,కొని ఇవ్వడానికి  ఎంత గొప్ప ఉబలాట పడేదాన్నో (కాయ పడంగా అయితే 50 పైసలు) . ఆవిడ  చేతిలో కొబ్బరి చిప్పలు పెట్టగానే ఆవిడ చూసే చూపు చాలు"ప్రెసిడెంట్ అవార్డు" పొందినంత  ఆనందం.

       మొన్న మేము కలసినప్పుడు ఎన్నెన్ని ఊసులు చెప్పుకొన్నామో! మేము యాదగిరిగుట్ట, కిద్వాయ్ గార్డెన్స్, గోల్కొండ ఎక్స్ కర్షన్  వెళ్ళడం దగ్గరనుండి,
శోభన్ బాబుకి ఇష్టమని లెటర్ రాస్తే (ఒక దోస్త్),  ఆయన ఫోటో పంపుతూ బుద్ధులు చెప్పిన వైనం దగ్గర నుండి ఎన్నో ఎన్నెన్నొ......

  మరి మా సుబ్బలక్ష్మి టీచర్ గూర్చి చెప్పుకోవాలి వచ్చే సంచికలో!  టీచర్ గారూ మిమ్మల్ని  తలచుకున్నాం  చాలా...... సరే మరి ఉంటాను.

    మీకూ  ఏమైనా చెప్పలనుంటే చెప్పండి చదువుకుంటాము...........

24, అక్టోబర్ 2015, శనివారం

అల్లి బిల్లి చందమామ

అల్లిబిల్లి చందమామ ఈ చిన్నారి.............
చిన్ని బాలుడే కానీ..... ఆకాశంలో ఎగరాలని, (పక్షిలాగా), మబ్బులతో నడయాడాలనీ, కాళ్ళకి లేపనాలు పూసుకుని ఆకాశ గమనం చెయ్యాలని, కుక్కపిల్లల మీసాలు పీకాలని, ఇంటికొచ్చిన వారి చెప్పులు దాచేసి వారు వెతుక్కున్టుండగా మళ్ళీ తెచ్చి ఇవ్వాలనీ, ఇలా ఏవేవో చిలిపి తలపులు ఆ బాలుడికి మదిలో వెళ్లి విరిస్తుంటాయి......
ఇక అసలు విషయానికి వద్దాం......
ఒక సారి ఆ బాలుడింటికి వారి మేనమామ వచ్చేరు. ఇక మన చిన్నారికి ఆనందం హద్దులు లేకుండా పొయ్యింది. ఆ వచ్చినాయన బాగ్ లోంచి పేస్టు బ్రష్ తీసుకుని, బ్రష్ మీదా పేస్టు పెట్టుకుని, బ్రష్ చేసుకుందుకు వెళ్ళేరు.
మన బాలుడికి పేస్టు వాసన చూసి అది స్ట్రాంగ్ పిప్పెర్మేంట్ వాసనలా ఉంది అనిపించింది. అంతే బుర్ర పరి పరి విధాల ఆలోచించింది.
కొంచెం తీసుకుని అలమారాలో రౌండ్గా బిళ్ళల లాగా అంటించుకుని (ఆరేక స్ట్రాంగ్ పిప్పెర్మేన్త్స్ అవుతాయనే భావన, భ్రమతో) ఆరేక ఆ స్ట్రాంగ్ బిళ్ళలు తినచ్చని భావించాడు.
ఇంతలో బుర్రలో మరో ఆలోచన తళుక్కున మెరిసి మొహానికి పూసుకుంటే తెల్లగా స్నోలాగా ఉంటుంది కదా అని మొహానికి పూసుకున్నాడు.

మొహం మండి పోతోంది, ఇంతలో మేనమామ పని పూర్తి చేసుకుని వచ్చి చూసి విషయం అర్ధం చేసుకుని ఒళ్ళు మండి కొట్టాలని పించినా మళ్ళీ బాగుండదని (కాబోయే అల్లుడని) నిస్సహాయంగా చాలా ఎక్కువగా ముద్దు లాడి ఏడుపు మొహం పెట్టుకుని ఊరుకున్నారు.
వచ్చిన గెస్ట్ ఊరుకున్నా, వాళ్ళ నాన్నగారూరుకుంటారా? ఊరుకోలేదంతే...ఊరుకోలేదు......

22, మే 2015, శుక్రవారం

నా అంతరంగం.. నా బంగారు తల్లి.......

            
      అవునండి!  నా  బంగారు  తల్లి   నా అంతరంగం.  

              చక్కగా M.Sc Computers  చదువుకుంది.  అర్ధరాత్రి  అపరాత్రి  అని  చూడకుండా  వీణ చెప్తావా  చెప్పవా  అని  పోట్లాడి  మరీ  వీణ  చెప్పించుకునేది. పెళ్లి  అయ్యాక  కాలేజీకి  వాళ్ళ  ఆయన్ని  తీసుకుని  వెడితే  ప్రిన్సిపాల్ గారు  ఈ  బీరువాలో  సగం  ప్రైజులు  మీ  ఆవిడ  తెచ్చి  పెట్టింది,   తద్వారా మా  కాలేజీకి  ఎన్ని  సెలవలు ఇప్పించిందో  అ
              మాకు  ఎంతో న్నారుట.  
ఘనత  చదువుకునేటప్పుడూ  తెచ్చింది,  పెళ్లి  అయ్యాక  న్యూజెర్సీ  వెళితే  తన వీణ  స్టూడెంట్  వాళ్ళ  అమ్మగారు  ఇంత  మంచి  కూతుర్ని  కన్నందుకు  గర్వపడండి అని  చెప్పేరు. ఇంత  కంటే  గొప్ప ఆనందం  ఏముంటుంది.  కన్నవారి  వంశ  ఘనత  అమెరికాలో  కూడా  తను  వాయిస్తూ, తన  కూతుళ్ళు  ఇద్దరి  చేతా వాయిమ్పిస్తూ,  ఇంతే  కాక  బోలెడంతమంది    స్టూడెంట్స్కు  వీణ  నేర్పి వాళ్ళ  చేత  ప్రదర్శనలిప్పిస్తూ, తను సాఫ్ట్ వేర్  ఇంజనీర్గా  జాబ్  చేస్తూ  నిర్వహిస్తోంది.  ఒక్క  మాటలో  చెప్పాలంటే  రూపంతో  సహా  నా  ప్రతిబింబం.

             మా  పెంపకం  మీద  మాకు  ఎనలేని త్రుప్తిని  కలగ  జేస్తోంది.  (సోత్కర్షగా  భావించకండి,  నా  అంతరంగాన్ని  ఆవిష్కరిస్తున్నాను)  మంచి   సంస్కారి,  సమర్ధుడు  అయిన  భర్త,   ఇద్దరు చక్కటి  పిల్లలతో సహా  అమెరికాలో  నివశిస్తోంది.

              ఇక  తన  చిన్నతనమంతా  నేను  సంగీతం,  సంసారంలో  మునిగి  తేలుతున్నాను. డిప్లొమా,  రేడియో  ఆడిషన్కు  తయారయ్యి  విజయాలు పొందడం. ఇది  రెండు  చిన్న  మాటల్లగా  ఉన్నాయి  కానీ  వాటికి  చెయ్యాల్సిన  కృషి  అనంతం.  ఈ  రోజుకీ  చేస్తూనే  ఉన్నాను,  ఊపిరి  ఉన్నంత  వరకూ  చెయ్యాలి.

                   వీణ  నేర్చుకోడం-వాయిన్చుకోడం-వాయించడం,   మా  వారు   వాయిన్చుకుంటూ  ఉండగా వినడం,  తాళం  వెయ్యడం- వెనకాలే  వాయించడం (అన్నట్లు  నోటికి  తాళం  వేసుకోడం),   మా పిల్లలకి  నేర్పించడం-  వాయింపించడం-ప్రదర్శనలిప్పించడం,  ఇక  లెఖ్ఖ లేనంత  మంది  శిష్యులను  తయారు  చెయ్యడం,  ఇంటి  వ్యవహారాలూ  బంధువుల  రాక  పోకలూ  అన్నీ  సవ్యంగా  నిర్వర్తిస్తూ,  కుటుంబ  గౌరవాన్ని ఇనుమడింపచెయ్యడం  పిల్లల  పెళ్ళిళ్ళు, మనవలూ ఇలా  సాగి  పోతోంది  కాలం.......... ఏముందీ  విశేషం  ఇలా  అందరూ  చేస్తారు,   గొప్పలు  కొట్టుకుంటోంది  అనుక్కోకండి, నా అంతరంగ  ఆవిష్కరణ  కాబట్టి  నా  విషయం  నేను  చెప్పుకుంటున్నాను, ఇందులో  గొప్పలకు  తావు  లేదు,  నిష్కర్ష  అయిన  నిజాలివి,  మీరు  కూడా  రాయండి  మేము ఎంతో  ఆనందంగా  చదువుకుంటాము.

           సంగీతం  నా  వృత్తి.....రచన   నా  ప్రవృత్తి.  ఇన్ని  రోజులూ  సంగీతం  అంటూ  ఎంత  సంగీతాన్ని ప్రొవి  చేసుకున్నాను  అని   మీకు  వచ్చే  సందేహాన్ని  నివృత్తి  చెయ్యడం  కోసం,  నేను  వాయించిన  ఒక  రికార్డింగ్  పెడుతున్నాను....వినండి........           

       దేముడా  దేముడా  దేముడా!  ప్లీజ్  ప్లీజ్ ప్లీజ్!   ఇది  చదివిన  అందరూ  నా వీణ  కూడా విని  ఒక లైకో,  కామెంట్  ఇక్కడ  రాసే  ఓపికని,  సహనాన్ని  ప్రసాదించు  దేవుడా...ప్లీజ్.............
         
         https://youtu.be/F4A0pu9hTk4
ఈ లింక్  మీద  క్లిక్  చెయ్యండి............

20, మే 2015, బుధవారం

బావా బావా! మనింట్లో దొంగలు పడ్డారు............. ‘అతి సాహస వీరుడు ......అల్లి బిల్లి చందమామా ‘ కాపురం మూడు పువ్వులూ ఆరు కాయలుగా సినిమాలూ, షికార్లు,, పెయింట్ మజ్జిగ పులుసులూ, గచ్చకాయ కంద బూర్లూ........(అనుభవం ఎక్కువైనా కొద్దీ మరి కొత్త వంటలు ట్రై చేయద్దూ. లేకపోతే ఎంత అవమానం) ఇత్యాదులతో నడుస్తోంది కాలం. ఇంతలో సంక్రాంతి పండక్కి ఆడ పిల్లలూ, అల్లుళ్ళూ , వస్తున్నారని, మమ్మల్ని కూడా రమ్మని మా అత్తగారి నుండి పిలుపు. విజయవాడ వెళ్ళే ట్రైన్ రాత్రి పూట.. రాత్రి అయ్యింది....అన్నం తిని...ఒక గంట తలుపు లోంచి బయటకి వచ్చి బయటనుండి గొళ్ళెం వేసి తాళంవేసేము.. అన్నట్లు తాళం మటుకూ నేనే వేసేనండోయ్ ముందుగా బయలుదేరే ప్రయత్నం మొదలెట్టేము. రోడ్ మీదకి ఉండే మెయిన్ డోర్ లోపల నుండి గొళ్ళెం పెట్టి వెనక .! మా ఆయన ఎక్కడ సరిగ్గా వేయరో అని. మా పోర్షన్ మూలకుంది కాబట్టి వెనక్కి వచ్చి చివరి దాక వస్తేనే మా ఇంటి వెనక తలుపు కనపడేది ఎవరికైనా....... సరే బెజవాడ వెళ్లి, పండగ హడావిడి....తలంట్లు, కొత్త బట్టలు, పులిహార బొబ్బట్లు, సాయంత్రం “భార్య బిడ్డలు” అనుక్కుంట A.N.R, Jayalalitha, Krishna KUmari సినిమా దుర్గ కళామందిర్లో (ఎలాగోలా టికెట్ సంపాయించుకుని), ఫ్యామిలీ మొత్తం చూసొచ్చాం. హమ్మయ్య పండగ ఎంత బాగా జరిగిందో అని అందరం మురిసి పోయాం. మర్నాడు కనుము. కనుమునాడు మినుము అంటూ మా పెద్దత్తయ్య చేసినవన్నీ తిని, అన్నట్లు ఇక్కడ కూడా సహాయకురాలిగా నా విద్యుక్త్ ధర్మం నిర్వహించి. అత్తవారి మన్ననలు పొంది, అంతులేని త్రుప్తితో తిరిగి హైదరాబాద్ వచ్చాం. సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఆటో ఎక్కాం...........ఇంటికి వచ్చాం. మా ఆయన ఆటో డబ్బులిస్తున్నారు, నేను ఈ లోగా లొడా బిడా వెనక తలుపు దగ్గరకి వచ్చి అవాక్కయ్యాను, పరుగెత్తుకుంటూ బయటకి వెళ్లి ఆయస పడుతూ “బావా బావా! మనింట్లో దొంగల పడ్డారు” అని అరిచేను. ఆటో వాడితో సహా ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మగువలు కొందరూ,, అరుగు మీద కూర్చుని ప్రకృతి సౌందర్య ఆరాధన చేస్తున్న మగవారు కొంత మంది వచ్చేరు పరుగెత్తుకుంటూ....... భయ పడిపోయాను? మా ఇంట్లో ఉన్న “చిన్న అన్నం గిన్నె, రైస్ కుక్కర్, మిల్క్ కుక్కర్, ఇత్తడి పప్పు గిన్నె, మా ఒత్తుల స్టవ్ , మా రెండు స్టీల్ గిన్నెలు, మా మూకుడు, మా మంచం పరుపులూ” ఎత్తుకు పోతే? మాకు ఎలా? అప్పుడు అవే ఎక్కువ కదా మరి............ అందుకే అరిచా గట్టిగా “బావా బావా మనింట్లో దొంగలు పడ్డారని” సరే ఇక అసలు విషయం ఏమిటో మీరే గ్రహించండి... మీ కోసం ఈ ఫోటోలు..............

..
                  

అతి  సాహస  వీరుడు ......అల్లి బిల్లి   చందమామా    కాపురం  మూడు  పువ్వులూ  ఆరు  కాయలుగా  సినిమాలూ,  షికార్లు,,   పెయింట్  మజ్జిగ  పులుసులూ,  గచ్చకాయ  కంద  బూర్లూ........(అనుభవం  ఎక్కువైనా  కొద్దీ  మరి  కొత్త  వంటలు  ట్రై  చేయద్దూ.  లేకపోతే  ఎంత  అవమానం)  ఇత్యాదులతో  నడుస్తోంది  కాలం.

            ఇంతలో  సంక్రాంతి  పండక్కి  ఆడ  పిల్లలూ,  అల్లుళ్ళూ ,  వస్తున్నారని,  మమ్మల్ని కూడా  రమ్మని  మా  అత్తగారి  నుండి  పిలుపు.  విజయవాడ  వెళ్ళే ట్రైన్  రాత్రి  పూట..  రాత్రి  అయ్యింది....అన్నం తిని...ఒక  గంట ముందుగా  బయలుదేరే  ప్రయత్నం మొదలెట్టేము.  మెయిన్  డోర్ తలుపు  లోపల్నించి  లాక్  చేసి బ్యాక్  డోర్  తలుపు  లోంచి  బయటకి  వచ్చి  బయటనుండి  గొళ్ళెం వేసి  తాళంవేసేము.. అన్నట్లు  తాళం  మటుకూ  నేనే  వేసేనండోయ్! మా  ఆయన  ఎక్కడ  సరిగ్గా  వేయరో  అని.  మా పోర్షన్  మూలకుంది  కాబట్టి  వెనక్కి  వచ్చి  చివరి  దాక  వస్తేనే  మా ఇంటి  వెనక  తలుపు  కనపడేది ఎవరికైనా.......

             సరే  బెజవాడ  వెళ్లి,  పండగ హడావిడి....తలంట్లు, కొత్త బట్టలు, పులిహార  బొబ్బట్లు,  సాయంత్రం  భార్య బిడ్డలు  అనుక్కుంట  A.N.R,  Jayalalitha, Krishna KUmari  సినిమా  దుర్గ  కళామందిర్లో  (ఎలాగోలా  టికెట్ సంపాయించుకుని),   ఫ్యామిలీ  మొత్తం  చూసొచ్చాం.  హమ్మయ్య  పండగ  ఎంత  బాగా  జరిగిందో అని అందరం  మురిసి  పోయాం. మర్నాడు  కనుము.  కనుమునాడు  మినుము అంటూ మా పెద్దత్తయ్య  చేసినవన్నీ  తిని,  అన్నట్లు  ఇక్కడ  కూడా సహాయకురాలిగా  నా  విద్యుక్త్ ధర్మం  నిర్వహించి.  అత్తవారి  మన్ననలు  పొంది,  అంతులేని  త్రుప్తితో  తిరిగి  హైదరాబాద్  వచ్చాం.

               సికింద్రాబాద్  స్టేషన్  నుండి ఆటో  ఎక్కాం...........ఇంటికి  వచ్చాం.  మా  ఆయన  ఆటో  డబ్బులిస్తున్నారు,  నేను  ఈ లోగా లొడా బిడా  వెనక  తలుపు  దగ్గరకి  వచ్చి  అవాక్కయ్యాను,  పరుగెత్తుకుంటూ  బయటకి  వెళ్లి  ఆయస  పడుతూ  బావా  బావా!  మనింట్లో  దొంగల పడ్డారు అని  అరిచేను.  ఆటో  వాడితో  సహా  ఇంటి  ముందు  ముగ్గు  వేస్తున్న  మగువలు కొందరూ,,   అరుగు  మీద  కూర్చుని  ప్రకృతి  సౌందర్య  ఆరాధన చేస్తున్న   మగవారు  కొంత  మంది  వచ్చేరు  పరుగెత్తుకుంటూ.......  భయ పడిపోయాను?  మా ఇంట్లో ఉన్న  చిన్న  అన్నం గిన్నె, రైస్ కుక్కర్,  మిల్క్  కుక్కర్, ఇత్తడి  పప్పు  గిన్నె,  మా  ఒత్తుల  స్టవ్ ,  మా రెండు  స్టీల్  గిన్నెలు, మా మూకుడు, మా మంచం పరుపులూ  ఎత్తుకు పోతే?  మాకు  ఎలా?   అప్పుడు  అవే  ఎక్కువ  కదా మరి............
   అందుకే  అరిచా గట్టిగా  బావా  బావా  మనింట్లో  దొంగలు  పడ్డారని 

సరే ఇక అసలు  విషయం  ఏమిటో  మీరే    గ్రహించండి... మీ కోసం   ఈ   ఫోటోలు..............

19, మే 2015, మంగళవారం

బావా బావా! మనింట్లో దొంగలు పడ్డారు.........

బావా  బావా!  మనిం
ట్లో  దొంగలు   పడ్డారు.............
       
                అవక  తవక  ఆంజనేయులు......అల్లి బిల్లి   చందమామా    కాపురం  మూడు  పువ్వులూ  ఆరు  కాయలుగా  సినిమాలూ,  షికార్లు,,   పెయింట్  మజ్జిగ  పులుసులూ,  గచ్చకాయ  కంద  బూర్లూ........(అనుభవం  ఎక్కువైనా  కొద్దీ  మరి  కొత్త  వంటలు  ట్రై  చేయద్దూ.  లేకపోతే  ఎంత  అవమానం)  ఇత్యాదులతో  నడుస్తోంది  కాలం.

            ఇంతలో  సంక్రాంతి  పండక్కి  పిల్లలందరూ  వస్తున్నారని,  మమ్మల్ని కూడా  రమ్మని  మా  అత్తగారి  నుండి  పిలుపు.  విజయవాడ  ట్రైన్  రాత్రి  పూట..  రాత్రి  అయ్యింది....అన్నం తిని...ఒక  గంట  ముందు  రోడ్  మీదకి  ఉండే మెయిన్  డోర్  లోపల నుండి గొళ్ళెం  పెట్టి  వెనక  తలుపు  లోంచి  బయటకి  వచ్చి  బయటనుండి  గొళ్ళెం వేసి  తాళం వెసం. అన్నట్లు  తాళం  మటుకూ  నేనే  వేసేనండోయ్.!  మా  ఆయన  ఎక్కడ  సరిగ్గా  వేయరో  అని.  మా పోర్షన్  మూలకుంది  కాబట్టి  వెనక్కి  వచ్చి  చివరి  దాక  వస్తేనే  మా ఇంటి  వెనక  తలుపు  కనపడేది ఎవరికైనా.......

             సరే  బెజవాడ  వెళ్లి  పండగ హడావిడి....తలంట్లు, కొత్త బట్టలు, పులిహార  బొబ్బట్లు,  సాయంత్రం  భార్య బిడ్డలు  అనుక్కుంట  A.N.R,  Jayalalitha, Krishna KUmari  సినిమా  దుర్గ  కళామందిర్లో  ఎలాగోలా  టికెట్ సంపాయించుకుని,   ఫ్యామిలీ  మొత్తం  చూసొచ్చాం.  హమ్మయ్య  పండగ  ఎంత  బాగా  జరిగిందో అని అందరం  మురిసి  పోయాం. మర్నాడు  కనుము.  కనుమునాడు  మినుము అంటూ మా పెద్దత్తయ్య  చేసినవన్నీ  తిని,  అన్నట్లు  ఇక్కడ  కూడా సహాయకురాలిగా  నా  విద్యుక్త్ ధర్మ  నిర్వహించి.  అత్తవారి  మన్ననలు  పొంది,  అంతులేని  త్రుప్తితో  తిరిగి  హైదరాబాద్  వచ్చాం.

               సికింద్రాబాద్  స్టేషన్  నుండి ఆటో  ఎక్కాం...........ఇంటికి  వచ్చాం.  మా  ఆయన  ఆటో  డబ్బులిస్తున్నారు  నేను  ఈ లోగా లొడా బిడా  వెనక  తలుపు  దగ్గరకి  వచ్చి  అవాక్కయ్యాను,  పరుగెత్తుకుంటూ  బయటకి  వెళ్లి  ఆయస  పడుతూ  బావా  బావా!  మనింట్లో  దొంగల పడ్డారు అని  అరిచేను.  ఆటో  వాడితో  సహా  ఇంటి  ముందు  ముగ్గు  వేస్తున్న  మగువలు కొందరూ,,   అరుగు  మీద  కూర్చుని  ప్రకృతి  సౌందర్య  ఆరాధన చేస్తున్న   మగవారు  కొంత  మంది  వచ్చేరు  పరుగెత్తుకుంటూ.......  భయ పడిపోయానుదా?  మా ఇంట్లో ఉన్న  చిన్న  అన్నం గిన్నె, రైస్ కుక్కర్,  మిల్క్  కుక్కర్, ఇత్తడి  పప్పు  గిన్నె,  మా  ఒత్తుల  స్టవ్ ,  మా రెండు  స్టీల్  గిన్నెలు, మా మూకుడు, మా మంచం పరుపులూ  ఎత్తుకు పోతే?  మాకు  అప్పుడు  అవే  ఎక్కువ  కదా మరి............
   అందుకే  అరిచా గట్టిగా  బావా  బావా  మనింట్లో  దొంగలు  పడ్డారని 
సరే ఇక అసలు  విషయం  ఏమిటో  మీరే    గ్రహించండి... మీ కోసం   ఈ   ఫోటోలు..............

       

గారెలు

గారెలు........
 రోజులు గడుస్తున్నాయి.....పెద్ద  గృహిణిని   అయిపోయానని  నాకు  నేను  భావించి,  నన్ను  నేను  గొప్ప  ఇల్లాలుగా  మా  ఆయన  వద్ద  నిరూపించుకుందుకు,   ఎలాగూ  నానుడి  ఉంది  కదా  తింటే  గారెలు  తినాలని  వింటే  భారతం  వినాలనిఅనీ,  గారెల  పప్పు  నానపోసాను.    కొంచెం సేపయ్యాక  ప్రాసెస్  మొదలెట్టేను. రుబ్బుదామంటే  చెయ్యి  తిరగట్లేదు,  ఈజీగా  ఉంటుందని  నీళ్ళు  పోసుకుంటూ.... దాన్ని  దోశల  పిండిలా  పల్చగా  రుబ్బేసాను.  

      ఎలా  గారెలు  ఆకారం   తీసుకు  రాడం,,    ఇంట్లో  ఉన్న  (బహుసా)  బియ్యప్పిండి  బోలెడంత  వేసేను,  గారెల  పిండి  రెడీ.  సరే! ఇది  ఒక  ఎత్తు  అవుతే,  వేయించడం.........  వేడి  సెగలొస్తున్న   నూనె   లోకి  ఎత్తు నుంచి  మధ్యలోకి  గారెల  పిండి  వెయ్యడం.  (అన్నట్లు  ముందు దాన్ని  ప్లేట్  మీద గారెలాగా  చేసి, రంధ్రం  పెట్టేక,  ప్లేట్  మీంచి  చేతిలోకి  తియ్యడం  రాట్లేదు,  అతి కష్టం మీద చేతిలోకి  తీసుకుని  నూనేలో  వేస్తే  వేడి  వేడి  నూనె చిందులు  చేతి  మీద పడ్డాయి. ఆక్షణం లోనే  తీవ్ర  నిర్ణయం  చేసుకున్నా,  ఇంకెప్పుడూ  గారెలు  చెయ్యనని)

       సరే  ఘుమ  ఘుమలాడే  గారెలు  రెడీ.  మరి  ఎంతో  గొప్పగా  మా  ఆయనకి  పెట్టేను............... నోట్లో  పెట్టుకుని  దిక్కులు  చూస్తున్నారు,  ఇంతలో  తలుపు  మీద  దడ దడ దడా  బాడుతున్నరెవరో.  తలుపు  తీసి  చూద్దును కదా,  మా  తమ్ములున్గారులిద్దరూ............సంతోషం  ,   మా  ఆయన  వాళ్ళిద్దర్నీ  (12,13 వయస్సు వాళ్ళిద్దరూ) మీ అక్క  గారెలు  చేసింది  తినమనిచ్చారు.

        వాళ్లండీ అయ్యో  మన  అక్క  కదా, రాయి  లాంటి  గారెలు  చేసింది,  మనం  కాపాడాలి,  కష్ట పడిందీ  అని  ఒక్క పిసరు  కనికరం, లేకుండా.....ఛీ ఇవి  గారెలా.....అనుక్కుంటూ  గోడ  కేసి  కొట్టడం,  తిరిగ  పట్టుకోడం,  మళ్ళీ గోడకి  బంతిలా   కొట్టి  ఆడుకోడం. ( కానీ అది  బంతిలా లేదుగా,  రాయిలా ఉందిగా. వాళ్ళ  చేతికే  దెబ్బలు  తగిలాయి,  లేక  పోతే  నన్ను  సేవ్  చెయ్యరా, మంచి  పని  అయ్యింది  అని  సణుక్కున్నాను)

             ఇక  చివరిగా ఒక  కొస మెరుపు......మా పెద్ద తమ్ముడు  చేత మా అమ్మగారు  నల్లగుంట  నుండి  లోకల్ ట్రైన్ లో సీతఫల్మండీకి   మాకు పది  జంతికలు  పంపి,  ఆ విషయాన్నీ  చీటీ రాసి,  వాడి  చేత పంపేరు,  నేను  దాని  మీద  ముట్టి నది అని సంతకం పెట్టాలిట.  ఎందుకంటే  వాడు  దారిలో  వాటిని  ఆరగించేస్తాడేమోనని కల్గిన అనుమానానికి  పరిష్కారం  ఇది.  ఇంట్లో  తిన్నా  మళ్ళీ  జంతికలు  చేతిలో  ఉంటే తినకుండా  ఉండగలరా  ఎవరైనా?  
                               
           అప్పట్లో  ఆటో  సీతాఫల్మండి  నుండి  సికింద్రాబాద్  స్టేషన్కు 80  నయపైసలు,  ద్రాక్షపళ్ళు కిలో  80 పైసలు, యాబియ్యం  కిలో రెండు  రూపాయల  చిల్లర, నూనె  నలుగు  అయ్యిందని  బాధ  పడి  పోయాం.  కాబట్టి  ఇది  వరకు  అని  గత స్మృతులు  తలచుకుంటే  ఆశ్చర్యంగా  ఉందంటే  అర్ధం  మనం  చాలా........పెద్ద  వాళ్లమయినట్లు.  కానీ  ఒట్టేసి  చెబుతున్నా,  నాకు  ఇదంతా  నిన్నా   మొన్నా  జరిగినట్లుంది?

  ఇలా  సాగుతోంది  హైదరాబాద్  కాపురం.......ఇంతలో  మా బుజ్జి  గాడు   విజయాదిత్య  పుట్టేడు.... సశేషం.......
         

  

18, మే 2015, సోమవారం

జీవన యానం..........

జీవన  యానం............

                      వంట.......రాదు.,  పని..రాదు.

       చిన్న పిల్ల  పాపం పదహారు  సంవత్సరాలే  కదా!  అనుక్కుందుకు  లేదు.  ఆ  వయస్సుకు  చక్కగా  పని చేసేవారుంటారు.  మనకి  పని,  వంట  ఇష్టం లేదు,  అస్సలు  రాదు.  ఎంగిళ్ళు ఎత్తమంటే  ఒళ్ళు  మంట.  ఇదీ  పెళ్ళికి  నా  పరిస్థితి.

               సరే!   పెళ్లి  అవ్వగానే  హైదరాబాద్  కాపురం..........కొత్త  ఇంట్లోకి తూర్పు  లోంచి  దేముడిని  పట్టుకుని  ఎంటర్  అవ్వమని  పెద్దల  సూచన.  మరి  మనకి  తూర్పు  పడమరలు  తెలిస్తేగా,  వెంట  పెద్దలుంటేగా?  హడావిడిగా  దేముడిని  పట్టుకుని  పడమర  ఫేసింగ్ ఉన్న  మెయిన్  డోర్ లోంచి  ఇంట్లోకి  ఎంటర్ అయ్యా....... 

          అయ్యా  బాబోయ్ ! నస నస నస.  ఎవరు?  ఇంకెవరు?  మా  శ్రీవారు...... పోనీ  తూచ్!  మళ్ళీ  ఇంట్లోంచి  బయటకు  వెళ్లి  పోయి  తూర్పు  లోంచి  వస్తానంటే  కుదరదుట. అంత  వరకు  బావగా  కబుర్లు  చెబుతూ,  ప్రేమిస్తూ,  సినిమాలు  చూపిస్తుండే  శ్యామసుందరం  బావ  ఏమిటి  మొగుడయ్యేసరికి  ఇలా  నస? 

           ఇంతలో  వంట  స్టార్ట్.........పాపం  తనకు  కూడా  వండడం  రాదు...అయినా  నాకు  సూచనలిచ్చే  పేరుతో  మెయిన్  వంట  పనులు  తను  చేస్తూ  నన్ను  బీరకాయ  కొత్తిమీర  కారం  చేస్తానని,  బీరకాయలు  తరగమన్నారు. అంటే  అసిస్టంట్  పనులన్నమాట.  నేను ముద్ద పప్పూ, ఆలుగడ్డ  వేపుడూ,  కంది పొడి,  మజ్జిగా  అన్నం  తప్ప  తినను. ముఖ్యంగా మజ్జిగ  నా జీవన  ఆధారం. ఈ పరిస్థితిలో  బీరకాయ  ఎవరైనా  వేపుడు  చేస్తారు  కానీ, కొత్తిమీర, ఖారం  చేస్తారా?  కొత్తిమీర  ఖారంట  కొత్తిమీర  ఖారం అని మనస్సులో  గునుపు.  (వంటలన్నీ   తెలిసి  చచ్చినట్లు,  తినడం  రాని  వాళ్లకి  వివరాలేం  తెలుస్తాయి)

             సరే  ఇక   తప్పదు  కదా  తరగడం  మొదలెట్టాను... దానికి  తొక్క   తీయడం  రాక  పెద్ద  పెద్ద పెచ్చులు  పీకి,  బీరకాయ  పెన్సిల్స్  రెడీ.  అవి  కొంచెం  పొడుగ్గా  బెత్తాల్లా  ఉండి  ఉంటే  రెండు  తగిలించాలని పించేది  బహుసా.  కాకపోతే  మరీ  కొత్త పెళ్ళాం, కొత్త  కాపురం  బెదిరి  పోతానని   ఊరుకుని  ఉంటారు. అన్నట్లు  బాగ్రౌండ్  మ్యూజిక్ లాగా  నస, నస, నస.

       ఇంతటితో  సరి పోయిందా? ఇప్పుడు  పచ్చిమిరపకాయలూ, కొత్తిమీర ఉప్పు  కలిపి  దంచాలి.  లక్కీగా  అక్కడ  ఒక  బుజ్జి  రోలు  నేలలో  తాపడం  చేసి  ఉంది , పక్కనే  ఒక చిన్న  రోకలి  కూడా ఉంది.  దానిని  కడిగి,  దానిలో ఈ పదార్ధాలు  వేసి  దంచడం  మొదలెట్టా. కడిగాక  నీళ్ళు అన్నీ  గుడ్డ పెట్టి  తుడవాలనే ఇంగితజ్ఞానం  లేక పోడం  వల్ల దానిలోంచి  పచ్చిమిరపకాయలు  ఎగిరి  కంట్లో  పడ్డాయి,  అయ్యో  కళ్ళు మంట  అని  ఏడ్చుకుంటూ.....దంచుతూ  పచ్చిమిరపకాయను కదుపుతున్న  ఆ కుడి  చెయ్యితో  కన్నీళ్లు  తుడుచుకునే  ప్రయత్నం  చేశా................అమ్మో   నాయనో.......బాబోయ్.....మంట.....మంట....మంట..  పరాకాష్ట లో  ఉంది  మంట.  ఆ టైములో  మరి  మన  బాగ్రౌండ్  మ్యూజిక్  మాటేమిటి?  ఉండొద్దూ?  ఖంగారు  పడకండి. నిక్షేపంగా  ఉంది.  నస, నస, నస. 
  
          మరి  చేసినది  తప్పేను,  రాంగ్  ఫేసింగ్  లోంచి ఎంటర్  అయ్యాను  కదా..  కానీ  ఏమయ్యింది  సుఖంగా,  శుభ్రంగా  ఉన్నాం.....కుడి  ఎడమైతే  పొరబాటు  లేదోయ్!  ఓడి పోలేదోయ్!

         ఆప్పుడర్ధమయ్యింది   పెళ్ళంటే  ఊసులు,  గుసగుసలూ,  కోపాలూ,  తాపాలూ,  నసలూ,  నసుగుళ్ళూ,   గునుపులూ,  అప్పుడప్పుడు  గునపాలూ.........  ఏది  ఏమైనా  భార్యా  భర్తల మధ్య  కోప  తాపాలు  అద్దం  మీద  అవగింజలా  అరక్షణంలో  జారి పోవాలి.  మేము  అవలంబించిన  ఈ  చిన్న   సూక్తి  ఇది..........

                              రేపు  మళ్ళీ   కలుద్దాం...............(సశేషం)